- Home
- Entertainment
- Anupama: స్వర్గం నుంచి దిగొచ్చిన అప్సరసలా మెరిసిపోతున్న అనుపమా పరమేశ్వరన్.. చూసుకున్నోడికి చూసుకున్నంత..
Anupama: స్వర్గం నుంచి దిగొచ్చిన అప్సరసలా మెరిసిపోతున్న అనుపమా పరమేశ్వరన్.. చూసుకున్నోడికి చూసుకున్నంత..
అనుపమా పరమేశ్వరన్ తెలుగులో రాణించేందుకు కష్టపడుతుంది. క్యూట్ అందాలతో మెప్పించే ఈ భామ స్టార్ ఇమేజ్ కోసం తపిస్తుంది. ఈ క్రమంలో అన్ని రకాలుగా తనవంతు ప్రయత్నాలు చేస్తుంది.

అనుపమా పరమేశ్వరన్(Anupama Parameswaran) ఇప్పుడు నయా లుక్‌లో మెరిసిపోతుంది. లేత ఆకుపచ్చ కలర్ గౌనులో హోయలు పోయింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో అనుపమా పరమేశ్వరన్ అందం మరింత పెరిగిపోవడం విశేషం. అంతేకాదు ఆమెని ఆరాధించే అభిమానులు మాత్రం అనుపమాని ఓ దేవతలా భావిస్తుండటం విశేషం.
లేటెస్ట్ లుక్‌లో అనుపమా పరమేశ్వరన్ అందాల దేవతలా ఉందట. స్వర్గలోకం నుంచి దిగొచ్చిన అందాల అప్సరసలా ఉందట. దివి నుంచి దిగొచ్చిన తారవి నువ్వే అంటూ కామెంట్లు చేస్తున్నారు. అనుపమా ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో అనుపమా హడావుడే ఉండటం విశేషం.
అనుపమా పరమేశ్వరన్ ప్రస్తుతం `కార్తికేయ 2`(Karthikeya2)లో నటించింది. నిఖిల్(Nikhil) హీరోగా చందూమొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు(ఆగస్ట్ 13న)న విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా అనుపమా పరమేశ్వరన్ తళుక్కున మెరిసింది. గురువారం రాత్రి ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో ఈ నయా లుక్‌లో మెరిసింది అనుపమా పరమేశ్వరన్. ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది. అందరి చూపులు తనవైపు తిప్పుకుంది.
ఆ మధ్య కాస్త గ్యాప్ వచ్చిన అనుపమా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన `కార్తికేయ 2` విడుదల కాబోతుండగా, `18పేజెస్` చిత్రీకరణ దశలో ఉంది. ఆల్మోస్ట్ ఆ సినిమా కూడా రిలీజ్‌కి రెడీ అవుతుందని చెప్పొచ్చు. మరోవైపు `బట్టర్‌ఫ్లై` అని మరో సినిమా చేస్తుంది. అలాగే రెజీనాతో కలిసి మరో సినిమా చేస్తుంది.ఇలా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, మరోవైపు కమర్షియల్ మూవీస్ చేస్తూ రాణిస్తుంది.
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో క్యూట్ అందాలతో కనువిందు చేసింది అనుపమా పరమేశ్వరన్. కానీ ఆ క్యూట్‌నెస్ ఎక్కువ రోజులు సెట్ కావని భావించిందో లేక, అవకాశాలు తగ్గిపోవడమా? ఏమోగానీ ప్రస్తుతం డోస్ పెంచుతుంది. అందాల ఆరబోతకు తెరలేపుతూ షాకిస్తుంది. Anupama Parameswaran Hot Photos.
హాట్ అందాలను కొద్దికొద్దిగా చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తుంది. గ్లామర్‌కి గేట్లు ఎత్తివేస్తూ అభిమానులను సైతం షాక్‌కి గురి చేస్తుంది. నెటిజన్లకి మైండ్ బ్లాక్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్స్ ఫాలోవర్స్ ఉండటం విశేషం.
అనుపమా పరమేశ్వరన్ ఓ వైపు కమర్షియాలిటీని, మరోవైపు కంటెంట్‌కి ప్రయారిటీ ఇస్తుంది. కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తూ తన కెరీర్‌ని గాడిలో పెట్టుకుంటుంది. అంతకు ముందు కేవలం హోమ్లీ బ్యూటీగానే మెరిసిన అనుపమా దాని కారణంగా చాలా అవకాశాలకు దూరమయ్యింది. గ్లామర్ పాత్రలకు దూరం కావడంతో ఒకానొక దశలో ఆమె చేతిలో సినిమాలు లేకుండాపోయాయి.
దీంతో పరిస్థితిని అర్థం చేసుకుని త్వరగానే రియలైజ్ అయ్యింది. అందాల ఆరబోతకు సిద్ధమే అనేలా హాట్ హాట్ ఫోటో షూట్లు చేస్తూ మేకర్స్ ని ఆకట్టుకుంటుంది. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో తన క్రేజ్‌ని పెంచుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నెట్టింట యంగ్ సెన్సేషన్ కావడం విశేషం.