MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Malli: మల్లీ నుదుటిన కుంకుమ చెరిపేసిన మాలిని.. సుందర్ కి వార్నింగ్ ఇచ్చిన అరవింద్?

Malli: మల్లీ నుదుటిన కుంకుమ చెరిపేసిన మాలిని.. సుందర్ కి వార్నింగ్ ఇచ్చిన అరవింద్?

Malli: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న మల్లీ సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఇక ఈరోజు ఫిబ్రవరి 7వ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Feb 07 2023, 01:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో మాలిని, మల్లీ ఇబ్బంది పడే మాటలే కాదు మల్లీకి నీకు పెళ్లి అయ్యింది అని  మాట్లాడిన మాటలకు నీకు ఎలా ఉందో కానీ నాకైతే చాలాబాధేసింది అంటుంది మాలిని. ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ కూడా పాజిటివ్ గా తీసుకుంటారు నా నమ్మకం లేదు కదా అని అంటుంది మాలిని. ఎందుకు మాలిని ఇంత చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నావ్ అనడంతో ఇది నీకు చిన్న విషయమే కావచ్చు కానీ ఆడపిల్లకు ఇది చాలా పెద్ద విషయం అంటుంది. అక్కడ జర్నలిస్టులు మల్లీని మాత్రమే కాదు నిన్ను కూడా టార్గెట్ చేశారు ఆ విషయం నీకు అర్థం కావడం లేదా అంటుంది. నేను ఎవరో అన్న మాటలు గుర్తుపెట్టుకుని అనడం లేదు సిద్ధాంతి గారు అన్న మాటలను మనసులో గుర్తు పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నాను అంటుంది మాలిని.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన ప్రశ్నలు నాకు ఇంకా వినపడుతూనే ఉన్నాయి అని బాధగా మాట్లాడుతుంది మాలిని. అప్పుడు మాలిని మల్లీ నుదుటిన ఉన్న సింధూరాన్ని తుడిచేమని చెబుతుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు మల్లీ ఆలోచిస్తూ ఉండగా ఏంటి మల్లీ ఆలోచిస్తున్నావు తీసుకో అని టిష్యూ పేపర్ ఇస్తుంది మాలిని. కానీ మల్లీ మాత్రం అక్క తర్వాత తుడుస్తాను ఇప్పుడు తుడవలేను అనడంతో ఎందుకు అనగా ఏమి లేదు అక్క అని అంటుంది. ఏమీ లేదు అనడంలోనూ ఏదో ఉందని అర్థం అవుతుంది నిజం చెప్పు మల్లీ నువ్వు మా దగ్గర ఏదైనా నిజం దాచావా అని అడుగుతుంది మాలిని. ఇప్పుడు అనుపమ మాలిని అడిగినట్లు నువ్వు మా దగ్గర ఏదైనా నిజం దాస్తున్నావా అని అంటుంది.
 

36

మొన్న మేము మీ ఇంటికి వచ్చినప్పుడు దేవుడు బొట్టు పడింది అన్నావు ఇప్పుడు సంప్రదాయం అంటున్నావు ఏం జరుగుతుంది మళ్ళీ అని నిలదీస్తుంది అనుపమ. అప్పుడు మల్లీ మౌనంగా ఉండడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ విధంగా సింధూరంతో చూస్తే బయట జనాలు మల్లీని తప్పుగా అనుకుంటారు అంటుంది మాలిని. అప్పుడు మాలిని ఎంత మాట్లాడుతున్న మల్లీ మౌనంగా ఉంటుంది. అప్పుడు మల్లీ నుదుటిన సింధూరాన్ని మాలిని తుడిచి వేస్తుంది. అప్పుడు అరవింద్ ఏం చేయలేకుండా మౌనంగా అలాగే ఉండిపోతాడు. మల్లీ మాత్రం గతంలో జరిగిన పెళ్లి విషయాలు అని తలుచుకొని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు మల్లీ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మల్లీ ఏడుస్తూ ఉండగా ఇంతలో అరవింద్ అక్కడికి వచ్చి నన్ను క్షమించు మల్లీ అని అంటాడు.
 

