MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Prema Entha Madhuram: అనుపై అనుమానం పడుతున్న బామ్మ.. కూతురితో పెద్ద కార్యం చేయించిన ఆర్య?

Prema Entha Madhuram: అనుపై అనుమానం పడుతున్న బామ్మ.. కూతురితో పెద్ద కార్యం చేయించిన ఆర్య?

Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కథ కథనాలతో మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తమ ప్రమేయం లేకుండానే చెల్లాచెదురైపోయిన ఒక కుటుంబం కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 31 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Author : Navya G
Published : May 31 2023, 07:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఎపిసోడ్ ప్రారంభంలో బ్రో ఇన్ లా యే మనల్ని పూజ చేయమని పర్మిషన్ ఇచ్చారు కదా మరేంటి నీకు ప్రాబ్లం పూజ చేద్దాం రా అంటుంది మాన్సీ. దాంతో ఆమెపై కోప్పడతాడు నీరజ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పూజ దాదాయే చేయాలి. పంతులుగారు వేరే దారి ఏమీ లేదా అని అడుగుతాడు. ఈ ఇంటి మంచి కోరుకునే వ్యక్తి ఆయన చేతుల మీదుగా ఈ పూజ జరిగితేనే కుటుంబానికి మంచి జరుగుతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

దయచేసి వేరే దారి ఏదైనా ఉందేమో చూడండి అంటుంది అంజలి. అలాంటిదేమైనా ఉంటే నేనే చెప్పేవాడిని కదా అంటారు పంతులుగారు. నీరజ్ ఇంకా ఏదో మాట్లాడుబోతుంటే ఒక నిమిషం ఉండు అని చెప్పి బయటకు వస్తాడు ఆర్య. బామ్మ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి పాపని తనతో పాటు తీసుకువస్తాడు. భార్య లేకపోతే పూజకి పనికిరాను అన్నారు కానీ పసిపాప దేవుడితో సమానం ఈ పాపతో చేయించడానికి అభ్యంతరం ఏమీ లేదు కదా అంటాడు ఆర్య.
 

38

అలాంటిదేమీ లేదు పాపతో చేయించవచ్చు అంటారు పంతులుగారు. పాప తోనే పూజ చేయిస్తాడు ఆర్య. ఇదంతా చూస్తున్న అను తండ్రికి బిడ్డలని దూరం చేసి తెలియకుండానే వాళ్ళిద్దర్నీ కలిపావు ఏమిటి నీ లీల అని భగవంతుడిని తలుచుకొని బాధపడుతుంది అను. ఇంతలోనే బామ్మ వచ్చి ఎవరో పెద్దింటాయన వచ్చారు పాప చేత పూజ చేయిస్తాను అంటే అంతకన్నా అదృష్టమా అని చెప్పి ఇచ్చాను.
 

48

నిన్ను అడగకుండానే ఇచ్చినందుకు ఏమీ అనుకోకు అంటుంది. ఇందులో అనుకోడానికి ఏముంది బామ్మ.. పూజే కదా అంటుంది అను. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద పూజ నీ బిడ్డ చేతుల మీదుగా జరుగుతుంది అంటే నీ బిడ్డలు నిజంగా అదృష్టవంతులు అంటుంది బామ్మ. పాపతో పూజ పూర్తయిన తర్వాత బిడ్డని అంజలి చేతిలో పెడతాడు ఆర్య. అంజలి పాపని ముద్దాడుతుంది. శారదమ్మ ఆ పాపని తీసుకుని ఏ తల్లి కన్న బిడ్డ ఈ బిడ్డ చేతుల మీదుగా పూజ జరగాలని రాసి ఉంది.
 

58

అన్ని బాగుంటే నీ బిడ్డలు కూడా అంటూ ఏదో అనబోతుంది కానీ ఆర్య బాధపడటం చూసి ఆగిపోతుంది. పంతులుగారు పూజ పూర్తయింది అని చెప్పటంతో పాపని తీసుకుని వెళ్లి బామ్మ కి అప్పజెప్తాడు ఆర్య. ఈరోజు మీ పాప వల్ల పూజ బాగా జరిగింది అని చెప్పి వదలలేక, వదలలేక వెళ్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి పోదాము అంటుంది అను. ప్రసాదం తీసుకోకుండా వెళ్ళకూడదమ్మ ఉండు ప్రసాదం తీసుకొస్తాను అంటుంది బామ్మ. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అంటుంది అను.
 

68

ఎందుకు అని అనుమానంగా అడుగుతుంది బామ్మ. నోరు జారినందుకు.. కంగారు పడి నువ్వు ఉండు నేను వెళ్లి తొందరగా ప్రసాదం తీసుకొని వచ్చేస్తాను అని తన బిడ్డను కూడా బామ్మ చేతిలో పెట్టి ఈ బిడ్డల్ని ఎవరికంటా పడకుండా చూసుకో అంటూ ప్రసాదం తీసుకోవటానికి వెళ్తుంది అను. అనుని అనుమానంగా చూస్తుంది బామ్మ. ప్రసాదం తీసుకోవటానికి క్యూలో నిల్చున్న తరువాత అక్కడ ప్రసాదం ఇస్తున్న శారదమ్మ, అంజలి వాళ్ళని చూసి షాక్ అవుతుంది అను.
 

78

వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ వెనక్కి తిరిగేసరికి జెండే, ఆర్య మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. టెన్షన్ తో ఏం చేయాలో అను కి అర్థం కాదు. నడుముకి కట్టుకున్న టవల్ తీసి మొహాన్ని కవర్ చేసుకుంటుంది. జెండేవాళ్ళు శారదమ్మ దగ్గరికి వచ్చి మేము కారు దగ్గర వెయిట్ చేస్తాము మీరు ప్రసాదం పంచేసి అక్కడికి వచ్చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
 

88

అను కంగారులో ప్రసాదం తీసుకోకుండానే వెళ్ళిపోతుంటే శారదమ్మ ప్రసాదం తీసుకుని వెళ్ళమ్మా అని పిలుస్తుంది. ముసుగులో నుంచే ప్రసాదం తీసుకుంటుంది అను. బయటికి వచ్చిన తరువాత బాగా ఏడుస్తుంది అను. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan: ఫ్లాప్ అయ్యాక 'జన నాయగన్' డైరెక్టర్ షాకింగ్ డెసిషన్, ఏం చేయబోతున్నారో తెలుసా ?
Recommended image2
Bigg Boss Kaushal: కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిపడేసిన బిగ్ బాస్ కౌశల్, ఇప్పుడేం చేస్తారో చూద్దాం
Recommended image3
Zee5 OTT: జీ5 ఓటీటీలో భారీ సినిమాల లైనప్.. వెంకీ అనిల్ 5, ఎన్‌బీకే111, వృషకర్మ అన్నీ ఇందులోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved