MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన అనుష్క శెట్టి, దేవసేన నిర్ణయానికి కారణం ఏంటి?

సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన అనుష్క శెట్టి, దేవసేన నిర్ణయానికి కారణం ఏంటి?

Anushka Shetty: సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పింది స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి. రీసెంట్ గా ఘాటి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన స్వీటీ.. ఈ నిర్ణయం తీసుకోవడం వెలనుక కారణం ఏంటో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 12 2025, 01:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అభిమానులకు అనుష్క షాక్
Image Credit : our own

అభిమానులకు అనుష్క షాక్

సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తన అభిమానులకు అనూహ్యమైన షాక్ ఇచ్చారు. తాను కొంతకాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాల్లో చేతిరాతతో రాసిన ఒక నోట్‌ను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఘాటి సినిమాతో ఆడియన్స్ ముందుకు
Image Credit : X

ఘాటి సినిమాతో ఆడియన్స్ ముందుకు

ఇటీవలే అనుష్క నటించిన 'ఘాటి' సినిమా సెప్టెంబర్ 5న విడుదలైన విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో, విక్రమ్ ప్రభుతో కలిసి ఆమె నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు మిశ్రమ స్పందన లభించింది. అయినప్పటికీ, అనుష్క నటనకు విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ప్రమోషన్లలో చురుకుగా పాల్గొన్న ఆమె, విడుదలైన కొద్ది రోజులకే సోషల్ మీడియాకు విరామం ప్రకటించడం గమనార్హం.

Related Articles

Related image1
చిరంజీవి కి భార్య సురేఖ అంటే భయమా ? మెగా డాటర్ సుస్మిత కొణిదెల వెల్లడించిన టాప్ సీక్రెట్
Related image2
చండాలంగా ఉన్నావ్ అని జూనియర్ ఎన్టీఆర్ ముఖం మీదే చెప్పిన దర్శకుడు ఎవరు?
35
సోషల్ మీడియాకు స్వీటీ గుడ్ బై
Image Credit : our own

సోషల్ మీడియాకు స్వీటీ గుడ్ బై

అనుష్క శెట్టి తన పోస్ట్ లో ఏమన్నారంటే? "బ్లూ లైట్ నుంచి క్యాండిల్ లైట్‌కు మారుతున్నా. స్క్రోలింగ్‌కు అతీతంగా ఉన్న ప్రపంచంతో, మనం నిజంగా మొదలైన చోటుతో తిరిగి కనెక్ట్ అయ్యేందుకు సోషల్ మీడియా నుంచి కొంతకాలం తప్పుకుంటున్నాను" అని అనుష్క తన నోట్‌లో పేర్కొన్నారు. మరిన్ని కథలతో, మరింత ప్రేమతో త్వరలోనే మళ్లీ కలుస్తానని, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని అభిమానులకు సందేశమిచ్చారు.

45
విలన్ గా నటించాలని
Image Credit : Asianet News

విలన్ గా నటించాలని

అయితే 'ఘాటి' ప్రమోషన్ల సందర్భంగా అనుష్క పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఇంకా ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. "నాకు పూర్తి స్థాయి నెగెటివ్ పాత్ర చేయాలని ఉంది. బలమైన కథ వస్తే తప్పకుండా విలన్‌గా నటిస్తాను" అని తన మనసులోని మాటను బయటపెట్టారు.

55
త్వరలో కొత్త సినిమా ప్రకటన
Image Credit : instagram/ Anushka Shetty

త్వరలో కొత్త సినిమా ప్రకటన

ప్రస్తుతం తాను కొత్త కథలు వింటున్నానని, మంచి ప్రాజెక్టులు వరుసలో ఉన్నాయని అనుష్క తెలిపారు. తన తొలి మలయాళ సినిమాతో పాటు, త్వరలోనే ఓ ఆసక్తికరమైన తెలుగు సినిమాను కూడా ప్రకటిస్తానన్నారు అనుష్క శెట్టి. 'వేదం' తర్వాత క్రిష్‌తో కలిసి ఆమె పనిచేసిన సినిమా కావడంతో 'ఘాటి'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాని వాటిని సినిమా అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం అనుష్క తదుపరి ప్రాజెక్టులపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అనుష్క శెట్టి
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image3
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Related Stories
Recommended image1
చిరంజీవి కి భార్య సురేఖ అంటే భయమా ? మెగా డాటర్ సుస్మిత కొణిదెల వెల్లడించిన టాప్ సీక్రెట్
Recommended image2
చండాలంగా ఉన్నావ్ అని జూనియర్ ఎన్టీఆర్ ముఖం మీదే చెప్పిన దర్శకుడు ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved