MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అనుష్క శెట్టి పెళ్లిపై జ్యోతిష్యుడి జాతకం.. 2022లో పెళ్లి.. ఎవరితో కూడా స్పష్టం..

అనుష్క శెట్టి పెళ్లిపై జ్యోతిష్యుడి జాతకం.. 2022లో పెళ్లి.. ఎవరితో కూడా స్పష్టం..

టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపింది అనుష్క శెట్టి(anushka shetty). లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. అయితే ఇటీవల అనుష్క పెళ్లి(anushka marriage)కి సిద్ధమవుతుందని, సినిమాలను పక్కన పెడుతుందనే వార్తలొస్తున్నాయి. దీంతో జ్యోతిష్యులు(astrologers) స్పందించారు. ఆమె జాతకం ఎలా ఉందో చెప్పారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 24 2021, 04:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అనుష్క చివరగా `నిశ్శబ్దం` చిత్రంలో మెరిసింది. ఆ సినిమా పరాజయం చెందింది. మరోవైపు `జాతిరత్నాలు` ఫేమ్‌ నవీన్‌ పొలిశెట్టితో కలిసి ఓ సినిమా చేస్తుందని, యూవీ క్రియేషన్‌లో ఈ సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. ముహుర్తం కూడా స్టార్ట్ అయ్యిందంటూ ఓ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కానీ ఇప్పటి వరకు ఈ చిత్రంపై క్లారిటీ లేదు. ఆగిపోయిందనే వార్తలొస్తున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అనుష్క సినిమా చేసేందుకు సుముఖంగా లేదనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో గుప్పుమంటున్నాయి. అదే సమయంలో అనుష్క పెళ్లి వార్తలు ఊపందుకున్నాయి. ఆమె మ్యారేజ్‌ చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ కావాలని భావిస్తుందట. `సైజ్‌ జీరో` ఎఫెక్ట్ తో ఇప్పటికీ అరోగ్య సమస్యలు ఎదుర్కొంటుందని, బరువు తగ్గలేకపోతుందని, అందుకే మ్యారేజ్‌ లైఫ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందనే టాక్‌ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

37

ఇదిలా ఉంటే గతంలో ప్రభాస్‌తో పెళ్లి వార్తలొచ్చాయి. వీరిద్దరు కలిసి `బాహుబలి`లో నటించారు. ఆ సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారని, పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్స్ వినిపించాయి. కానీ తామిద్దరం మంచి స్నేహితులమని, తమ మధ్య అలాంటి అభిప్రాయం లేదని వెల్లడించారు. క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ వార్తలకు పుల్‌స్టాప్‌ పడింది. 
 

47

మరోవైపు అనుష్క ఓ బిజినెస్‌మేన్‌ని పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. ఆల్మోస్ట్ ఓకే అయ్యిందని చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో కొందరు అభిమానులు అనుష్క జాతకం చూపించారు. ఫేస్‌, బాడీ ఆకారం బట్టి జాతకం చెప్పే జ్యోతిష్యుల ద్వారా అనుష్క శెట్టి పెళ్లి జరుగుతుందా? ఎప్పుడవుతుంది? ఎవరితో అవుతుందని, ఆమె వ్యక్తిత్వం ఏంటనే విషయాలపై జాతకం చూపించారు. 

57

అందులో భాగంగా ప్రముఖ పండిట్‌ జగన్నాథ్‌ గురుజీ అనుష్క శెట్టి జాతకం చెప్పారు. ఆమెపై వచ్చిన పుకార్లు నిజం కాదని, కల్పితమైనవి వెల్లడించారు. అనుష్క తెలివైన నటి అని, వర్క్ విషయంలో పూర్తి ప్రొఫేషనల్‌గా ఉంటారని చెప్పారు. ఆమె ముఖ పఠనం ఆధారంగా చూస్తే ఆమె ఒకే  వృత్తిలో ఉన్న వారితో కలవడానికి ఇష్టపడదని తెలిపారు. అనుస్క చాలా వినయపూర్వకమైన స్వభావం కలిగి ఉంటుందని, డౌన్‌ టూ ఎర్త్ అని అన్నారు. ఆమెకి అహంకారం ఉంటుందనేది తప్పు అని, ఆమెలో ఎలాంటి అహంకారం ఉండదని పేర్కొన్నారు. 
 

67

అనుష్క చాలా ఎమోషనల్‌ అని, ఎప్పుడూ కెరీర్‌, పని గురించే ఆలోచిస్తుందని, ఈ రెండింటి చుట్టూ ఆమె ఆలోచనలు తిరుగుతాయని తెలిపారు. ఆమె కెరీర్‌ ఇంకా చాలా ప్రకాశవంతంగా ఉంటుందని, చిత్ర పరిశ్రమలో ఆమె పనిచేసినంత కాలం సూపర్‌స్టార్‌గానే వెలుగుతారని, ఆమె ఎల్లప్పుడూ సూపర్‌స్టార్‌గా ఉండిపోయినా ఆశ్చర్యం లేదని పండిట్‌ జగన్నాథ్‌ గురూజీ వెల్లడించారు. ఆమెకి బాలీవుడ్‌లో రాణించాలనే ఆసక్తి లేదని తెలిపారు.
 

77

ఇక ఎవరిని పెళ్లి చేసుకోబోతుందనే ప్రశ్నకి చెబుతూ, అనుష్క పరిశ్రమ బయటి వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం బలంగా ఉందన్నారు. అన్ని సరిగ్గా జరిగితే వచ్చే ఏడాది ఆమె పెళ్లి జరుగుతుందని, కాదంటే 2023లోపు అనుష్క మ్యారేజ్‌ తంతు పూర్తవుతుందని జాతకం చెప్పాడు. మరి ఇందులో ఎంత నిజమనేది మున్ముందు చూడాలి. కానీ ఆమె అభిమానులు మాత్రం అనుష్కని ఇంకా సినిమాల్లో చూడాలని కోరుకుంటున్నారు.  
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అనుష్క శెట్టి
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Raghavendra Rao: ఈ వయసులో ఇవేం పనులు, దర్శకేంద్రుడిపై మండిపడుతున్న నెటిజన్లు
Recommended image2
Nagabandham Trailer Review: అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, నాగబంధం ట్రైలర్ రివ్యూ..
Recommended image3
Veturi: 'యమహానగరి..కలకత్తాపురి' పాటపై వేటూరి తీరని అసంతృప్తి.. ఎందుకంటే..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved