MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Brahmamudi: కావ్యను కాపాడిన అప్పు, కళ్యాణ్.. రాహుల్ గుట్టు రట్టు చేసిన స్వప్న!

Brahmamudi: కావ్యను కాపాడిన అప్పు, కళ్యాణ్.. రాహుల్ గుట్టు రట్టు చేసిన స్వప్న!

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. తను అక్కని ప్రేమించిన వాడు ఒక మోసగాడని నిరూపించడం కోసం తపన పడుతున్న ఒక చెల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 30 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Author : Navya G
Published : May 30 2023, 12:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

 ఎపిసోడ్ ప్రారంభంలో నిశ్చితార్థానికి కావ్య వస్తుందా అని అడుగుతుంది కనకం తోటి కోడలు. రాదు అక్క వాళ్ళ ఇంట్లో కూడా రాహుల్ కి నిశ్చితార్థం ఉంది అంటుంది కనకం. ఆ మాటలు విన్న స్వప్న షాక్ అవుతుంది. మరోవైపు కావ్యని శృతిని ఒక గదిలో బంధిస్తారు రౌడీలు. ఎవరు మీరు అంటూ గోలపెడుతుంది కావ్య. కామ్ గా ఉండు మాకు ఒక ఫోన్ వస్తుంది.

29

 అప్పటివరకు గోల పెట్టకుండా ఉంటే నీకు మంచిది నాకు మంచిది అని హెచ్చరించి అక్కడ నుంచి వెళ్ళిపోతారు రౌడీలు. అప్పుడే తన దగ్గర రాజ్ ఫోన్ ఉన్నట్టు గుర్తొస్తుంది కావ్యకి. దానిద్వారా అప్పు సెల్ కి నన్ను కిడ్నాప్ చేశారు అంటూ మెసేజ్ పెడుతుంది. రాజ్ మెసేజ్ పెట్టాడు అనుకుంటుంది. కానీ లాజిక్ గా ఆలోచించి కళ్యాణ్తో అదే చెప్తుంది. మీ అన్నయ్య హెల్ప్ చేయమని అడిగితే మిమ్మల్ని అడగాలి కానీ నన్ను ఎందుకు అడుగుతారు.

39

నాకు తెలిసి మా అక్క కిడ్నాప్ కి గురై ఉంటుంది అంటూ తనని సేవ్ చేయడానికి వెళ్దాం అంటుంది అప్పు. మరి ఈ లెటర్ అంటాడు కళ్యాణ్. ఇంట్లో పని చేస్తున్న పని వాడిని పిలిచి మా అక్కకి ఇవ్వు ఇంపార్టెంట్ అని చెప్పు అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతారు అప్పు వాళ్ళు. లెటర్ ని జాగ్రత్తగా సప్నకి ఇస్తాడు ఆ వ్యక్తి. నువ్వు ప్రేమించిన రాహుల్ మోసగాడు అని నేను చెప్పిన నువ్వు నమ్మవు నీకు నమ్మకం కలగాలంటే ఒకసారి మా ఇంటికి వెళ్లి చూడు.

49

అసలు స్వరూపం నీకే తెలుస్తుంది అని రాసి ఉంటుంది ఆ లెటర్లో. అది చదివిన స్వప్న ప్రేమించిన వాడిని నమ్మాలా చెల్లిని నమ్మాలా అంటూ అయోమయంలో పడుతుంది. మరోవైపు పూజా పూర్తవటంతో దంపతులను అక్షింతలు వేయమంటారు పంతులుగారు. కావ్య ఏది అని అప్పుడు అడుగుతుంది చిట్టి. మళ్లీ ఏటో వెళ్లిపోయిందా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది కావ్య. నేనే చిన్న పని ఉందని పంపించాను అని సర్ది చెప్తాడు రాజ్.

59

మరోవైపు స్వప్న కి వంట రాదని తెలిసినా, మేము నేర్పించుకుంటాము స్వప్న గురించి నాకు బాగా తెలుసు అంటాడు పెళ్లి కొడుకు. ఆ కుటుంబం మంచితనాన్ని మెచ్చుకుంటారు కావ్య తల్లిదండ్రులు. మరోవైపు రాహుల్ దగ్గరికి ఎలా వెళ్ళటం అని ఆలోచనలో పడుతుంది స్వప్న. అదే సమయంలో రాజ్, కావ్య ఇంకా రాలేదు అని కంగారు పడుతూ ఉంటాడు.వాళ్ళ బాబాయ్ దగ్గర ఫోన్ తీసుకొని కావ్యకి ఫోన్ చేస్తాడు.

