MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • 120 ఏళ్ళు నిద్రపోవాల్సిన వ్యక్తి మధ్యలోనే మేల్కొంటే ? ఓటీటీలో చూడాల్సిన టాప్ 5 స్పేస్ థ్రిల్లర్ మూవీస్ ఇవిగో

120 ఏళ్ళు నిద్రపోవాల్సిన వ్యక్తి మధ్యలోనే మేల్కొంటే ? ఓటీటీలో చూడాల్సిన టాప్ 5 స్పేస్ థ్రిల్లర్ మూవీస్ ఇవిగో

Top 5 Best Space Thriller Movies: స్పేస్ సైన్స్ నేపథ్యంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని టాప్ 5 బెస్ట్ స్పేస్ థ్రిల్లర్ చిత్రాల జాబితా ఈ కథనంలో ఉంది. 

3 Min read
Author : Tirumala Dornala
Published : Mar 14 2026, 05:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
OTT Movies
Image Credit : Asianet News

OTT Movies

అంతరిక్షం గురించి తెలుసుకోవాలనే కుతూహలం అందరిలో ఉంటుంది. శాస్త్రవేత్తలు ఈ విశ్వం, అంతరిక్షం గురించి ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. అంతరిక్షానికి సంబంధించిన అంశాలతో వెండితెరపై అద్భుతమైన చిత్రాలు కూడా వచ్చాయి. స్పేస్ సైన్స్ థియరీ లని బేస్ చేసుకుని ఇంటర్‌స్టెల్లార్‌ లాంటి అద్భుతమైన స్పేస్ మూవీస్ వచ్చాయి. ఇంటర్‌స్టెల్లార్‌ తో పాటు ప్రేక్షకులని కట్టిపడేసే మరికొన్ని స్పేస్ సినిమాలు ఓటీటీలో ఉన్నాయి. ఓటీటీలో తప్పక చూడాల్సిన టాప్ 5 స్పేస్ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఇంటర్‌స్టెల్లార్‌ (Interstellar)
Image Credit : stockphoto

ఇంటర్‌స్టెల్లార్‌ (Interstellar)

స్పేస్ సైన్స్ నేపథ్యంలో వచ్చిన అత్యంత గొప్ప చిత్రాల జాబితాలో ఇంటర్‌స్టెల్లార్‌ ముందు వరుసలో ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నోలెన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా సినీ అభిమానులని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంతరిక్షానికి సంబంధించిన విజువల్స్, కథ కథనాలు ప్రేక్షకులని కట్టిపడేశాయి. ఈ సినిమాలో కొన్ని అంశాలు అందరికీ అర్థం కానప్పటికీ విజువల్ గా మెప్పించింది ఈ మూవీ.

కథాంశం: భూమిపై మనుషుల జీవనం కష్టం అవుతుంది. దీనితో నాసా చేపట్టిన సీక్రెట్ మిషన్ లో భాగంగా భూమిలాగా మనుషుల నివాసానికి అనుకూలంగా ఉండే గ్రహాన్ని కనుగొనడానికి హీరో అతడి టీం బయలుదేరుతుంది. ఈ క్రమంలో వాళ్లకు ఎదురైనా సవాళ్లు, వివిధ గ్రహాలపై వాళ్లకు ఎదురయ్యే పరిస్థితులు థ్రిల్లింగ్ గా ఉంటాయి.

ఎక్కడ చూడాలి : ప్రైమ్ వీడియో/ జియో హాట్ స్టార్

36
ది మార్షియన్ (The Martian)
Image Credit : Asianet News

ది మార్షియన్ (The Martian)

ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు మాట్ డామన్ హీరోగా నటించారు. రిడ్లీ స్కాట్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అద్భుతమైన స్పేస్ సైన్స్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. మార్స్ పై సర్వైవల్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటుంది.

కథాంశం: కొందరు వ్యోమగాముల బృందం మార్స్ పై పరిశోధనలు చేయడానికి వెళతారు. అనుకోకుండా ధూళి తుఫాన్ వారిని ముంచెత్తుతుంది. ఈ ప్రమాదంలో హీరో గాయపడతాడు. అతడు మరణించాడనుకుని మిగిలిన టీం అత్యవసరంగా భూమిపైకి తిరుగు ప్రయాణం మొదలు పెడుతుంది. కానీ చాలా దూరం ప్రయాణించిన తర్వాత హీరో బ్రతికే ఉన్నాడు అని తెలుస్తుంది. కొంతకాలం పాటు హీరో మార్స్ పై ఒంటరి పోరాటం చేయక తప్పలేదు. అతడు మార్స్ పై ఎలా సర్వైవ్ అయ్యాడు ? చివరికి అతడు భూమిపైకి ఎలా తిరిగి వచ్చాడు ? అనేది మిగిలిన కథ.

