ఏమన్నా అందమా..అంతేసి కళ్ళతో మాయ చేస్తున్న అను ఇమ్మాన్యుయేల్, అయస్కాంతంలా ఆకర్షించే సొగసు
తాజాగా అను ఇమ్మాన్యుయేల్ నటించిన క్రేజీ మూవీ జపాన్. కార్తీ సరసన ఈ చిత్రంలో అను హీరోయిన్ గా నటించింది.
తెలుగులో నటించిన తొలి చిత్రంతోనే హిట్ అందుకున్న నటి అను ఇమ్మాన్యుయేల్. నానికి జోడిగా అను నటించిన మజ్ను చిత్రం విజయం సాధించింది. తొలి చిత్రమే విజయం సాధించడం, గ్లామర్ పరంగా యువతని ఆకర్షించడంతో అను ఇమ్మాన్యుయేల్ మరిన్ని అవకాశాలు అందుకుంది.
ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేసే అవకాశం దక్కించుకుంది ఈ బ్యూటీ. ఎన్నో ఆశలు పెట్టుకున్న అజ్ఞాతవాసి చిత్రం భారీ అంచనాలతో విడుదలై తీవ్రంగా నిరాశపరిచింది.
ఆ తర్వాత అను.. బన్నీ సరసన నటించిన నా పేరు సూర్య చిత్రం కూడా విజయం సాధించలేదు. దీనితో రెండు భారీ చిత్రాల్లో ఆమెని దురదృష్టమే వెంటాడింది. ఈ రెండు చిత్రాలు విజయం సాధించి ఉంటే ప్రస్తుతం అను క్రేజ్ వేరుగా ఉండేది.
ఇప్పటికీ అను ఇమ్మాన్యుయేల్ మంచి అవకాశాలే అందుకుంటోంది. కానీ అదృష్టం కలసి రావడం లేదు. ఇటీవల అను.. అల్లు శిరీష్ కి జోడిగా 'ఉర్వశివో రాక్షసివో' అనే చిత్రంలో నటించింది. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రొమాంటిక్ హిట్ గా నిలిచింది.
గ్లామర్ పరంగా కుర్రాళ్లలో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి అను ఇమ్మాన్యుయేల్. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో కుర్రాళ్లని కనువిందు చేస్తోంది.తాజాగా అను ఇమ్మాన్యుయేల్ నటించిన క్రేజీ మూవీ జపాన్. కార్తీ సరసన ఈ చిత్రంలో అను హీరోయిన్ గా నటించింది.
రీసెంట్ గా ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. నవంబర్ 10న జపాన్ చిత్రం రిలీజ్ అవుతుండడంతో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. అను ఇమ్మాన్యుయేల్, కార్తీ తో పాటు చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు.
నేచురల్ స్టార్ నాని ప్రీ రిలీజ్ వేడుకకి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అను ఇమ్మాన్యుయేల్ తన గ్లామర్ తో కుర్రాళ్ళని అయస్కాంతంలా లాగేసింది.
అను ఇమ్మాన్యుయేల్ తన గ్లామర్ పదును చూపించింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, చీరకట్టులో అందాలు చూపిస్తూ కుర్రాళ్ళు మైమరచిపోయే ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
పెదవుల అందం, పెద్ద కళ్ళు చూస్తే ఎవరైనా మైకంలో మునిగిపోవాల్సిందే. అంత ఘాటుగా ఆమె సొగసు ఉంది. సన్నని మెరుపు తీగలా, క్యూట్ గా అదరగొట్టేసింది.
అను ఇమ్మాన్యుయేల్ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని థియేటర్ లో చూడాలని కోరింది. జపాన్ మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం తెరకెక్కించిన చిత్రం అని పేర్కొంది.