46

అప్పుడు మల్లీ అరవింద్ తో బాధగా మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు నా నుదుటిన కుంకం చూసి అలా ఇంట్లో వాళ్ళు భయపడ్డారు అలాంటిది మీరు కట్టిన తాళి చూస్తే ఇంకా ఏమైనా ఉంటుందా అని అంటుంది మల్లి. ఒకవేళ నా మెడలో తాళి తేంపే పరిస్థితి వస్తే నేను చనిపోయి ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూపిస్తాను అనడంతో మల్లీ అని అంటాడు అరవింద్. అలా మాట్లాడకు మళ్ళీ అనడంతో అలా జరగకుండా ఉండాలి అంటే ఒకటే ఒక మార్గం ఉంది బాబు గారు అంటుంది మల్లీ. అదేంటి అనడంతో మల్లీ తన తాళిబొట్టు బయటపెట్టి మీ చేతులతో మీరే ఈ తాళిబొట్టు నా మెడలో నుంచి తీసివేయండి అని అంటుంది మల్లీ. మల్లీ మాటలకు అరవింద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.
 

56

అప్పుడు మల్లీ తాళిబొట్టు తీయడానికి అరవింద్ వెళ్ళగా అప్పుడు పెళ్లి రోజు గుర్తు రావడంతో వెంటనే మల్లీ ని హత్తుకుంటాడు అరవింద్. ఒకవేళ నువ్వు చెప్పేనట్టుగా అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు ఆలోచిద్దాము అని అంటాడు అరవింద్. తర్వాత అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మల్లీ బుక్ చదువుకుంటూ ఉండగా ఇంతలో సుందర్ అక్కడికి వచ్చి మల్లీ నీ పెళ్లి విషయం గురించి చాలా నిజాలు దాస్తున్నావు అని మల్లీ నిలదీస్తాడు. ఏం మాట్లాడుతున్నావు సుందర్ అనడంతో అందరి దగ్గర అబద్దాలు చెప్పినట్టు నా దగ్గర చెప్పకు అంటాడు సుందర్. ఇప్పుడు రెండు వేళ్ళు చూపించి దీంట్లో ఏదో ఒకటి పట్టుకో అనడంతో ఇంతలో అరవింద్ అక్కడికి వచ్చి ఆ రెండేళ్లు పట్టుకొని సుందర్ కి తగిన విధంగా వార్నింగ్ ఇస్తాడు. 
 

66

సారీ సార్ ఇంకెప్పుడు మల్లీ జోలికి  రాను సార్ అనడంతో నీకు ఎన్నిసార్లు చెప్పాను రా నీకు మల్లీ తో నీకెందుకు మల్లీ లైఫ్ తో నీకెందుకు అని వార్నింగ్ ఇస్తాడు అరవింద్. అప్పుడు సుందర్ అరవింద్ ఇద్దరు అక్కడినుంచి వెళ్ళిపోతారు. మరోవైపు మాలిని నేను కుంకుమ తుడిచినప్పుడు అంత జరుగుతున్నా కూడా అరవింద్ ఎందుకు మాట్లాడలేదు అనుకుంటూ ఉంటుంది. ఇంతలోని అరవింద్ వచ్చి పడుకోవడంతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అరవింద్ అని అంటుంది మాలిని. ఈరోజు అంత జరిగినా కూడా నువ్వు ఎందుకు ఏం మాట్లాడలేదు అరవింద్ అని నిలదీస్తుంది మాలిని.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor: పెద్ది తర్వాత జాన్వీ కపూర్ కి ఆఫర్స్ లేవా ? అల్లు అర్జున్ సినిమా సంగతేంటి..
Recommended image2
King 100: 50 వేల కోట్ల స్కామ్, నాగార్జున 100వ సినిమా టైటిల్ ఇదే.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్
Recommended image3
Comeback Movies: 2026లో హీరోల కంబ్యాక్ సినిమాలు, చిరు నుంచి రవితేజ వరకు..వాళ్ళకి మాత్రం జాక్ పాట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved