- Home
- Entertainment
- Anupama Parameswaran: చీకటి గదిలో డార్క్ సైడ్ అందాలను ఆవిష్కరించిన అనుపమ.. కొంటె నడుముతో టెంప్టింగ్ పోజులు
Anupama Parameswaran: చీకటి గదిలో డార్క్ సైడ్ అందాలను ఆవిష్కరించిన అనుపమ.. కొంటె నడుముతో టెంప్టింగ్ పోజులు
అనుపమా పరమేశ్వర్ మత్తెక్కిస్తుంది. క్యూట్ అందాలతో కనువిందు చేసే ఈ భామ ఇప్పుడు హాట్‌నెస్‌తో కుర్రాళ్లకి చుక్కలు చూపిస్తుంది. తనలోని హాట్ యాంగిల్‌ని ఆవిష్కరిస్తూ హాట్ టాపిక్ అవుతుంది.

అనుపమా పరమేశ్వరన్ తన అభిమానులకు వాలెంటైన్స్ డే విషెస్ చెప్పింది. అయితే మామూలు విషెస్ కాదు, హాట్, ఘాటు మేళవించిన వాలెంటైన్స్ విషెస్. ఏకంగా గ్లామర్ ఫోటోలతోనే కుర్రాళ్లకి కనువిందునిస్తుంది. అంతా వాలెంటైన్స్ డే విషెస్ చెబుతుంటే, అనుపమా మాత్రం కొత్త దారిలో వెళ్తుంది. తన హాట్ పిక్స్ ని పంచుకుంటూ అలరిస్తుంది.
డార్క్ షేడ్‌లో ఉన్న ఫోటోలను పంచుకుంది అనుపమా. చీకటి గదిలో బెడ్ లైటింగ్స్ వెలుతురులో ఫ్లోర్‌పై కవ్వించేచూపులతో కాకరేపుతుంది. కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. అనుపమా పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. ఉలిక్కిపాటుకి గురి చేస్తున్నాయి.
అనుపమా పరమేశ్వరన్ ఇప్పటి వరకు క్యూట్ యాంగిల్‌నే చూపించింది. నిండైన అందాలతో కనువిందుగా ఉంటుందీ బ్యూటీ. కానీ తనలోని హాట్ యాంగిల్‌ని ఆవిష్కరించింది చాలా తక్కువ. మలయాళ భామ కావడంతో ఆ హద్దుల్లో ఉంది. కానీ ఇప్పుడు దాన్ని బ్రేక్ చేస్తుంది. తాము రెగ్యూలర్ కమర్షియల్ హీరోయినే అనే సంకేతాలనిస్తుంది.
అనుపమా పరమేశ్వరన్ ఇటీవల పంచుకుంటున్న ఫోటోలు అదే విసయాన్ని చెబుతున్నాయి. ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగానూ ఆమె దిగిన ఫోటోలు ఘాటు రేపుతున్నాయి. కుర్రాళ్ల బాడీలో సెగలు రేపుతున్నాయి. తన అందాలను కొత్తగా ఆవిష్కరిస్తూ నెటిజన్లని ఎంగేజ్ చేస్తుందీ అందాల భామ.
`ప్రేమమ్` చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుపమా పరమేశ్వర్ కమర్షియల్ హీరోగాయిన్‌గా మారేందుకు ప్రయత్నిస్తుంది. ట్రెడిషనల్ లుక్‌లోనే ఉంటే కెరీర్ లాంగ్‌రన్ కష్టమని ముందే తెలుసుకున్నట్టుందీ అందాల పాప. నెమ్మదిగా తన చుట్టూ ఉన్న సంకేళ్లని తెంచేసుకుంటుంది. కనువిందు చేస్తుంది.
అనుపమా లేటెస్ట్ ఫోటోలకు ఫిదా అవుతున్న నెటిజన్లు హాట్ కామెంట్లు చేస్తున్నారు. కొందరు ప్రేమికుల రోజు విషెస్ చెబుతూ.. తాము సింగిలే అనే విషయాన్ని అనుపమా దృష్టికి తీసుకొస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అంతేకాదు ఫైర్, హాట్ ఎమోజీలతో ఆమె అందాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
అనుపమా పరమేశ్వరన్ తెలుగులో సరైన హిట్ అందుకోవడంలో విఫలమయ్యింది. ఆమె నటించిన `అ.. ఆ`, `ప్రేమమ్`, `శతమానం భవతి` చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. ఇటీవల `రౌడీబాయ్స్`తోనూ ఆకట్టుకుంది. ఇందులో ఏకంగా కొత్త హీరోకి లిప్‌లాక్ పెట్టి మరీ షాకిచ్చింది. అయితే ఈ సందర్భంగా ఆమెపై ట్రోల్స్ వచ్చాయి. నిర్మాత కొడుకు అయితే మాత్రం ముద్దు పెట్టేస్తావా? అంటూ కామెంట్లు చేశారు నెటిజన్లు. దీనికి ఘాటుగానే స్పందించి కౌంటర్ ఇచ్చింది అనుపమా.
ప్రస్తుతం ఈ క్యూట్ అందాల భామ తెలుగులో రెండు సినిమాలతో బిజీగా ఉంది. అందులో ఒకటి `18పేజెస్`, మరోటి `కార్తికేయ 2`. ఈ రెండు నిఖిల్ హీరోగా రూపొందుతున్న చిత్రాలే కావడం విశేషం. మరోవైపు `హెలెన్` అనే మరో తెలుగు సినిమాలోనూ నటిస్తుంది అనుపమా.
మరోవైపు అనుపమా మంచి పెయింటింగ్ ఆర్టిస్ట్. ఆమె అనేక డ్రాయింగ్స్ వేసింది. ఖాళీ సమయం దొరికితే చాలు డ్రాయింగ్స్ వేస్తూ బిజీగా గడుపుతుంది. తన మదిలోని ఆలోచనలకు కుంచెతో పేపర్‌పై ఆవిష్కరిస్తుంది. ఎంతో కళాత్మకమైన డ్రాయింగ్స్ వేస్తూ ఆకట్టుకుంటుంది. అభిమానులను అలరిస్తుంది. కమర్షియల్ పెయింటింగ్ ఆర్టిస్ట్ గానూ ఎదుగుతుంది అనుపమా.