MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Harsha Sai : యూట్యూబ్ లో వీడియో పెట్టి ఏడాది , హర్షసాయి ఏమైపోయాడు.. ఆ దెబ్బ కొంపముంచిందా..

Harsha Sai : యూట్యూబ్ లో వీడియో పెట్టి ఏడాది , హర్షసాయి ఏమైపోయాడు.. ఆ దెబ్బ కొంపముంచిందా..

ఒకప్పుడు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేశాడు హర్షసాయి. ఎంతో మంది పేదోళ్ల బ్రతుకుల్లో వెలుగు నింపాడు. యూట్యూబ్ ద్వారా భారీగా సంపాదించి.. హీరోగా సినిమా కూడా స్టార్ట్ చేశాడు. కానీ హర్ష సాయి గత కొన్నాళ్లుగా కనిపించడంలేదు.ఏమైపోయాడు? ఎక్కడున్నాడు?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 07 2026, 03:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సోషల్ మీడియాలో సంచలనం హర్షసాయి
Image Credit : facebook.com/blogger109/

సోషల్ మీడియాలో సంచలనం హర్షసాయి

ఒకప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన యూట్యూబర్స్ లో హర్ష సాయి ఒకడు. ఎవరు చేయలేని డిఫరెంట్ కాన్సెప్ట్ లను తెరపైకి తెచ్చి..బుల్లితెర స్టార్ గా మారిన హర్షసాయి హీరోగా ఓ సినిమా కూడా స్టార్ట్ అయ్యింది. సినిమా అనౌన్స్ చేసి రెండేళ్లు అవుతోంది.. యూట్యూబ్ లో హర్షసాయి వీడియో పెట్టి ఏడాదిపైనే అయ్యింది. ఇంతకీ ఆ సినిమా ఏమైంది, హర్షసాయి ఎక్కడికెళ్లాడు.. సోషల్ మీడియాలో ఎందుకు కనిపించడంలేదు?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
భారీగా సంపాదించిన యూట్యూబర్ ..
Image Credit : facebook.com/blogger109/

భారీగా సంపాదించిన యూట్యూబర్ ..

యూట్యూబ్ లో వీడియోలతో ఫేమస్ అయిన హర్షసాయి.. పేదోళ్ల కలలు నెరవేరుస్తూ.. వాళ్లకు డబ్బుసాయం చేస్తూ, కోరిన వస్తువులు కొనిస్తూ, పిల్లల చదువులకు సహాయం చేస్తూ.. ఆ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. ఒక పెద్ద టీమ్ ను కూడా ఏర్పాటు చేసి.. తన యూట్యూబ్ పరిధిని కూడా పెంచుకున్నాడు. 

భారీగా డబ్బులు కూడా సంపాదించాడు స్టార్ యూట్యూబర్. అంతకు మించి ఇమేజ్ ను కూడా సాధించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టార్ గా మారిన తరువాత, అతనికి సినిమా అవకాశం కూడా వచ్చింది. మెగా పేరుతో ఓ మూవీ కూడా స్టార్ట్ చేశాడు.

Related Articles

Related image1
కార్తీక దీపం డాక్టర్ బాబు పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా? నిరుపమ్ కంటే ముందు ఎవరిని అనకున్నారు?
Related image2
Trisha Krishnan: బిజినెస్ మ్యాన్ తో పెళ్లి, నలుగురు పిల్లలు.. ఇచ్చిపడేసిన త్రిష
36
హీరోగా సినిమా స్టార్ట్ చేసిన హర్ష సాయి
Image Credit : facebook.com/blogger109/

హీరోగా సినిమా స్టార్ట్ చేసిన హర్ష సాయి

హర్ష సాయి వీడియోలు నచ్చిన ఓ అమ్మాయి అతనితో సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చింది. తాను నిర్మాతగా వ్యవహరిస్తూ, హర్షసాయి కథ, దర్శకత్వంలో హీరోగా నటిస్తూ ‘మెగా’ అనే టైటిల్‌తో ఒక సినిమాను ఘనంగా ప్రారంభించారు. ఈ సినిమా ప్రారంభమైన తర్వాత హర్షసాయి వీడియోలు మరింత వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో సినిమా పబ్లిసిటీ కోసం పీఆర్ టీమ్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు కూడా నిర్వహించింది.

46
కొత్త మెగాస్టార్ అంటూ ప్రచారం..
Image Credit : facebook.com/blogger109/

కొత్త మెగాస్టార్ అంటూ ప్రచారం..

టాలీవుడ్‌లో కొత్త మెగాస్టార్ వచ్చాడనే స్థాయిలో అతనిని ప్రచారం చేశారు. దీంతో హర్షసాయి పేరు సోషల్ మీడియాలో మారుమోగి పోయింది. రెండేళ్ల క్రితం కొత్త సినిమా స్టార్ట్ చేసిన హర్షసాయి.. ఆతరువాత అసలు కనిపనించకుండా పోయాడు. ఆయన సినిమా ఏమయ్యిందో తెలియదు. 

రెగ్యూలర్ గా చేయాల్సి యూట్యూబ్ వీడియోలు కూడా మానేశాడు. దాదాపు ఏడాదిగా ఒక్క వీడియో కూడా ఆయన యూట్యూబ్ లో పోస్ట్ అవ్వలేదు. ఓ వీవాదంలో చిక్కుకున్న హర్షపై పోలీస్ కేసు కూడా అయ్యింది. నెట్టింట రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ హర్ష ఎక్కడ ఉన్నాడు.

56
భారీ వీవాడంలో ఇరుక్కున్న హర్ష..
Image Credit : facebook.com/blogger109/

భారీ వీవాడంలో ఇరుక్కున్న హర్ష..

సినిమా స్టార్ట్ అయ్యక హర్ష సాయి యాటీట్యూడ్ మారిపోయినట్టు తెలిసింది. సినిమా స్టార్ట్ అయిన కొంత కాలానికి ఆ సినిమాను నిర్మిస్తున్న యువతి..హర్షపై రకరకాల ఆరోపణలు చేసింది.

పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఆమె కేసు నమోదు చేయించింది. ఈ వ్యవహారం అప్పట్లో టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఆతరువాత హర్షసాయి కనిపించడం మానేశాడు. ఈ విషయంలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. మీమ్స్, ట్రోల్స్ తో పాటు పోస్టర్లు కూడా కనిపిస్తున్నాయి.

66
సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే?
Image Credit : facebook.com/blogger109/

సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే?

సినిమా స్టార్ట్ చేసి రెండేళ్లు అవుతోంది.. వీడియో పోస్ట్ చేసి ఏడాది అవుతోంది.. ఇంత వరకూ అడ్రెస్ లేకుండా పోయాడు అని ఓ పోస్టర్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ కు రకరకాల కామెంట్లు కూడా వస్తున్నాయి. దుబయ్ పారిపోయాడని కొందరు, జైల్లో ఉన్నాడని కొందరు, ఎక్కడికో పారిపోయాడని మరికొందరు, బాగా ఓవర్ యాక్షన్ చేశాడని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ హర్ష సాయి ఏమైపోయాడు అనేది మాత్రం ఇంత వరకూ ఎవరికి తెలియదు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Recommended image2
Kayadu Lohar: బోల్డ్ సీన్లపై కయాదు లోహర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. అదిరిపోయే కండీషన్‌ పెట్టిన క్రేజీ హీరోయిన్‌
Recommended image3
Telugu Actress Arrest : చిరంజీవితో కలిసి కామెడీ పండించిన తెలుగు నటి అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
కార్తీక దీపం డాక్టర్ బాబు పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా? నిరుపమ్ కంటే ముందు ఎవరిని అనకున్నారు?
Recommended image2
Trisha Krishnan: బిజినెస్ మ్యాన్ తో పెళ్లి, నలుగురు పిల్లలు.. ఇచ్చిపడేసిన త్రిష
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved