Brahmamudi: అప్పుని నడిరోడ్డు మీద వదిలేసిన కళ్యాణ్.. కొడుకు ప్రవర్తనకి కోపంతో రగిలిపోతున్న అపర్ణ!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. తాతయ్య మీద ప్రేమతో భార్య మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 6 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో కావ్య ముగ్గు వేస్తూ ఉంటుంది. రాజ్ ఫోన్ మాట్లాడుతూ చూసుకోకుండా ఆ ముగ్గు తొక్కేయబోతాడు. అది గమనించిన కావ్య గట్టిగా కేక వేస్తుంది. షాకైన రాజ్ ఏం జరిగింది అని కంగారు గా అడుగుతాడు. ముగ్గుని తొక్కేయబోయారు అంటుంది కావ్య. తొక్కలో ముగ్గు కోసం అంత కంగారు పెడతావా అని కోప్పడతాడు రాజ్. అంతలోనే సీతారామయ్య అటుగా రావడం గమనించి కావ్యని, తను వేసిన ముగ్గుని పొగుడుతూ ఉంటాడు.
అంతేకాకుండా మా అమ్మ అయితే ముగ్గుని చిక్కులు పెట్టిన దారం లాగా వేస్తుంది అంటాడు. ఆ మాటలు అపర్ణ, రుద్రాణి ఇద్దరు వింటారు. కోపంతో రగిలిపోతుంది అపర్ణ. మరోవైపు రాష్ డ్రైవింగ్ చేస్తున్న కారుని తప్పించుకోబోయి కింద పడిపోతారు కళ్యాణ్, అప్పు. అప్పు కోపంగా కారు దగ్గరికి వెళ్లి నువ్వు కిందకి దిగు మమ్మల్ని గుద్ధి చంపేద్దామనుకున్నావా ఏంటి.. ముందు నీ కార్ డ్రైవింగ్ లైసెన్స్ తీయు అంటూ కారులో ఉన్న ఆమెతో గొడవకి దిగుతుంది.
కారు దిగిన వ్యక్తి అప్పు ని కన్విన్స్ చేయాలని చూస్తుంది. కళ్యాణ్ అప్పుడే అటువైపు చూసి అక్కడ ఉన్నది అనామిక అని గుర్తుపట్టి అక్కడికి వెళ్లి తనే అనామిక అని అప్పు కి చెప్తాడు. మీరేంటి ఇటువైపు వచ్చారు అని అనామిక అని అడుగుతాడు కళ్యాణ్. మిమ్మల్ని ఒక దగ్గరికి తీసుకు వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇంతలో మీరే కనిపించారు ఎక్కడికో వెళ్తున్నట్టు ఉన్నారు అంటుంది అనామిక.
అలాంటిదేమీ లేదు వెళ్దాం పదండి అంటాడు కళ్యాణ్. అప్పు ఏదో అనబోయే అంతలో ఆమెని పక్కకి తీసుకువెళ్లి బండి తాళాలు ఆమె చేతిలో పెట్టి తనని ఒప్పించి అనామిక తో వెళ్ళిపోతాడు కళ్యాణ్. నన్ను నడిరోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నావు కదా తిరిగి నా దగ్గరికి వస్తావు కదా అప్పుడు చెప్తా నీ పని అని అనుకుంటుంది అప్పు. మరోవైపు ఆఫీస్ కి వెళ్తున్న రాజ్ టిఫిన్ పెట్టమంటాడు. ఇంకా టిఫిన్ అవ్వలేదు అని కంగారు పడుతుంది కావ్య.
ఎందుకు ఇద్దరూ టెన్షన్ పడతారు. నువ్వు ఆఫీస్ కి వెళ్ళు రాజ్, తను టిఫిన్ అయ్యాక క్యారియర్ ఆఫీస్ తీసుకుని వస్తుంది అంటాడు సీతారామయ్య. ఇక తప్పనిసరి పరిస్థితులలో ఆఫీస్ కి బయలుదేరబోతూ టాబ్లెట్ వేసుకున్నారా అని తాతయ్యని అడుగుతాడు రాజ్. టాబ్లెట్ ఎందుకు అని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అవుతారు. ఏం లేదు నీరసం కోసం డాక్టర్ ఇచ్చాడు దాని గురించి అడుగుతున్నాడు అని మేనేజ్ చేసేస్తాడు సీతారామయ్య.
ఆ టాబ్లెట్ సంగతి నేను చూసుకుంటాను అని సుభాష్ చెప్పడంతో ఆఫీస్ కి బయలుదేరుతాడు రాజ్. మరోవైపు అనామిక తన ఇంటికి తీసుకువెళ్లి తన పేరెంట్స్ కి కళ్యాణ్ ని పరిచయం చేస్తుంది. తన ఇల్లు మొత్తం తిప్పి చూపిస్తుంది. మరోవైపు రుద్రాణిని నీ కొడుకు కోడలు ఏరి అని అడుగుతుంది చిట్టి. తెలీదు ఎక్కడికో వెళ్లారు అంటుంది రుద్రాణి. అందరి విషయాల్లో కలగజేసుకుంటావు కదా నీ కొడుకు కోడలు గురించి పట్టించుకోవా అని వెటకారంగా అంటుంది ధాన్యలక్ష్మి.
అలాంటిదేమీ లేదు పొద్దున్న వెళ్తూ నాకు చెప్పి వెళ్లారు ఎక్కడికి అంటే హనీమూన్ కి అనుకో అన్నాడు రాహుల్ అంటుంది రుద్రాణి. కడుపుతో ఉన్న పిల్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు తనకి హనీమూన్ అవసరమా ఉన్నపళంగా వెనక్కి రమ్మను అంటుంది చిట్టి. రుద్రాణి రాహుల్ కి ఫోన్ చేస్తే ఫోన్ రీచ్ అవ్వదు. అదే విషయం తల్లికి చెప్పి కేర్ లెస్ గా అక్కడనుంచి వెళ్ళిపోతుంది రుద్రాణి. ఇదంతా విన్న కావ్య సప్న కోసం కంగారుపడుతూ ఆమెకి ఫోన్ చేస్తుంది. తన ఫోన్ కి కూడా స్వప్న ఫోన్ రీచ్ అవ్వదు. దానితో మరింత టెన్షన్ పడుతుంది. అది గమనించిన ధాన్యలక్ష్మి నీ గురించి పట్టించుకోని వాళ్ళ కోసం నువ్వు ఎక్కువగా ఆలోచించకు.
నీ కాపురం సంగతి నువ్వు చూసుకో ఇప్పటికే నీ విషయంలో రాజ్ చాలా మారాడు. ఇంకా ఓపిక పడితే పూర్తిగా మారుతాడు. వంట సంగతి నేను చూసుకుంటాను నువ్వు క్యారేజ్ తీసుకొని ఆఫీస్ కి వెళ్ళు అని కావ్యని ఆఫీసుకు పంపిస్తుంది ధాన్యలక్ష్మి. తరువాయి భాగంలో అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు. పక్కన తాతయ్య ఉండటంతో కావ్యని ప్రేమగా చూసుకుంటున్నట్లు ఓవరాక్షన్ చేస్తూ ఉంటాడు రాజ్. అది చూసి కోపంతో రగిలిపోతుంది అపర్ణ.