Prema Entha Madhuram: జిండే విషయంలో ఆలోచనలో పడ్డ అను.. కోపంతో రగిలిపోతున్న మాన్సీ!
Prema Entha Madhuram: బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం (Prema Entha Madhuram) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి ప్రేమ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

రాగసుధను అను వాళ్ళ అమ్మ, నాన్న కాపాడి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు. నొప్పి తగ్గే వరకు ఈ ఇంట్లోనే ఉండడం మంచిదని రాగసుధ (Ragasudha) మనసులో అనుకుంటుంది. మరోవైపు మీరా (Meera).. అనుకు సిసి ఫుటేజ్ ఎంత చూపించాలని ట్రై చేసినా కుదరదు. ఎందుకంటే అది మొత్తానికి డిలీట్ అవుతుంది కాబట్టి.
దాంతో మీరా ఆఫీసులో జరిగిన విషయమంతా అను కు చెబుతుంది. ఆ క్షణంలో అను.. జిండే (Jinde) కు తగిలిన దెబ్బ గురించి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక సుబ్బు, పద్దు వాళ్ళు వాళ్ల టిఫిన్ సెంటర్ కి వెళతారు. వాళ్ల టిఫిన్ సెంటర్ లో పని చేయడానికి రాగసుధ (Ragasudha) ను పెట్టుకునే ఆలోచనలో ఉంటారు.
ఆ తర్వాత అను (Arya) ఆర్య దగ్గరకు వెళ్లి మనకు తెలియకుండా జిండే సార్ ఏదో దాస్తున్నాడు అని చెబుతుంది. అందుకే సి సి ఫుటేజ్ ను కూడా డిలీట్ చేశాడు అని చెబుతుంది. దానికి ఆర్య.. జిండే ఏం చేసినా నాకు తెలిసే చేస్తాడు. నేను చెబితేనే చేస్తాడు అని అను (Anu) కు చెబుతాడు.
దానికి అను (Anu) ఆ వచ్చింది ఎవరో.. మీకు తెలిసే ఉంటుంది కదా సార్. ఎవరు ఆవిడ? అని ఆర్య ను అడుగుతుంది. దానికి ఆర్య నువ్వు అనుకున్నట్టుగా కానీ.. నువ్వు ఊహించుకున్నట్టు గా కానీ దాని వెనుక ఏ కథలు కథనాలు లేవని ఆర్య (Arya) చెబుతాడు.
ఇక అనుకు మీరా (Meera) ఎదురుపడి ఏవైనా విషయాలు తెలిసాయా అని అడుగుతుంది. దానికి అను (Anu).. సార్ ఆఫీస్ గురించే అన్నట్లు మాట్లాడుతున్నాడని.. దాని వల్ల ఎటువంటి కథనాలు లేవని సార్ అంటున్నాడని అంటుంది.
మరోవైపు మాన్సీ (Maansi) రఘుపతి పై కోపంతో రగిలిపోతుంది. రఘుపతి( Raghupathi) ప్లాన్ ఎక్స్క్యూట్ చేయకుండా ఎస్కేప్ అవుతాడని.. ఫైర్ అవుతూ తనలో తాను మాట్లాడుతుండగా ఇంతలో రఘుపతి విని లోపలికి వస్తాడు. దాంతో ఆమె షాక్ అవుతుంది.