Anupama Parameswaran : అందమా.. అనుపమా..!
టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వెంటనే తనకుంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్న అతి కొద్ది మంది హీరోయిన్లలో అనుపమా పరమేశ్వరన్ ఒకరు. అయితే వరుస సినిమాలతో తన కేరీర్ లో దూసుకుపోతున్న ఈ కేరళ కుట్టి, తన రీసెంట్ ఫొటోలను అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంది.

అయితే అనుపమ గురించి కొన్ని ప్రత్యేక విషయాలను తెలుసుకుందాం. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన 'అ ఆ' మూవీతో అనుపమ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 'అ ఆ' మూవీలో ఆమె సెకండ్ హీరోయిన్ రోల్ చేసినా, తనకుంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అందుకు కారణం ఆ సినిమాలో తన అభినయం, అందుకు తనతో త్రివిక్రమ్ చెప్పించిన ‘సురపనక్క, రావనసూరుడు’ డైలాగ్ హిట్ కావడం. దీంతో అనుపమకు మంచి గుర్తింపు వచ్చింది.
అనంతరం నాగ చైతన్య (Naga chaitanya)నటించిన మలయాళం రీమేక్ ప్రేమమ్ లో ఓ హీరోయిన్ గా నటించారు. ప్రేమమ్ సైతం హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక అనుపమ మెయిన్ లీడ్ హీరోయిన్ గా తెరకెక్కించిన శతమానం భవతి సూపర్ హిట్ అందుకోవడంతో పాటు 2017లో సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. దీంతో అనుపమ సైతం హ్యాట్రిక్ విజయాన్ని సొంత చేసుకొని తన కేరీర్ కు పూలబాట వేసుకుంది.
తాజాగా దిల్ రాజు ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమా రౌడీబాయ్స్ తో తనదైన పాత్ర పోషించి అభిమానులను అలరించారు. దిల్ రాజు బ్యానర్ లో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా హుషారు ఫేమ్ హర్ష కోనుగంటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా కొద్దిమేర అనుకూల ఫలితాలే ఇచ్చాయని టాక్ వస్తోంది. కొత్త హీరో ఆషీశ్ సరసన అనుపమ నటించడంతో తన పాత్రను తిలకించేందుకే ప్రేక్షకులు ఎక్కువ మంది ఆసక్తి చూపారు.
ఈ సినిమా రిలీజ్ కు ముందుకు కూడా సినిమా ప్రమోషన్ ను కూడా హీరో ఆషష్ తో కలిసి అనుపమ తమదైన శైలిలో చేశారు. అయితే ఈ సినిమాలో అనుపమ కొన్ని బోల్డ్ సీన్స్ చేయడంతో కుర్రాళ్లకు చెమలు పట్టించింది. ఈ మూవీలో అనుపమ లిప్ లాక్ అదిరిందరూ పలువురు సోషల్ మీడియాలో తమ తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.
కాగా, తాజాగా తన అభిమానుల కోసం అనుపమ కొన్ని క్రేజీ ఫొటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఉన్న అను చెమ్కీ జాకెట్ ధరించి ఊపిరాడకుండా చేసింది. లూస్ హెయిర్ తో, వెరీ సైలెంట్ లుక్ తో కుర్రాళ్ల మతి పోగోడుతోంది. అప్పటికే తన అందంతో పిచ్చెక్కించే అనుపమ ఇలాంటి ఫొటోలతో అభిమానులను ఖుషీ చేస్తోంది.
ఇప్పటికే వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న అనుపమ, మన్ముందు మరిన్నీ సినిమాల్లో విభిన్న పాత్రలతో కనిపించి కనువిందు చేయనున్నారు. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ‘18 పేజేస్’, ‘కార్తీకేయ -2’, ‘హెలెన్’ వంటి తెలుగు సినిమాల్లో ప్రధాన పాత్రలో పోషించనున్నారు.