69

ఆ సౌండ్ కి రౌడీలు కావ్య వాళ్ల దగ్గర ఫోన్లో తీసుకోవటం మర్చిపోయామని గుర్తించి వాళ్ళ దగ్గర ఫోన్లు లాక్కొని స్విచ్ ఆఫ్ చేసేస్తారు. మళ్లీ ఫోన్ చేసిన రాజ్ కి స్విచ్ ఆఫ్ రావటంతో అసలు ఏం జరుగుతుంది అనుకుంటాడు. మరోవైపు అప్పు, కళ్యాణ్  కావ్య వాళ్ళు ఎక్కడ ఉన్నారో గుర్తించి వాళ్లని సేవ్ చేస్తారు. మిమ్మల్ని ఎవరు పంపించారు అంటూ నిలదీస్తుంది కావ్య. వాళ్లు చెప్పకపోయినా రాహులే పంపించాడు అని గుర్తిస్తుంది.

79

మేము వేరే చోటికి వెళ్ళాలి మీరు స్వప్నక్క ని తీసుకుని మన ఇంటికి వెళ్ళండి అని కల్యాణ్  వాళ్లకి చెప్పి వెళ్ళిపోతుంది కావ్య. మరోవైపు మీడియా వాళ్ళు రాహుల్ ని మీరు డబ్బున్న అమ్మాయిని చేసుకుంటున్నారు మీకు ఎంత ఆస్తి ఉంది అని అడుగుతారు. ఇప్పుడు ఆస్తి ప్రస్తావన ఎందుకు అయినా ఈ ప్రశ్నలు మీరే అడుగుతున్నారా లేకపోతే ఎవరైనా మిమ్మల్ని అడగమన్నారా అంటూ నిలదీస్తుంది చిట్టి.

89

నా స్టేటస్ ని నిరూపించుకోవడం కోసం మీడియాని పిలిస్తే మా అమ్మ రహస్యం బట్టబయలు చేసే లాగా ఉంది అనుకుంటూ మీడియా వాళ్లతో తర్వాత మాట్లాడదాం అని చెప్పి పంపించేస్తుంది రుద్రాణి. మరోవైపు శృతి, కావ్యని ఒక హోటల్ దగ్గరికి తీసుకువస్తుంది. రాహుల్ నన్ను ఎప్పుడు ఇక్కడికే తీసుకువస్తాడు ఇక్కడ రాహుల్ కి తెలిసిన మేనేజర్ ఒకడు ఉన్నాడు వాడిని అడిగితే నిజాలు బయటకు వస్తాయి అంటుంది శృతి.

99

అందుకేనా రాహుల్  అక్కను కూడా ఇక్కడికే తీసుకొచ్చాడు అనుకుంటుంది కావ్య. వాడితో తేల్చుకోవలసినవి చాలా ఉన్నాయి కదా వెళ్దాము అంటుంది కావ్య. తరువాయి భాగంలో వెన్నెలకి ఉంగరం తొడుగుతూ ఉండగా స్వప్న ని తీసుకువస్తారు కావ్య కళ్యాణ్ వాళ్ళు. పెళ్లి మండపం నుంచి లేచిపోలేదు ఈ రాహులే నన్ను లేవదీసుకునిపోయాడు అని చెప్తుంది స్వప్న. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: ఆ స్టార్ నిర్మాతతో బాలయ్య ఎందుకని సినిమాలు చేయరు.? సంచలన విషయాలు బయటపెట్టిన డైరెక్టర్..
Recommended image2
Lenin First Review: లెనిన్ మూవీ ఫస్ట్ రివ్యూ.. 5 ఫ్లాపులు, ఆరోసారి పక్కా అని తేలిపోయింది.. ఎందుకో తెలుసా
Recommended image3
OTT New Releases: ఈ వారం ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved