నేషనల్ అవార్డ్స్ లో రికార్డ్ అతనిదే..? అత్యధికంగా జాతీయ అవార్డ్స్ సాధించిన స్టార్ ఎవరు..?
తాజాగా 70వ జాతీయ అవార్డ్స్ ను ప్రకటించింది కేంద్ర ప్రభుతం. కాగా ఇప్పటి వరకూ అత్యధికంగా నేషనల్ అవార్డ్స్ ను సాధించిన వ్యక్తి ఎవరో తెలుసా...? ఏ క్యాటగిరీలో అతనికి ఈ అవార్డ్స్ లభించాయో తెలుసా..?
తాజాగా కేంద్ర ప్రభుత్వం 70వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో తెలుగు సినిమాకు బాగా అన్యాయం జరిగిందన్న సంగతి కూడా తెలిసిందే. తెలుగు సినిమా తప్పించి తమిళ, కన్నడ, మలయాళ సినిమాలు అవార్డ్ పంట పండించాయి. ఇక బాలీవుడ్ కు ఎప్పటిలాగానే పెద్ద పీట వేశారు. కాగా ఇంత వరకూ ఇండియి ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధికంగా అవార్డ్ లు సాధించిన వ్యక్తి ఎవరో తెలుసా..?
ఎక్కవ అవార్డ్ లు సాధించిన వ్యక్తి ఎవరో కాదు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. అవును.. ఇండియన్ ఫిల్మ హిస్టరీలో అత్యధికంగా జాతీయ అవార్డ్స్ సాధించిన మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఆసారి కూడా రెహమాన్ జాతీయ అవార్డ్ ను సాధించారు. మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ 1 సినిమాకు గాను బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అవార్డు ఏఆర్ రహమాన్ కి ప్రకటించారు.
దీంతో ఇప్పటివరకు అత్యధిక నేషనల్ అవార్డులు గెలుచుకున్న మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రహమాన్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు.ఇప్పటి వరకు ఏఆర్ రెహమన్ ఏకంగా 7 నేషనల్ అవార్డులు అందుకున్నాడు. మొదటిసారిగా ఆయన 1992లో రోజా సినిమాకు గాను బెస్ట్ మ్యూజిక్ విభాగంలో జాతీయ అవార్డ్ సాధించారు. 1996లో మెరుపు కలలు సినిమాకు, 2001లో లగాన్ సినిమాకు, 2002లో అమృత సినిమాకు, 2007 లో చెలియా సినిమాకు, 2017లో శ్రీదేవి మామ్ సినిమాకు గాను నేషనల్ అవార్డులు అందుకున్నాడు ఏఆర్ రెహమాన్. తాజాగా 2022కు గానను పొన్నియన్ సెల్వన్ కు 7వసారి జాతీయ అవార్డ్ సాధించాడు.
AR Rahman
ఇక రెహమాన్ గెలుచుకున్న వాటిలో రెండు హిందీ సినిమాలు ఉండగా.. ఐదు తమిళ సినిమాలకు రెహమాన్ జాతీయ అవార్డ్ ను అందుకున్నారు. ఉన్నాయి. ఇలా ఇప్పటివరకు అత్యధికంగా 7 నేషనల్ అవార్డులు గెలుచుకున్న మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రహమాన్ రికార్డ్ సృష్టించాడు.
ఇక ఆ తరువాత స్థానంలో ఇళయరాజా, అమితాబచ్చన్, విశాల్ భరద్వాజ్ కూడా ఉన్నారు. ఇళయరాజ 5 సార్లు జాతీయ అవార్డ్ అందుకోగా.. అమితాబ్ 4 సార్లు విశాల్ భరద్వాజ్ 4 సార్లు జాతీయ అవార్డ్ ను అందుకున్నారు. కాగా కమల్ హాసన్, మమ్ముట్టి, అజయ్ దేవగణ్ లాంటి స్టార్లు మూడు సార్లు జాతీయ అవార్డ్ ను గెలుచుకున్నారు. ఇక టాలీవుడ్ నుంచి గతంలో అల్లు అర్జున్ మొదటి సారి ఉత్తమ కథానాయకుడిగా జాతీయ అవార్డ్ ను గెలుచుకున్నారు.