MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డైరెక్టర్ అసభ్యకర వ్యాఖ్యలు, స్పందించిన హీరోయిన్..శరీరం గురించి దారుణంగా మాట్లాడినప్పటికీ..

డైరెక్టర్ అసభ్యకర వ్యాఖ్యలు, స్పందించిన హీరోయిన్..శరీరం గురించి దారుణంగా మాట్లాడినప్పటికీ..

మన్మథుడు చిత్రంలో నటించిన అన్షు అంబానీని తెలుగు ప్రేక్షకులు మరచిపోలేరు. మన్మథుడు చిత్రంలో అన్షు అంబానీ నాగార్జునతో కలసి రొమాంటిక్ గా కెమిస్ట్రీ పండించింది. మన్మథుడు తో పాటు తెలుగులో అన్షు మరికొన్ని చిత్రాల్లో నటించింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 14 2025, 12:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మన్మథుడు చిత్రంలో నటించిన అన్షు అంబానీని తెలుగు ప్రేక్షకులు మరచిపోలేరు. మన్మథుడు చిత్రంలో అన్షు అంబానీ నాగార్జునతో కలసి రొమాంటిక్ గా కెమిస్ట్రీ పండించింది. మన్మథుడు తో పాటు తెలుగులో అన్షు మరికొన్ని చిత్రాల్లో నటించింది. అయితే మన్మధుడు చిత్రంతో వచ్చినంత గుర్తింపు వేరే చిత్రాలతో రాలేదు. అన్షు అంబానీ చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత అన్షు తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం మజాకా. 

24

త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ త్రినాధరావు నోరు జారీ అన్షు గురించి అసభ్యంగా మాట్లాడారు. మన్మథుడు చిత్రంలో ఆమెని చూడడం కోసమే థియేటర్స్ కి వెళ్ళేవాళ్ళం.. లడ్డూలా ఉండేది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. కాకపోతే కాస్త సన్నబడింది. 

34

తెలుగులో నటించాలనంటే అన్ని పెద్దగా ఉండాలి. అన్ని ఎక్కువ  సైజులో కనిపించాలి అని చెప్పినట్లు త్రినాధరావు అన్షు గురించి అసభ్యకరమైన కామెంట్స్ చేసారు. అతడి కామెంట్స్ పట్ల తెలంగాణ మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. సూమోటోగా ఆయనకి నోటీసులు పంపబోతున్నట్లు పేర్కొంది. త్రినాధరావు సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. 

44

ఈ వివాదంపై అన్షు ఎట్టకేలకు స్పందించింది. ఈ ప్రపంచంలో త్రినాధరావు గారు చాలా మంచి వ్యక్తి. ఆయన దర్శకత్వంలో నేను రీ ఎంట్రీ ఇస్తున్నందుకు సంతోషిస్తున్నా. ఆయనపై నాకు ఎలాంటి కోపం లేదు. నన్ను ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకున్నారు. ఆయన సూచనలు, సలహాకు నాకు ఉపయోగపడ్డాయి. దయచేసి ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టండి అని అన్షు కోరింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Thalapathy Vijay: అజిత్ సూపర్ హిట్ సినిమాలో విలన్‌గా విజయ్‌.. దళపతి డ్రీమ్‌ బయటపెట్టిన స్టార్‌ డైరెక్టర్‌
Recommended image2
Allu Arjun: పబ్లిక్ గా అల్లు అర్జున్ పరువు తీసేసిన తమ్ముడు శిరీష్..!
Recommended image3
Tarun: వీళ్ళ దెబ్బకు చిరు, పవన్, వెంకీ లకు చెమటలు..తక్కువ టైంలోనే క్రేజ్, అంతే వేగంగా కనుమరుగైన ఐదుగురు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved