- Home
- Entertainment
- Anupama Parameswaran Photos: అనుపమ అల్లరికి సైలెంట్ అయిన పెట్.. వీకెండ్ కు విస్కీనే అంటా..?
Anupama Parameswaran Photos: అనుపమ అల్లరికి సైలెంట్ అయిన పెట్.. వీకెండ్ కు విస్కీనే అంటా..?
హీరోయిన్ గా ఎదుగుతున్నా కొద్దీ సోషల్ మీడియాలో అనుపమ ( Anupama Parameswaran) అల్లరి కూడా పెరుగుతూనే వస్తోంది. ఆమె ఎంతలా అల్లరి చేస్తుందంటే.. వాళ్ల ఇంట్లోని పెట్ కూడా సైలెంట్ అయిపోవాల్సిందే.. ఈ మేరకు ఇన్ స్టాలో అభిమానులతో ఫొటోలను పంచుకుంది అనుపమ.

అనుపమ పరమేశ్వరన్ ఇటు తెలుగు, అటు తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతోంది. ఎంత బిజీ అయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటోంది. రోజుకో తీరు నెటిజన్లను దర్శనమిస్తోంది. సాధారణంగా అనుపమ ఎంత అల్లరి చేష్టలు చేస్తుందో అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..
తెలుగు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram), నితిన్ (Nithin) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అ..ఆ’ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది అనుపమ. అంతకు ముందే ఈ భామ ప్రేమమ్ మూవీతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
ఆ మూవీ తర్వాత.. శతమానం భవతి, హాలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి చిత్రాల్లో Anupama Parameswaran నటించి తెలుగు ఆడియెన్స్ కు మరింత చేరువైంది. తన నటన, గ్లామర్ కు కూడా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సౌత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని... కొంతమేర ఫ్యాన్ బేస్ ను కూడా క్రియేట్ చేసుకుంది.
సినిమాల్లో ఎంత క్యూట్ అలరిస్తుందో.. అంతే క్యూట్ గా సోషల్ మీడియాలో నెటిజన్లను ఎప్పటికప్పుడూ పలకరిస్తూ ఉంటోంది. ఫాలోవర్స్ ను ఖుషీ చేసేందుకు ఏదోక అవతారంలో దర్శనమిస్తుంది బ్యూటీ. వీకెండ్ సందర్భంగా అనుపమ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ ఫొటోల్లో అనుపమ తన పెట్ తో ఒక బెడ్ పై పడుకొని ఫొటోలకు ఫోజులిచ్చింది. మందహాసంతో తన పెట్ డాగ్ కు కిస్సెస్ ఇస్తోంది. అయితే ఫొటోలను బాగా పరిశీలిస్తే... అనుపమ అల్లరి ధాటికి తట్టుకోలేక పెట్ సైలెంట్ గా బెడ్ పై చలనం లేకుండా పడుకుంది. దీన్ని బట్టి అనుపమ ఇంట్లో ఎంత అల్లరిగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని పలువురు నెటిజన్లు అభిప్రాపయపడుతున్నారు. ఫొటోలకు క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘సారీ కోమలీ ప్రసాద్.. నాకు విస్కీ అంటేనే ఎక్కువ ఇష్టం’ అని పేర్కొంది. బహుశ వీకెండ్ పార్టీలో అనుపమ ‘విస్కీ’కే ప్రయారిటీ ఇవ్వబోతున్నారేమో అంటూ నెటిజన్లు భావిస్తున్నారు.
తాజాగా రౌడీ బౌయ్స్ మూవీతో అలరించిన అనుపమ.. ప్రస్తుతం 18 పేజెస్, కార్తికేయ 2, బట్టర్ ఫ్లై, హెలెన్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ చిత్రాలు శరవేగంగా చిత్రీకరణ పనలను ముగిస్తున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన బట్టర్ ఫ్లై చిత్ర ఫస్ట్ లుక్.. టైటిల్ పోస్టర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. మరోవైపు సమయం దొరికనప్పుడల్లా ఇలా సోషల్ మీడియాలో తన అల్లరి చేష్టలతో దాడి చేస్తోందీ కుట్టీ..