ఎక్కడ చూడాలి : జియో హాట్ స్టార్

46
పాసెంజర్స్ (Passengers)
Image Credit : Asianet News

పాసెంజర్స్ (Passengers)

హాలీవుడ్ దర్శకుడు మోర్టన్ టైల్డం దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ కాన్సెప్ట్ భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది. భూమిపై మనుషులు జీవించడం కష్టం అయిన తర్వాత మరో గ్రహంపైకి వెళ్లే కథాంశంతోనే ఈ చిత్రం రూపు దిద్దుకుంది.

కథాంశం: భవిష్యత్తులో భూమిపై జీవించడం కష్టంగా మారే పరిస్థితులు నెలకొంటాయి. దీనితో ఒక స్పేస్ సంస్థ అవలన్ అనే స్పేస్ షిప్ తయారు చేసి అందులో 5000 మంది ప్రజలు కొందరు సిబ్బందిని హోమ్ స్టెడ్ 2 అనే గ్రహం పైకి పంపాలని అనుకుంటుంది. ఆ గ్రహాన్ని చేరుకోవాలంటే స్పేస్ షిప్ 120 ఏళ్ళు ప్రయాణం చేయాలి. అప్పటి వరకు ప్రజలు జీవించి ఉండడం కష్టం. దీనితో ప్రజలని స్పేస్ షిప్ లో ఎవరికీ కేటాయించిన స్లీప్ ఛాంబర్స్ లో ఘాడ నిద్రలోకి వెళ్లేలా, 120 ఏళ్ళ తర్వాత మేల్కొనేలా ఏర్పాట్లు చేస్తారు. స్పేస్ షిప్ 30 ఏళ్ళు ప్రయాణించిన తర్వాత సాంకేతిక లోపం తలెత్తుతుంది. హీరో ఉన్న స్లీప్ ఛాంబర్ దెబ్బ తింటుంది. దీనితో అతడు 90 ఏళ్ళు ముందుగానే నిద్ర లేస్తాడు. తిరిగి నిద్రపోవడం కష్టం. స్పేస్ షిప్ లో ఒంటిరిగా జీవించడం నరకంగా మారుతుంది. తోడు కోసం హీరోయిన్ స్లీప్ ఛాంబర్ లో కూడా సాంకేతిక లోపం వచ్చేలా చేసి ఆమె మేల్కొనేలా చేస్తాడు. మిగిలిన కాలం వాళ్ళు ఎలా జీవించారు, హీరోయిన్ కి నిజం తెలిసిందా అనేది మిగిలిన కథ.

ఎక్కడ చూడాలి: నెట్ ఫ్లిక్స్

56
సన్ షైన్ (Sunshine)
Image Credit : Asianet News

సన్ షైన్ (Sunshine)

డానీ బాయిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూర్యుడిపై చేపట్టే స్పేస్ మిషన్ గా తెరకెక్కింది. ఈ చిత్ర కథ, కథనాలు థ్రిల్లింగ్ గా ఉంటాయి.

కథాంశం: భవిష్యత్తులో సూర్యుడి శక్తి తగ్గి చల్లబడిపోవడం ప్రారంభిస్తాడు. దీనితో భూమిపై మానవజాతి మనుగడ కష్టం అవుతుంది. తిరిగి సూర్యుడు యధావిథిగా మండేలా చేయడానికి వ్యోమగాములు ఒక మిషన్ చేపడతారు. ఈ మిషన్ ప్రకారం సూర్యుడికి దగ్గరగా వెళ్లి ఒక పెద్ద అణు బాంబుని స్యూర్యుడిపై పేల్చి తిరిగి మండేలా చేయాలి అని అనుకుంటారు. ఈ మిషన్ లో వాళ్లకు అత్యంత కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయి.

ఎక్కడ చూడాలి : ప్రైమ్ వీడియో

66
అంతరిక్షం (Antariksham 9000 KMPH)
Image Credit : Asianet News

అంతరిక్షం (Antariksham 9000 KMPH)

తెలుగులో తెరకెక్కిన స్పేస్ మూవీ ఇది. వరుణ్ తేజ్ హీరోగా, సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఇది ఒక మంచి అటెంప్ట్ అనే చెప్పాలి.

కథాంశం: హీరో ఎన్నో కలలు కని చంద్రుడి వద్దకు పంపిన శాటిలైట్ ఫెయిల్ అవుతుంది. దాని కోసం హీరో ఎంత రిస్క్ చేశాడు అనేది ఆసక్తికరంగా చూపించారు.

ఎక్కడ చూడాలి: ప్రైమ్ వీడియో

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
ఉస్తాద్ భగత్ సింగ్ పై ఏపీ ప్రభుత్వం జీవో, పెరిగిన టికెట్ ధరలు ఇవే.. అక్కడ బెనిఫిట్ షో చూసే అభిమానులకు పండగే
Recommended image2
ఎట్టకేలకు పెళ్ళికి రెడీ అవుతున్న అనుష్క శెట్టి.. వరుడు ఎవరో తెలుసా, 44 ఏళ్ళ వయసులో ఇది పెద్ద ట్విస్టే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved