- Home
- Entertainment
- Anushka Shetty: అనుష్క ఎమోషనల్ కామెంట్స్ వైరల్.. హృదయాలు దోచుకుంటున్న నాగబాబు, మంచు విష్ణు
Anushka Shetty: అనుష్క ఎమోషనల్ కామెంట్స్ వైరల్.. హృదయాలు దోచుకుంటున్న నాగబాబు, మంచు విష్ణు
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా తమ ఫ్యామిలిలో మహిళల ఫోటోలని అభిమానులతో షేర్ చేసుకున్నారు.

నిన్న(మార్చి8) ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు మహిళలకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. చాలా మంది మహిళా సెలెబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా ఉమెన్స్ డే విషెస్ తెలియజేశారు. చాలామంది టాలీవుడ్ సెలెబ్రిటీలు తమ ఫ్యామిలిలో లేడీస్ గురించి అందంగా, ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తూ పోస్ట్ లు పెట్టారు.
మెగా బ్రదర్ నాగబాబు తన జీవితంలో అతి ముఖ్యమైన ముగ్గురు మహిళల గురించి పోస్ట్ పెట్టారు. ఆ ముగ్గురూ ఎవరూ కాదు. తన తల్లి అంజనాదేవి, భార్య పద్మజ, అలాగే కుమార్తె నిహారిక. పాస్ట్ లో, ప్రజెంట్ లో, ఫ్యూచర్ లో నా అందమైన జీవితానికి ఈ ముగ్గురు మహిళలే కారణం అంటూ నాగబాబు పోస్ట్ చేసారు.
ఇక మా ప్రెసిడెంట్, హీరో మంచి విష్ణు తన భార్య పిల్లలతో ఉన్న బ్యూటిఫుల్ పిక్ షేర్ చేశారు. 'వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే మ్యాజిక్..హ్యాపీ ఉమెన్స్ డే' అనే క్యాప్షన్ ఇచ్చాడు. మంచు విష్ణుకి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ లేడీస్ అంతా కలసి ఉమెన్స్ డే రోజున డిన్నర్ లో పాల్గొన్నారు. మహేష్ బాబు సతీమణి నమ్రత ఆ పిక్ ని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ డిన్నర్ లో నమ్రతతో పాటు మహేష్ బాబు సిస్టర్స్ మంజుల, ప్రియదర్శని పాల్గొన్నారు.
అందాల భామ స్వీటీ అనుష్క కూడా ఉమెన్స్ డే రోజు ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన ఫ్యామిలీ గ్రూప్ పిక్చర్ ని అభిమానులతో షేర్ చేసుకుంది. 'మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మీరంతా ఎవరికి వారు ప్రత్యేకమైనవారు. ఫిజికల్ గా, మెంటల్ గా, ఎమోషనల్ గా మీరంతా స్ట్రాంగ్. కానీ బయట ప్రపంచాన్ని చూసి పరిగెత్తడం ఆపండి. మీలోనే అద్భుతమైన క్వాలిటీస్ ఉన్నాయి.. వాటిని తీయండి అంటూ అనుష్క ఉమెన్స్ డే రోజు మహిళలకు సందేశం ఇచ్చింది.
ఇక అలాగే గద్దలకొండ గణేష్ చిత్రంలో నటించిన యంగ్ బ్యూటీ మృణాళిని రవి కూడా సోషల్ మీడియాలో ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా మృణాళిని రెడ్ శారీలో ఉన్న బ్యూటిఫుల్ పిక్చర్స్ ని పోస్ట్ చేసింది.