- Home
- Entertainment
- కొంటె ఫోజులతో కుర్రాళ్ల హృదయాల్ని దోచేస్తున్న అనుపమా.. ట్రెండీ వేర్ లో మతిపోగొడుతున్న యంగ్ బ్యూటీ..
కొంటె ఫోజులతో కుర్రాళ్ల హృదయాల్ని దోచేస్తున్న అనుపమా.. ట్రెండీ వేర్ లో మతిపోగొడుతున్న యంగ్ బ్యూటీ..
కుర్రాళ్లను తన వెంట తిప్పుకోవడంలో యంగ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఆరితేరుతోంది. ట్రెండీ వేర్స్ లో దర్శనమిస్తూ.. కొంటె ఫోజులతో యువత హృదయాల్ని దోచుకుంటోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి.

యంగ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) కుర్రాళ్లలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంటూ మరింత పాపులారిటీని పెంచుకుంటోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ గ్లామర్ పిక్స్ ను పంచుకుంటూ హంగామా చేస్తోంది.
యూత్ ను అట్రాక్ట్ చేయడంలో అనుపమా ఆరితేరుతోంది. కొన్నాళ్లుగా గ్లామర్ విందు చేస్తున్న ఈ బ్యూటీ.. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. ఇప్పటికే ఇంటర్నెట్ ఫ్యాన్స్ లో అనుపమాకు మంచి క్రేజ్ ఉంది. లేటెస్ట్ గా గ్లామర్ పిక్స్ ను పంచుకుంటూ మరింతగా పాపులర్ అవుతోంది.
కుర్రభామా ఎప్పుడు తన అభిమానులను ఏదో రకంగా అలరిస్తూనే ఉంటుంది. అటు సినిమాలతోనే కాకుండా ఇటు సోషల్ మీడియా ద్వారా కూడా అనుపమా తన గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. ట్రెండీ వేర్స్ లో దర్శనమిస్తున్న ఈ బ్యూటీ గ్లామర్ కు నెటిజన్లు సైతం ఆకర్షితులవుతున్నారు.
తాజాగా అనుపమా పంచుకున్న ఫొటోస్ ద్వారా అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. టీషర్ట్, జీన్స్ ధరించిన ఈ బ్యూటీ ట్రెండీగా కనువిందు చేసింది. ఈ సందర్భంగా ఫొటోలకు కొంటేగా ఫొజులిస్తూ మతిపోగొట్టింది. అన్నీ యాంగిల్లో అందాలను విందు చేస్తూ అదరహో అనిపించింది.
అనుపమాకు ఇంటర్నెట్ ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంటుంది. ఆమె కూడా ఎప్పుడూ తన అభిమానులు, ఫాలోవర్స్ తో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా తను పోస్ట్ చేసిన ఫొటోల వెనకున్న కథను రిలీజ్ చేసింది. పోస్ట్ చేసే క్రమంలో క్రేజీగా క్యాప్షన్ కూడా ఇచ్చింది.
బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ తాజాగా నటించిన చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2). యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ సరసన అనుపమా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నిఖిల్ ‘కార్తికేయ’ పాత్రలో నటించగా.. అనుపమా ‘ముగ్ద’ అనే పాత్రను పోషించింది. ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రం.. ఇటు బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం రూ.100 కోట్ల క్లబ్ లో చేరేందుకు పరుగులు తీస్తోంది.
అయితే తన పాత్రకు సంబంధించి కాస్ట్యూమ్ లోనే గతంలో ఫొటోషూట్ చేసింది. ఆ పిక్స్ ను తాజాగా అభిమానులతో పంచుకుంది. చిత్రంలోనూ అనుపమా ఈ దుస్తుల్లోనే కనిపిస్తూ ఉంటుంది. ట్రెండీ వేర్స్ లో ఈ బ్యూటీ మరింత మోడ్రన్ గా కనిపించింది. ప్రస్తుతం తను పోస్ట్ చేసిన ఫొటోలను అభిమానులు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.
చివరిగా ‘రౌడీ బాయ్స్’ చిత్రంలో అలరించిన అనుపమాకు మంచి రెస్పాన్సే దక్కింది. తాజాగా ‘కార్తికేయ 2’తో మరోసారి బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతో వేసుకుంది. ఈ బ్యూటీ మరో రెండు చిత్రాల్లోనూ నటిస్తోంది. ‘బట్టర్ ఫ్లై’,‘18 పేజెస్’ సినిమాల్లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.