MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే

Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే

Crazy Kalyanam Release Date: అనుపమా పరమేశ్వరన్‌, తరుణ్‌ భాస్కర్‌, అఖిల్‌ రాజ్‌, వీకే నరేష్‌ నటించిన `క్రేజీ కల్యాణం` మూవీ రిలీజ్‌ డేట్‌ వచ్చింది. రెండు వారాల ముందే ఇది ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

1 Min read
Author : Aithagoni Raju
Published : Oct 06 2026, 08:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
క్రేజీ కల్యాణంతో అనుపమా పరమేశ్వరన్‌
Image Credit : Asianet News

క్రేజీ కల్యాణంతో అనుపమా పరమేశ్వరన్‌

అనుపమా పరమేశ్వరన్‌ ఓ వైపు కమర్షియల్‌ సినిమాలతోపాటు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తూ మెప్పిస్తుంది. బలమైన మహిళా ప్రాధాన్యం కలిగిన చిత్రాలు చేస్తూ మెప్పిస్తుంది. నటిగా తానేంటో నిరూపించుకుంటోంది. ఈ క్రమంలో ఆమె తాజాగా తెలుగులో `క్రేజీ కల్యాణం` అనే సినిమాలో నటించింది. ఇందులో వీకే నరేష్‌, తరుణ్‌ భాస్కర్‌, అఖిల్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బద్రప్ప గాజుల దర్శకత్వం వహించారు. యారో సినిమాస్‌ పతాకంపై బూసం జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
విలేజ్‌ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ క్రేజీ కల్యాణం
Image Credit : Asianet News

విలేజ్‌ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ క్రేజీ కల్యాణం

ఆ మధ్య విడుదలైన టీజర్‌ ఆకట్టుకుంది. తెలంగాణ పల్లెనేపథ్యంలో సినిమా సాగుతుంది. ఇందులో తెలంగాణ పోరిగా అనుపమా కనిపిస్తుంది. ఆమె తెలంగాణ యాసలో అదరగొట్టింది. ఆమెకి పెళ్లి చేసే విషయంలో తండ్రి వీకే నరేష్‌ పడే పాట్లు, కొన్ని సంబంధాలు చెడిపోవడం, ఇందులో తరుణ్‌ భాస్కర్‌ ఎంట్రీ, అఖిర్‌ రాజ్‌ చేసే సందడితో టీజర్‌ ఆకట్టుకుంది. అలాగే విడుదలై పాటలు కూడా ఆకట్టుకున్నాయి. తాజాగా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది టీమ్‌. అయితే సినిమా ముందుగానే రిలీజ్‌ కాబోతుంది.

33
రెండు వారాల ముందే క్రేజీ కల్యాణం రిలీజ్‌
Image Credit : Asianet News

రెండు వారాల ముందే క్రేజీ కల్యాణం రిలీజ్‌

ఈ నెల 30న `క్రేజీ కల్యాణం` సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా రెండు వారాల ముందుగానే ఈనెల 16వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ ఈరోజు అనౌన్స్ చేశారు. `క్రేజీ కల్యాణం` సినిమా ప్రమోషనల్ కంటెంట్ తోనే మూవీ లవర్స్ దృష్టిని బాగా ఆకర్షించింది. ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్స్ కూడా చాట్ బస్టర్స్ అయ్యాయి. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయని టీమ్‌ తెలిపింది. మరి ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఆడియెన్స్ ని ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Recommended image2
Top 5 Flop Movies: రజనీ, సూర్య, అజిత్‌, విక్రమ్‌.. ఓవర్ హైప్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు
Recommended image3
Highest Multistarrer Hero: తెలుగులో అత్యధిక మల్టీస్టారర్స్ చేసిన హీరో ఎవరో తెలుసా? ఏకంగా 80 సినిమాలు
Related Stories
Recommended image1
Chiranjeevi Remuneration: ఫస్ట్ సినిమాకి చిరంజీవి పారితోషికం ఎంతో తెలుసా? మెగాస్టార్‌ అవ్వడమంటే ఈజీనా?
Recommended image2
Highest Multistarrer Hero: తెలుగులో అత్యధిక మల్టీస్టారర్స్ చేసిన హీరో ఎవరో తెలుసా? ఏకంగా 80 సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved