- Home
- Entertainment
- Prema Entha Madhuram: రాగసుధతో గత జన్మ బంధం గురించి చెప్పేసిన అను.. ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన ఆర్య!
Prema Entha Madhuram: రాగసుధతో గత జన్మ బంధం గురించి చెప్పేసిన అను.. ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన ఆర్య!
Prema Entha Madhuram: బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రేమ ఎంత మధురం (Prema Entha Madhuram) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆర్య, అను (Anu) వీపు పై ఐ లవ్ యూ అని స్కెచ్ పెన్ తో రాసి ఏమి రాసాడో కళ్ళతో కాకుండా మనసు తో చూసి చెప్పమంటాడు.

ఇక అను (Anu) అది కనిపెట్టడానికి ఎన్నో అవస్థలు పడుతుంది. చివరికి ప్రశాంతంగా మనసుతో ఆలోచించి ఆర్య ఏం రాశాడో కనిపెడుతుంది. అంతేకాకుండా బెడ్ పై పడుకుని వెనుక రాసిన ఐ లవ్ యు ప్రింట్ ను వైట్ బెడ్ షీట్ పై పడేలా చేసి ఐ లవ్ యు అక్షరాల ను ప్రింట్ ద్వారా ఆర్య (Arya) కు చూపిస్తుంది.
ఆ క్రమంలో ఈ జంట వేరే స్థాయి రొమాంటిక్ మూడ్ లో ఉంటారు. ఆ తర్వాత ఇద్దరూ పడుకుంటారు. అను (Anu) పడుకున్నట్లు నటించి ఆర్య పడుకోగానే సుబ్బు కి కాల్ చేసి రాగసుధ గురించి అడుగుతుంది. ఇక సుబ్బు రాగసుధ (Raga sudha) మన ఇంటికి వచ్చింది అని చెప్పగానే.. అను ఎంతో సంతోష పడి ఒకసారి తనకు ఫోన్ ఇవ్వు అంటుంది.
ఇక ఫోన్ లో హలో అన్న రాగసుధ (raga sudha) స్వరాన్ని విన్న అను ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా 'నా జీవితంలో ఒక సమస్యకు సమాధానం నువ్వు' అని రాగసుధ తో అంటుంది. ఇక రాగ సుధ.. నీ మాటలు నాకు ఏమీ అర్థం కావడం లేదు అని చెబుతోంది. దాంతో అను (Anu) మనది విడదీయలేని బంధం అని అను చెబుతుంది.
ఇక అను (Anu) ఆ క్రమంలోనే మనది అక్కాచెల్లెళ్ల బంధం అని చెబుతుంది. కానీ అను మాటలు రాగ సుధకు ఏమాత్రం అర్థం కావు. ఇక రాగసుధ (Raga sudha) మనం ఎలా అక్క చెల్లెళ్ళం అవుతాము అను అని అడగగా.. ' మా నాన్న నీకు బాబాయి అయితే నువ్వు నాకు అక్కవె కదా' అని కవర్ చేసుకుంటుంది.
ఇక ఆ తర్వాత అను (Anu) ' నువు బావుండాలి నువ్వు బాగుంటేనే నా జీవితానికి ఒక అర్థం ఉంటుంది' అని రాగసుధ కు చెబుతుంది. దాంతో రాగసుధ నీ జీవితానికి నేను అర్థం ఏమిటి' అని అడుగగా నేను రేపు ఇంటికి వచ్చి అంతా చెబుతాను బాయ్ చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక అను (Anu) కు ఆర్య, మరో బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఇస్తాడు. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఎం జరుగుతుందో చూడాలి.