- Home
- Entertainment
- మేకప్ లేకుండా అసలైన అందంతో కేకపెట్టిస్తున్న అనుపమా.. స్వయంగా ఆవకాయ్ రెడీ చేస్తూ కష్టపడుతున్న వైనం.. ఫోటోలు
మేకప్ లేకుండా అసలైన అందంతో కేకపెట్టిస్తున్న అనుపమా.. స్వయంగా ఆవకాయ్ రెడీ చేస్తూ కష్టపడుతున్న వైనం.. ఫోటోలు
క్యూట్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ మన తెలుగమ్మాయిలా మారిపోయింది. మరోవైపు మేకప్ లేకుండా సహజమైన అందాలను ఆవిష్కరించింది. ఈ సండేని చాలా స్పెషల్‌గా మార్చింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
అనుపమా పరమేశ్వరన్.. తెలుగు అమ్మాయిలా మారిపోయింది. ఆమె ఆవకాయ్ పచ్చడి తయారు చేసింది. స్వయంగా తన చేతులతో ఈ మామిడికాయ పచ్చడి పెట్టడం విశేషం. పచ్చడి ప్రిపేర్ చేసేందుకు ఆమె కష్టపడుతున్న తీరుని ఫోటోల రూపంలో అంతే సహజంగా బంధించి, వాటిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది అనుపమా.
ఇందులో సీరియస్‌గా ఆవకాయ్ తయారు చేస్తుంది అనుపమా. మామిడి ముక్కలు చేసి, కారం, పసుపు, ఇతర పచ్చడికి కావాల్సిన ఐటెమ్స్ ని రెడీ చేసి అవకాయ్ కలుపుతుంది. మొత్తానికి టేస్టీ మామిడి పచ్చడిని తయారు చేసినట్టు ఈ ఫోటోలను చూస్తుంటే అర్థమవుతుంది. ఫోటోల్లో చూస్తుంటూనే నోరూరిస్తుందీ మలయాళి అందం.
ఇందులో అనుపమా ఎంతో క్యూట్‌గా ఉంది. ఇంకా విశేషమేంటంటే ఆమె సహజంగా కనిపించడం. ఎలాంటి మేకప్ లేకుండా ఇంట్లో ఎలా ఉంటుందో ఈ ఫోటోల్లో అలానే ఉంది. మేకప్ లేకుండా ఎంతో క్యూట్‌గా ఉంది అనుపమా. ఆమె సహజమైన అందం, స్కిన్ టోన్ ఎంతో సుకుమారంగా ఉండటం విశేషం.
దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మేకప్ లేకుండా ఇంత అందమా అని ఆశ్చర్యపోతున్నారు. అనుపమా నేచురల్ బ్యూటీ అని, మేకప్‌తో పనిలేదని అంటున్నారు. అంతేకాదు ఆమె మెల్లగా తెలుగు అమ్మాయిలా మారుతుందని అంటున్నారు. తెలుగమ్మాయి లక్షణాలు వచ్చేశాయని కామెంట్ చేస్తున్నారు. చూడ్డానికి అనుపమా సైతం తెలుగు పడుచు పిల్లలా కనిపిస్తుండటం విశేషం.
ఇక క్యూట్ అందాలతో తెలుగు ఆడియెన్స్ మనసులు దోచుకుంది అనుపమా. `అ ఆ`లో నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలోనటించి వాహ్ అనిపించింది. నిండైన రూపంతో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయ్యింది. ఆ తర్వాత `ప్రేమమ్` చిత్రంతో మరోసారి ఫిదా చేసింది. కర్లీ హెయిర్‌తో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది.
అందంతో మాయ చేసిన ఈ బ్యూటీ వెండితెరపై నటనతోనూ మ్యాజిక్ చేస్తుంటుంది. అద్భుతమైన యాక్టింగ్ అదరగొడుతుంది. గ్లామర్ షోకి దూరంగా నటనతో మెస్మరైజ్ చేస్తుంది. అందుకే ఈ బ్యూటీ చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. బలమైన కంటెంట్ ఉన్న చిత్రాలు, బలమైన పాత్రలే చేస్తూ రాణిస్తుంది.
గతేడాది `రౌడీ బాయ్స్`, `కార్తికేయ 2`, `18పేజెస్`, `బట్టర్‌ఫ్లై` చిత్రాలతో మెరిసింది. మూడింటిలోనూ మూడు డిఫరెంట్ రోల్స్ చేసింది. `18పేజెస్`లో లవర్‌గా మంత్రముగ్దుల్ని చేసింది. `బట్టర్ ఫ్లై`లో స్ట్రగులింగ్ లేడీగా అదరగొట్టింది. ఏకంగా యాక్షన్ కూడా చేసింది. తన బెస్ట్ ఇచ్చింది.
ఇక `రౌడీ బాయ్స్`లో బోల్డ్ గా కనిపించింది. హీరోతో లిప్ లాక్ పెట్టింది. రొమాంటిక్ సీన్లు చేసి విమర్శలు ఎదుర్కొంది. ఈ సినిమాకి సంబంధించి దారుణమైన ట్రోల్స్ ని ఫేస్ చేసింది అనుపమా. అంతకు ముందు క్లీన్ ఇమేజ్ ఉన్న అనుపమా ఒక్కసారిగా ఇలా చేయడంతో విమర్శలపాలు కావాల్సి వచ్చింది. దీంతో అలాంటి చిత్రాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది.
ప్రస్తుతం అనుపమా తెలుగులో `టిల్లు స్వ్కైర్`లో, `ఈగల్` అనే సినిమాలో నటిస్తుంది. తమిళంలో `సిరెన్`, మలయాళంలో ఓ సినిమా చేస్తుంది. ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. `టిల్లు స్కైర్`తో ఆగస్ట్ లో ఆడియెన్స్ ముందుకు రాబోతుందీ నేచురల్ బ్యూటీ్.