- Home
- Entertainment
- కురులు దాయని పరువాలతో అనుపమా పరమేశ్వరన్ విరహపు పోజులు.. చూస్తే కుర్రాళ్ల హృదయాలు గల్లంతే..
కురులు దాయని పరువాలతో అనుపమా పరమేశ్వరన్ విరహపు పోజులు.. చూస్తే కుర్రాళ్ల హృదయాలు గల్లంతే..
క్యూట్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ కురుల అందాలతో కట్టిపడేస్తుంది. మరోవైపు హాట్ పోజులతోనూ హంటింగ్ చేస్తుంది. ఇటీవల ఆమె గ్లామర్ ఫోటోలు ఆశ్చర్యపరిచేలా ఉండటం విశేషం.

అనుపమా పరమేశ్వరన్ తాజాగా తన క్లోజప్ షాట్ ఫోటోలను పంచుకుంది. ఇందులో తన క్యూట్ ఫేస్‌ని చూపిస్తూ చిలిపి నవ్వులతో కట్టిపడేస్తుంది. మరోవైపు మార్నింగ్ సూర్యకిరణాల వేడి నుంచి వచ్చే అనుభూతిని పొందుతూ అదిరిపోయే పోజులిచ్చింది.
విరహంతో కూడిన పోజులిస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. అంతేకాదు రింగు రింగుల కురులతో, ఆ కురులు దాయలేని పరువాలతో ఆకర్షిస్తుంది అనుపమా. లేటెస్ట్ గా ఆ ఫోటోలను పంచుకుని నెటిజన్లని ఆకట్టుకుంటుంది. ఒక్కసారిగా ఇంటర్నెట్‌లో రచ్చ చేసింది.
అనుపమా పరమేశ్వరన్ క్యూట్ అందాలకు కేరాఫ్. కొంటె పోజులతో ఆకర్షిస్తూ మతులు గతులు తప్పేలా చేస్తుంది. ఇప్పుడు కూడా కుర్రాళ్ల హృదయాలను గల్లంతు చేస్తుంది. తన సహజమైన అందాలతో మెస్మరైజ్ చేస్తుంది. ఈ అమ్మడి ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. హాట్ , క్యూట్ కామెంట్లు చేస్తున్నారు.
సూర్యరశ్మీ అనుపమా అందాలను కిస్ చేయగా, ఆ వేడికి చెమటలు పడుతున్నాయి. దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతూ చెమటలు పడుతున్నాయి, ఏసీ వేసుకోమంటున్నారు. అదృష్టం అంటే ఆ సూర్యకిరణాలదే అని, ఆ కిరణం తానైతే ఎంత బాగుండో అని రొమాంటిక్ కామెంట్లు చేస్తున్నారు.
అనుపమా పరమేశ్వరన్ గతేడాది వరుస సినిమాలతో అలరించింది. వరుస విజయాలను అందుకుంది. `కార్తికేయ 2`, `18పేజెస్`, `బట్టర్‌ఫ్లై` చిత్రాల్లో మెరిసింది. `బట్టర్ ఫ్లై` విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆ రెండు కమర్షియల్‌గానూ సత్తా చాటాయి. `కార్తికేయ2` వంద కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే.
అనుపమా పరమేశ్వరన్ సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. తన పాత్రకి ప్రయారిటీ ఉంటేనే, బలమైన కంటెంట్ ఉంటేనే సైన్ చేస్తుంది. రెగ్యూలర్ కమర్షియల్ సినిమాలకు అనుపమా దూరం. అదే ఆమెని ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానంలో నిలుపుతుంది.
ప్రస్తుతం అనుపమా పరమేశ్వరన్ తెలుగులో `టిల్లు స్వైర్`, అలాగే `సిరెన్`తోపాటు ఓ మలయాళ మూవీ, రెజీనాతో కలిసి మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుండటం విశేషం.