Brahmamudi: కోడలితో ఛాలెంజ్ చేసిన అపర్ణ.. భర్త చేసిన పనికి షాక్ లో కావ్య!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ఎంతో ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కోడలి మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోతున్న ఒక అత్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 2 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోవటానికి ఒక వ్యాలీడ్ రీజన్ చెప్పు అంటుంది అప్పు. అనామిక కలుస్తానంది అంటాడు కళ్యాణ్. అందుకని ఈ ఫ్రెండ్ ని వదిలేస్తావా అంటుంది అప్పు. వదిలేసేవాడినే అయితే ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తాను చెప్పు అని చెప్పి అప్పుకి సారీ చెప్పి ఇకపై నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంటాడు. అంటే తను నేను ఒకటేనా అంటూ మళ్ళీ గొడవ పడుతుంది అప్పు.
తను నీలో కవితను నచ్చే స్నేహం చేసింది నేను నిన్ను నిన్నుగా స్నేహం చేశాను అంటుంది. నువ్వు చెప్పింది నిజమే అప్పు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి తను నా అభిమాన ఫ్రెండ్ అంటాడు కళ్యాణ్. మరోవైపు చిట్టి కనకానికి ఫోన్ చేసి వరలక్ష్మీ వ్రతానికి ఇన్వైట్ చేస్తుంది. మొన్న అంత గొడవ జరిగిన తర్వాత అక్కడికి వచ్చి వదిన గారికి ఎలా మొహం చూపిస్తాను, అలాగే ఆవిడ కూడా నన్ను చూడటానికి ఇబ్బంది పడతారు అంటుంది కనకం.
అలా అని దూరాలు పెంచేసుకుంటామా, పండగలు జరుపుకునేది దూరాలు తగ్గించుకోవడానికే. ఆలోచించుకో కనకం.. కూతురు సౌభాగ్యం కోసం పూజ చేస్తుంటే దీవించటానికి తల్లి కన్నా పెద్ద ముత్తయిదువ ఎవరు దొరుకుతారు అని కనకాన్ని పూజకి రావడానికి ఒప్పిస్తుంది చిట్టి. ఫోన్ పెట్టేసిన తర్వాత అక్కడికి వెళ్లాలంటే కనీసం ఒక పట్టు చీర, ఒక గ్రాము బంగారం అయినా తీసుకెళ్లాలి అని భర్తకి చెప్పి కంగారు పడుతుంది కనకం.
ఏదో ఒకటి చేద్దాం లే అంటాడు కృష్ణమూర్తి. మరోవైపు కావ్య దగ్గరికి వచ్చిన అపర్ణ నిన్ను ఈ ఇంట్లో అందరూ నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు. నువ్వుఇంట్లో ఇలా తిరుగుతుంటే నాకు నచ్చడం లేదు. నిన్ను జీవితంలో నేను కోడలుగా అంగీకరించలేను అలాగే నా కొడుకు కూడా నిన్ను భార్యగా అంగీకరించడు అని ఛాలెంజ్ చేస్తుంది అపర్ణ. మీరు చాలెంజ్ విసిరిన ప్రతిసారి నాకు మంచే జరుగుతుంది. ఇంట్లోకి రానివ్వను అన్నారు ఆపలేకపోయారు.
పుట్టింటితో బంధం వద్దన్నారు అదీ ఆపలేకపోయారు. ఎవరికి తెలుసు నన్ను అర్థం చేసుకొని మీరే మారుతారేమో. మీ అబ్బాయి మీ మనసు మారుస్తారేమో అంటుంది కావ్య. నా కొడుకు నా మనసుకు నచ్చని పని ఎప్పుడూ చేయడు. రేపు నువ్వు చేసే పూజకి నేను నిన్ను ఆశీర్వదించను, నా కొడుకు కూడా నిన్ను అక్షింతలు వేసి దీవించడు అని చెప్పి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ. ఈ మాటలు అన్నీ వింటాడు రాజ్.
గదిలోకి వెళ్ళబోతున్న భార్యతో పూజ నువ్వు చేయు ఫలితం నేనిస్తాను అంటాడు. ఏం చేస్తారు అంటుంది కావ్య. వెయిట్ అండ్ సీ అని చెప్పి వెళ్ళిపోతాడు రాజ్. మరోవైపు పూజా కార్యక్రమాలు చేస్తున్న కావ్య దగ్గరికి వచ్చి ఈ బాధ్యత అంతా నీ మీద పెట్టాను నాకు మాట రానివ్వదు అని చెప్తుంది చిట్టి. మీరేమీ కంగారు పడకండి నేనున్నాను కదా అని చెప్పి గబగబా పూజ ఏర్పాట్లు చేస్తుంది కావ్య. మరోవైపు టిఫిన్ గా ఉప్మా పెడితే ఉప్మా తినను అంటాడు కళ్యాణ్.
నీకోసం నాలుగు రకాల టిఫిన్లు చేస్తూ కూర్చుంటే పూజ కి లేట్ అయిపోతుంది అని చెప్పి కొడుకుని మందలిస్తుంది ధాన్యలక్ష్మి. ఇంతలో భర్త వచ్చి నాకు కూడా టిఫిన్ పెట్టు అంటాడు. నా పూజ అయ్యి నన్ను దీవించే వరకు మీకు ఉపవాసం అని చెప్పి భర్తకు టిఫిన్ పెట్టదు ధాన్యలక్ష్మి. మీరే తినండి అని ఉక్రోషంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ప్రకాష్. మరోవైపు భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కనకం. ఎందుకు ఆ టెన్షన్ అంటుంది అప్పు.
మీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మీ నాన్న డబ్బులు తెస్తానని వెళ్లారు ఇంకా రాలేదు అంటుంది కనకం. అంతలోనే కృష్ణమూర్తి డబ్బులు తీసుకొని వచ్చి భార్యకి ఇచ్చి కూతుర్ని తల్లికి తోడుగా వెళ్ళమని చెప్తాడు. నువ్వు చెప్పావు కాబట్టే వెళ్తాను కానీ చీర కట్టుకోను అంటుంది అప్పు. నీకు నచ్చినట్లే ఉండు అంటాడు కృష్ణమూర్తి. మరోవైపు పూజ దగ్గర అమ్మవారిని అందంగా అలంకరిస్తుంది కావ్య. చాలా బాగా చేశావు అని మెచ్చుకుంటుంది చిట్టి.
అంటే వదిన బాగా చేసేది కాదు అని అంటున్నావా అంటుంది రుద్రాణి. పుల్లలు పెట్టకపోతే నీకు మనశ్శాంతి ఉండదు కదా అంటుంది ధాన్యలక్ష్మి. తరువాయి భాగంలో పూజ చేసుకొని భర్త పాదాలకి నమస్కరిస్తుంది కావ్య. ఆమె మీద అక్షింతలు వేయకుండా వెనక్కి వెళ్ళిపోతాడు రాజ్. అతను చేసిన పనికి కావ్య షాకయితే అపర్ణ మాత్రం సంతోషిస్తుంది.