- Home
- Entertainment
- Ariyana Glory : క్రూయిజ్ పార్టీలో అరియానా డాన్స్.. ఆ డ్రెస్ లో మడతేసే స్టెప్పులకు అందరి చూపు ఆమెపైనే!
Ariyana Glory : క్రూయిజ్ పార్టీలో అరియానా డాన్స్.. ఆ డ్రెస్ లో మడతేసే స్టెప్పులకు అందరి చూపు ఆమెపైనే!
బిగ్ బాస్ అరియానా గ్లోరీ Ariyana Glory సోషల్ మీడియాలో ఇటీవల చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. వరుసగా టూర్లకు వెళ్తూ తెగ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ లో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది.

యాంకర్ గా ప్రయాణాన్ని ప్రారంభించిన అరియానా గ్లోరీ ప్రస్తుతం సెలబ్రెటీగా ఆకట్టుకుంటోంది. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ్ ఇంటర్వ్యూతో ఈ యంగ్ బ్యూటీ పాపులర్ అయిన విషయం తెలిసిందే.
అలాగే తనకు దక్కిన క్రేజ్ తో అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’ Bigg Boss Telugu రియాలిటీ షోలో రెండు సార్లు అవకాశం దక్కించుకుంది. సీజన్ 4, సీజన్ 5లో తనదైన శైలిలో టాస్క్ లు ఆడి అలరించింది.
‘బిగ్ బాస్’ షోతో అరియానాకు మరింతగా క్రేజ్ దక్కింది. ప్రస్తుతం అక్కడ దక్కిన ఫలితాన్ని వినియోగించుకునే పనిలో నిమగ్నమైంది. బుల్లితెర షోల్లో వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకుంటోంది.
అలాగే ఆయా ఈవెంట్లు, ప్రమోషనల్ షూట్లు కూడా చేస్తూ కాస్తా సంపాదిస్తోంది. ఇక సమయం ఉన్నప్పుడల్లా టూర్లు, వెకేషన్లు, ఫారేన్ ట్రిప్పులకు వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో మైండ్ బ్లోయింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ దుబాయ్ లో ఉందని తెలుస్తోంది. అక్కడ క్రూయిజ్ షిప్ పార్టీలో సందడి చేస్తూ కనిపించింది. ఆ వీడియో, ఫొటోలను అభిమానులతో పంచుకుంది. పార్టీలో ట్రెండీ వేర్ లో అరియానా అందరి చూపును ఆకర్షించింది.
దానికి తోడు ‘ఊ అంటవా మావ’, ‘రారా రక్కమ్మ’ వంటి సాంగ్స్ కు డాన్స్ చేసి మడతెట్టేసింది. అరియానా స్టెప్పులకు అంతా ఫిదా అయ్యారు. యంగ్ బ్యూటీ నుంచి చూపు తిప్పుకోలేకపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.