విమర్శకులకు పాటతో సమాధానం చెప్పిన ఏఆర్ రెహమాన్.. వైరల్ అవుతున్న వీడియో
యూఏఈలోని ఎతిహాద్ ఎరీనాలో ఏఆర్ రెహమాన్ భారత జాతీయ గీతం, జాతీయ గేయం పాడి విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చారు. ఈ కచేరీ వీడియోలను చాలా మంది అభిమానులు సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన ఏఆర్ రెహమాన్
ఆస్కార్ విజేత మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ జనవరి 23న యూఏఈలోని ఎతిహాద్ ఎరీనాలో అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఈ కచేరీలో భారత జాతీయ గీతం జనగణమన, జాతీయ గేయం వందేమాతరం రెండింటినీ పాడి స్టేడియంలోని ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.
రెహమాన్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'ఛావా'ను 'విభజన సినిమా' అని, బాలీవుడ్‌లో 'మతతత్వ' కారణాల వల్ల తనకు తగినంత పని దొరకడం లేదని గతంలో ఏఆర్ రెహమాన్ అన్నారు. అది కాస్త పెద్ద వివాదంగా మారి.. ఆయనపై విమర్శలకు కారణం అయ్యింది. ఇక తాజాగా జరిగిన కచేరీ వీడియోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.
తన్మయత్వంతో ఆడియన్స్ కన్నీళ్లు..
యూఏఈలో ఏఆర్ రెహమాన్ కచేరీకి శేఖర్ కపూర్ హాజరయ్యారు
ఈ కచేరీకి హాజరైన తర్వాత చిత్రనిర్మాత శేఖర్ కపూర్ తన X (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఇలా రాశారు, “నిన్న రాత్రి అబుదాబిలోని ఎతిహాద్ ఎరీనాలో ఏఆర్ రెహమాన్ కచేరీ అద్భుతంగా జరిగింది, హాల్ నిండిపోయింది. 20,000 మంది రెహమాన్ అందమైన, భావోద్వేగ పాటలకు ఉత్సాహంగా, పాడుతూ, నృత్యం చేస్తూ, కన్నీళ్లు పెట్టుకున్నారు.”
What an exhilarating concert by AR Raham at the Etihad Arena in Abu Dhabi last night, packed to capacity
20,000 people cheering, singing , dancing and even crying to Rahman’s beautiful soulful songs .. #ARRahman#EtihadArena#concert#AbuDhabi— Shekhar Kapur (@shekharkapur) జనవరి 24, 2026
ఏఆర్ రెహమాన్ వందేమాతరం వీడియో వైరల్..
ఏఆర్ రెహమాన్ వందేమాతరం పాడిన వీడియోలను ఒక X యూజర్ పంచుకున్నారు. రెహమాన్ తన విమర్శకులకు సమాధానం ఇచ్చారని, కచేరీ చివర్లో స్టేడియం మొత్తం వందేమాతరం పాడిందని రాశారు.
AR Rahman started with Jana Gana Mana and ended with Vande Mataram. pic.twitter.com/YxPRHtYCsg
— TweeterPeter (@Manjunaath) జనవరి 23, 2026
రెహమాన్ అద్భుత ప్రదర్శన
మరో అభిమాని రెహమాన్ ప్రదర్శన వీడియోను మరో కోణం నుంచి పోస్ట్ చేశారు. మణిరత్నం సినిమా 'ఆయుత ఎళుతు'లోని తన ప్రసిద్ధ గీతం 'జన గణ మన'తో ఆయన కచేరీని ప్రారంభించినట్లు ఇది చూపిస్తుంది.
ఆస్కార్ విన్నింగ్ సాంగ్ పాడిన రెహమాన్..
కచేరీ చూశాక, లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు వీడియోలు పోస్ట్ చేశారు. రెహమాన్ మొదట సౌత్ ఇండియన్ పాటలు, తర్వాత హిందీ పాటలు పాడారని చెప్పారు. వందేమాతరం, జనగణమనతో పాటు ఆస్కార్ విన్నింగ్ సాంగ్ జై హో కూడా పాడారు.
I was hoping AR Rahman would answer his critics tonight and he did.
His 2024 Abu Dhabi concert ended with Chaiyya Chaiyya and when he performed that after nearly 4 hours tonight I thought surely this is the finale. But he said wait, one last song.
And then he — and the whole… https://t.co/swLhsxJW7xpic.twitter.com/UQilaNwEsf— Maddy Ravi (@missmaddenstein) జనవరి 23, 2026

