MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గ్లామర్ కి తప్ప యాక్టింగ్ కి పనికిరాదు అన్నారు.. కట్ చేస్తే స్టార్ హీరోలకి సమానమైన క్రేజ్, 150 కోట్ల ఆస్తి

గ్లామర్ కి తప్ప యాక్టింగ్ కి పనికిరాదు అన్నారు.. కట్ చేస్తే స్టార్ హీరోలకి సమానమైన క్రేజ్, 150 కోట్ల ఆస్తి

చిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడూ కొన్ని మిరాకిల్స్ జరుగుతుంటాయి. వాటి వల్ల సాధారణ నటీనటులు స్టార్లుగా మారిపోతుంటారు. సౌత్ లో ఒక అగ్ర నటి జీవితంలో కూడా మిరాకిల్ జరిగింది.

tirumala AN | Published : Mar 28 2025, 05:03 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Anushka Shetty

Anushka Shetty

చిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడూ కొన్ని మిరాకిల్స్ జరుగుతుంటాయి. వాటి వల్ల సాధారణ నటీనటులు స్టార్లుగా మారిపోతుంటారు. సౌత్ లో ఒక అగ్ర నటి జీవితంలో కూడా మిరాకిల్ జరిగింది. ఆ నటి ఎవరో కాదు అనుష్క శెట్టి. ఆమె జీవితంలో జరిగిన  అద్భుతం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

25
Anushka Shetty

Anushka Shetty

అనుష్క శెట్టి సూపర్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సూపర్ తర్వాత అనుష్క కి టాలీవుడ్ లో బాగా అవకాశాలు వచ్చాయి. సూపర్ మూవీలో అనుష్క గ్లామర్ షోకి అందరూ ఫిదా అయ్యారు. దీనితో కమర్షియల్ చిత్రాల్లో ఆమెని తీసుకునేందుకు దర్శక నిర్మాతలు ఎగబడ్డారు. విక్రమార్కుడు, చింతకాయల రవి లాంటి హిట్ చిత్రాలు పడ్డాయి. కానీ నటన పరంగా సరైన గుర్తింపు అనుష్కకి రాలేదు. 

Also Read : 10 మంది డూప్లికేట్ రాజమౌళిలు తయారయ్యారు, చిరంజీవి, నాగార్జున, రజనీ అప్పట్లోనే..

35
Asianet Image

ఆ టైంలో అనుష్కకి ఒక క్రేజీ ఆఫర్ వచ్చింది. అదే అరుంధతి చిత్రం. అసలు ఆ చిత్రంలో తనని ఎందుకు తీసుకున్నారో కూడా అనుష్కకి అప్పట్లో క్లారిటీ లేదట. ఆ టైంకి నేను స్టార్ ని కూడా కాదు. పైగా నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆర్థిక పరిస్థితి ఆ సమయంలో బాగాలేదు. హీరోయిన్ ఓరియెంట్ చిత్రం కాబట్టి నాకన్నా పెద్ద స్టార్ ని తీసుకుని ఉంటే కాస్త సేఫ్ జోన్ లో ఉండేవారు. అరుంధతి చిత్రంలో నన్ను ఎంపిక చేసింది శ్యామ్ ప్రసాద్ రెడ్డిగారే. 

45
Asianet Image

ఈ అమ్మాయి వద్దు అని ఆయనకు సలహా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారట. నీ కేమైనా పిచ్చా ఇంత పెద్ద సినిమా తీస్తూ ఆ అమ్మాయిని ఎందుకు పెట్టుకున్నావు. ఆమె గ్లామర్ కి తప్ప నటనకి పనికిరాదు అని చెప్పారట. కానీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నన్ను నమ్మారు. నాపైన ఈ చిత్రం వర్కౌట్ అవుతుంది అని ఆయన భావించారు. అరుంధతి చిత్రం వరకు యాక్టింగ్ గురించి, గ్రాఫిక్స్ గురించి పెద్దగా తెలియదు. విక్రమార్కుడు చిత్రంలో అయితే రాజమౌళి గారు చేసి చూపిస్తే దానిని అదే విధంగా కాపీ కొట్టేదాన్ని. సొంతంగా నటించడం తెలియదు అని అనుష్క పేర్కొంది. 

55
Asianet Image

అరుంధతి చిత్రం నుంచి నెమ్మదిగా అన్నీ నేర్చుకున్నట్లు అనుష్క తెలిపింది. అరుంధతి అద్భుతమైన విజయం సాధించింది. స్టార్ హీరోలకు పోటీ ఇచ్చే నటిగా అనుష్క ఎదిగింది. ఆ తర్వాత కాలంలో రాజమౌళి బాహుబలి చిత్రంలో కూడా అనుష్కకి అవకాశం ఇచ్చారు. బాహుబలి, రుద్రమ దేవి లాంటి చిత్రాలతో అనుష్క సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగారు. నయనతార తర్వాత సౌత్ లో అత్యధిక నెట్ వర్త్ కలిగిన నటి అనుష్క, ఆమె ఆస్తులు ఏకంగా 150 కోట్ల వరకు ఉన్నాయి.  

tirumala AN
About the Author
tirumala AN
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది. Read More...
అనుష్క శెట్టి
తెలుగు సినిమా
 
Recommended Stories
Top Stories