కంగువా vs పుష్ప 2: సూర్య సినిమాని తొక్కిన కోలీవుడ్, అల్లు అర్జున్ సినిమాకి బ్రహ్మరథం పట్టడానికి కారణమేంటి?
కోలీవుడ్ ఇటీవల సొంత సినిమాలను పక్కన పెట్టి ఇతర భాషల చిత్రాలకు బ్రహ్మరథం పడుతుంది. ఈ క్రమంలోనే `కంగువా`ని విమర్శించిన ఓలీవుడ్ ఆడియెన్స్, `పుష్ప 2`ని మాత్రం నెత్తిన పెట్టుకుంటున్నారు.
కంగువా vs పుష్ప 2
`పుష్ప 2` చిత్రం ప్రస్తుతం భారతదేశం మొత్తం చర్చనీయాంశంగా ఉంది. అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. తొలి రోజే రూ.294 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, మూడు రోజుల్లో 500 కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది కోలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం విజయ్ 'గోట్'. ఇది టోటల్‌గా కేవలం 450 కోట్లు మాత్రమే వసూలు చేసింది. `కంగువా` రెండువందల కోట్ల వద్దే కొట్టుమిట్టాడింది.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పుష్ప 2
`పుష్ప 2` చిత్రం తమిళనాడులో కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది. తమిళనాడులో ఇది దాదాపు 800 థియేటర్లలో విడుదలైంది. మూడు రోజుల్లో అక్కడ ఇది రూ.25కోట్లు కలెక్ట్ చేసింది. ఇలా ఇతర భాషల్లో విడుదలైన పాన్ ఇండియా చిత్రాలను ఆదరిస్తున్న కోలీవుడ్, తమిళ చిత్రాలను కావాలనే పక్కన పెడుతున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.
కంగువా
దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇటీవల విడుదలైన సూర్య `కంగువా` చిత్రం. ఈ ఏడాది తమిళం నుంచి వచ్చిన పక్కా పాన్ ఇండియా చిత్రం అంటే అది `కంగువా`నే. గత నెలలో విడుదలైన ఈ మూవీకి ఫస్ట్ షో నుంచే మిశ్రమ స్పందన లభించింది. చాలా వరకు నెగటివ్‌గా మాట్లాడుకున్నారు. సొంత కోలీవుడ్‌లోనే నెగటివ్ ప్రచారం చేశారు. దీంతో అది సినిమాపై గట్టి ప్రభావ చూపించింది.
ట్విట్టర్ స్పందన
అదే సమయంలో ప్రస్తుతం విడుదలైన `పుష్ప 2` చిత్రంలో అనేక లోపాలు ఉన్నప్పటికీ, చిత్రం చాలా చోట్ల బోర్ కొట్టిస్తున్నప్పటికీ, వాటి గురించి మాట్లాడకుండా చిత్రంలోని పాజిటివ్ అంశాలను మాత్రమే పెద్దగా మాట్లాడుకుంటున్నారు. సినిమాని బ్లాక్ బస్టర్ చేసేశారు.. `పుష్ప 2` చిత్రంలోని అతిపెద్ద మైనస్ దాని నిడివి, దాదాపు 3 గంటల 20 నిమిషాలు ఉంటుంది. కంటెంట్ బాగుండటంతో, ఎలివేషన్లు, యాక్షన్ సీన్లు అదిరిపోవడంతో నిడివి పెద్ద సమస్య కాలేదు.
X పోస్ట్
తమిళంలో విడుదలయ్యే పెద్ద బడ్జెట్ చిత్రాలను విమర్శించడం, ఇతర భాషా చిత్రాలు సగటుగా ఉన్నప్పటికీ వాటిని సూపర్ అని ప్రశంసించడాన్ని చూస్తే భయంగా ఉందని నెటిజన్లు ఆవేదనను వ్యక్తం చేశారు. `కంగువా` మాదిరిగానే `పుష్ప 2` చిత్రంలో కూడా నెగటివ్ అంశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటి గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్ స్పందించారు.
అదే `కంగువా` గురించి ఎక్కువగా చర్చించడం చూస్తుంటే సొంత సినిమాలను కోలీవుడ్ ఆడియెన్స్ ఆదరించడం లేదని ఆయన అన్నారు. ఇదే కొనసాగితే కోలీవుడ్ సినిమాలు వెయ్యి కోట్లు వసూలు చేయడమనేది పెద్ద సవాల్‌గా మారుతుందని చెప్పొచ్చు అంటున్నారు నెటిజన్లు. వాళ్లు `పుష్ప 2` సంచలనం చూసి జెలసీగా ఫీలవడం విశేషం.
అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన `పుష్ప 2` సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించారు. శ్రీలీల ఐటెమ్ సాంగ్‌లో దుమ్ములేపింది. గత గురువారం(డిసెంబర్ 4న) విడుదలైన ఈ మూవీ భారీ కలెక్షన్ల దిశగా వెల్తుంది. ఇది ఇప్పటికే నాలుగు రోజుల్లో రూ750కోట్ల గ్రాస్ దాటిందని సమాచారం. ఈ లెక్కన ఈ వారంలో ఈ మూవీ వెయ్యి కోట్లు దాటేస్తుందని చెప్పొచ్చు. లాంగ్ రన్‌లో `ఆర్‌ఆర్‌ఆర్`, `కేజీఎఫ్`, `కల్కి 2898 ఏడీ` సినిమాల కలెక్షన్లని దాటే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాల అంచనా.
read more: పుష్ప 2 దూకుడు : ఆ స్టార్ హీరోకు పెద్ద తలనొప్పిగా మారిందా?
also read: హీరోయిన్ విషయంలో బాలకృష్ణ, రవితేజ కొట్టుకున్నారా? చిరంజీవి బర్త్ డే పార్టీలో ఏం జరిగింది?