- Home
- Entertainment
- బోల్డ్ పోజ్ లో మైండ్ బ్లాక్ చేసేలా అరియనా గ్లోరీ... బిగ్ బాస్ భామ అసలు తగ్గడం లేదుగా!
బోల్డ్ పోజ్ లో మైండ్ బ్లాక్ చేసేలా అరియనా గ్లోరీ... బిగ్ బాస్ భామ అసలు తగ్గడం లేదుగా!
బిగ్ బాస్ ఫేమ్ అరియనా గ్లోరీ సోషల్ మీడియా సంచనాలు కొనసాగుతున్నాయి. అందాలు ఎరవేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది. ఆమె లేటెస్ట్ బోల్డ్ లుక్ వైరల్ అవుతుంది.

Ariyana Glory
ఒకప్పటి యూట్యూబ్ యాంకర్ అరియనాకు బిగ్ బాస్ షో పాపులారిటీ తెచ్చింది. అరియనా ముక్కుసూటితనం, ప్రశ్నించే తత్త్వం ఆమెను ఇష్టపడేలా చేశాయి. అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అరియనా 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఓ దశలో ఆమె టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యారు. ఫైనల్ లో అనూహ్యంగా వెనుకబడ్డారు.
Ariyana Glory
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కారణంగా అరియనాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. గతంలో వర్మను ఇంటర్వ్యూ చేస్తుండగా అరియనాపై బోల్డ్ కామెంట్ చేశాడు. నిన్ను బికినీలో చూడాలని ఉందని ఓపెన్ గా చెప్పారు. వర్మ కామెంట్ నేపథ్యంలో ఆ ఇంటర్వ్యూ వైరల్ అయ్యింది. అరియనా అనే యాంకర్ ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది.
బిగ్ బాస్ తర్వాత అరియనాకు ఆఫర్స్ పెరిగాయి. కెరీర్ లో సెట్ అయ్యింది. ఇక లైఫ్ ఇచ్చిన వర్మ కోసం అరియనా ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు. జిమ్ ఫిట్ లో వ్యాయామం చేస్తూ వర్మ అడిగే పచ్చి బూతు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అరియనా ప్రైవేట్ పార్ట్స్ ని వర్ణిస్తూ ఆ ఇంటర్వ్యూలో వర్మ రచ్చ చేశారు.
Ariyana Glory
ప్రస్తుతం అరియనా కెరీర్ పరిశీలిస్తే... మొన్నటి వరకు బీబీ జోడి అనే డాన్స్ రియాలిటీ షోలో సందడి చేసింది. శ్రీముఖి యాంకర్ గా ఉన్న ఈ షోకి జయం ఫేమ్ సదా, సీనియర్ హీరోయిన్ రాధ, తరుణ్ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. అరియనాకు జోడీగా అవినాష్ చేశాడు. అనూహ్యంగా ఫైనల్ కి వెళ్లిన ఈ జంట తృటిలో టైటిల్ చేజార్చుకున్నారు. బీబీ జోడి టైటిల్ ఫైమా-ఆర్జే సూర్య జోడీ దక్కించుకుంది.
Ariyana Glory
అటు బుల్లితెర షోలతో పాటు ఇంస్టాగ్రామ్ వేదికగా అరియనా రచ్చ చేస్తున్నారు. అరియనా ఫ్రెండ్ అషురెడ్డి బౌండరీలు బ్రేక్ చేసి దారుణమైన ఫోటోలు షేర్ చేస్తున్నారు. అషురెడ్డి స్పూర్తితో అరియనా కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది.