- Home
- Entertainment
- ఎట్టకేలకు వారికి సారీ చెప్పిన అనురాగ్ కశ్యప్.. కానీ అక్కడే అసలు ట్విస్ట్, మళ్లీ ఈ గిల్లుడు ఏంటి?
ఎట్టకేలకు వారికి సారీ చెప్పిన అనురాగ్ కశ్యప్.. కానీ అక్కడే అసలు ట్విస్ట్, మళ్లీ ఈ గిల్లుడు ఏంటి?
సినిమా దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇటీవల 'బ్రాహ్మణులపై మూత్ర విసర్జన చేస్తాను' అని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన షరతులతో కూడిన క్షమాపణ చెప్పారు.

అనురాగ్ కశ్యప్
బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా ఆయన రూపొందించిన `పులే` మూవీ ఈ నెల 25న విడుదల కాబోతుంది. ఈ నెల 11న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. ఈ క్రమంలో గతంలో విడుదలకు నోచుకోని `పంజాబ్ 95`, `తడక్ 2` చిత్రాలను ప్రస్తావిస్తూ సెన్సార్ బోర్డు, కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
విడుదల కాని సినిమాలు
సెన్సార్ బోర్డు ఆగ్రహానికి గురై విడుదల కాలేదు:
సామాజిక అంశాలను చూపించే 'పంజాబ్ 95', 'టీస్', 'తడక్ 2' వంటి చిత్రాలు సెన్సార్ బోర్డు ఆగ్రహానికి గురై విడుదల కాలేదని అనురాగ్ కశ్యప్ అన్నారు. కుల, ప్రాంత, జాతి వివక్ష చూపించే ప్రభుత్వ నిజస్వరూపాన్ని బయటపెట్టే ఇలాంటి సినిమాలు ఎన్ని నిషేధించబడ్డాయో తెలియదన్నారు.
సొంత ముఖం చూసుకోవడానికి సిగ్గుపడుతున్నారని, వాళ్లకు ఇబ్బంది కలిగించే సినిమా గురించి బహిరంగంగా మాట్లాడలేనంత పిరికివాళ్లు అని విమర్శించారు అనురాగ్ కశ్యప్.
అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యలు
బ్రాహ్మణులపై అనురాగ్ వ్యాఖ్యలు:
బ్రాహ్మణులపై తన వ్యాఖ్యలను వ్యతిరేకించిన వారికి ఘాటుగా బదులిచ్చిన అనురాగ్, 'నేను బ్రాహ్మణులపై మూత్ర విసర్జన చేస్తాను, నీకేంటి సమస్య' అని పోస్ట్ చేయడం వివాదాస్పదమైంది. దీనిపై సోషల్ మీడియాలో అనేక మంది తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. దీంతో పలు చర్చలు జరిగాయి.
అనురాగ్ క్షమాపణలు
బహిరంగ క్షమాపణ:
ఈ విమర్శలకు ప్రతిస్పందనగా అనురాగ్ కశ్యప్ బహిరంగ క్షమాపణ చెప్పారు. తన ఉద్దేశం తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. మనువాదులు, సంస్కారహీన బ్రాహ్మణులకు మాత్రమే క్షమాపణ చెబుతున్నానని షరతు విధించారు.
షరతులతో క్షమాపణ
షరతులతో అనురాగ్ క్షమాపణ:
నా పోస్ట్‌కి కాదు, దానిలోని ఒక వాక్యానికి, ద్వేషాన్ని రెచ్చగొట్టినందుకు క్షమాపణ చెబుతున్నా. `మా కుమార్తె, కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులకు మనువాద నాయకుల నుండి లైంగిక వేధింపులు, చంపుతా బెదిరింపులు వస్తున్నాయి.
నా కుటుంబం ఏమీ అనలేదు
నా కుటుంబం ఏమీ అనలేదు: అనురాగ్
నేను అన్నది వెనక్కి తీసుకోను. కానీ మీరు నన్ను ఎంత తిట్టినా ఫర్వాలేదు. నా కుటుంబం ఏమీ అనలేదు, అనదు కూడా. మీకు నా నుండి క్షమాపణ కావాలంటే ఇదే నా క్షమాపణ. బ్రాహ్మణులారా, స్త్రీలను వదిలేయండి, అది మనుధర్మం కాదు.
మీరు బ్రాహ్మణులని నిరూపించుకోండి. మిగతా వాటికి క్షమాపణ చెబుతున్నాను అని షరతులతో క్షమాపణ చెప్పడం మళ్ళీ సంచలనం సృష్టించింది. మరి ఈ వివాదం ఎటు వైపు వెళ్తుందో చూడాలి.
read more: 'ఫులే' వివాదం: సెన్సార్ బోర్డు, బ్రాహ్మణ కమ్యూనిటీపై అసభ్యకర వ్యాఖ్యలతో రెచ్చిపోయిన అనురాగ్ కశ్యప్