MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరుకి బాగా కలసి వచ్చిన అంశంపై ఏఎన్నార్ ఓపెన్ కామెంట్స్, ఇంత దారుణమా.. సుమకి వార్నింగ్ ఇస్తూ 

చిరుకి బాగా కలసి వచ్చిన అంశంపై ఏఎన్నార్ ఓపెన్ కామెంట్స్, ఇంత దారుణమా.. సుమకి వార్నింగ్ ఇస్తూ 

మెగాస్టార్ చిరంజీవి, లెజెండ్రీ నటులు అక్కినేని నాగేశ్వర రావు మెకానిక్ అల్లుడు అనే చిత్రంలో కలసి నటించారు. అయితే ఆ చిత్రం అంతగా వర్కౌట్ కాలేదు. కానీ ఏఎన్నార్, చిరంజీవి మధ్య మంచి రిలేషన్ ఉంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 01 2024, 03:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మెగాస్టార్ చిరంజీవి, లెజెండ్రీ నటులు అక్కినేని నాగేశ్వర రావు మెకానిక్ అల్లుడు అనే చిత్రంలో కలసి నటించారు. అయితే ఆ చిత్రం అంతగా వర్కౌట్ కాలేదు. కానీ ఏఎన్నార్, చిరంజీవి మధ్య మంచి రిలేషన్ ఉంది. టాలీవుడ్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో దాదాపు సెలెబ్రిటీలు అంతా పాల్గొన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ కార్యక్రమానికి సుమ యాంకరింగ్ చేసింది. చిరంజీవి, ఏఎన్నార్ పక్కపక్కనే కూర్చున్నారు. ఏఎన్నార్ ని మాట్లాడమని సుమ మైక్ ఇచ్చింది. అప్పుడే ఏఎన్నార్ పక్కన అలనాటి హీరోయిన్ సరోజ దేవి కూర్చున్నారు. నువ్వొచ్చి పక్కన కూర్చుంటే ఇంకేం మాట్లాడతాను అంటూ ఏఎన్నార్ చిలిపిగా అన్నారు. సరోజ దేవి కూడా అంతే చిలిపిగా ఏఎన్నార్ ని భుజంపై కొట్టింది. 

37

ఇంతలో చిటపట చినుకులు సాంగ్ గురించి మాట్లాడమని చిరంజీవి అడిగారు. దీనితో ఏఎన్నార్ వర్షం పడాలి కదా అని నవ్వుతూ అన్నారు. ఆత్మబలం చిత్రంలో ఏఎన్నార్, సరోజాదేవి మధ్య వచ్చే చిటపట చినుకులు సాంగ్ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ఆ తర్వాత ఏఎన్నార్ మాయాబజార్ చిత్రం గురించి చెప్పారు. 

47

మాయాబజార్ చిత్రంలో తనతో పాటు ఎన్టీఆర్, సావిత్రి, ఎస్వీరంగారావు అందరూ హీరోలే అని అన్నారు. ఆ తర్వాత సుమ మాట్లాడుతూ మీరు నటించిన హీరోయిన్లలో ఎవరంటే బాగా ఇష్టం అని అడుగుతూ ఇరకాటంలో పెట్టింది. నాకు ఎవ్వరూ ఇష్టం లేదు. నేను పోషించిన స్త్రీ పాత్రలే నాకు ఇష్టం అని ఏఎన్నార్ తెలివిగా సమాధానం ఇచ్చారు. 

57

చివరగా చిటపట చినుకులు గురించి చెప్పండి అని సుమ ఏఎన్నార్ ని అడిగింది. ఏఎన్నార్ తో పాటు మెగాస్టార్ చిరంజీవికి కూడా  రైన్ సాంగ్స్ చాలా బాగా కలసివచ్చాయి. సుమ అడిగింది కాబట్టి ఆ సాంగ్స్ వెనుక ఉన్న దారుణమైన నిజాన్ని ఏఎన్నార్ బయట పెట్టారు. 

67

పక్కనే సరోజ దేవి ఉండగా.. ఆ సాంగ్ షూటింగ్ కి ముందు మేమిద్దరం చలి నీళ్లలో తడవాలి. లైటింగ్ రెడీ కావడానికి చాలా సమయం పడుతుంది. అంతలోపు మేము వణుకుతూ ఉంటాం. ఆ నీళ్లు మంచివి కాదు. ఎక్కడో ఉండే చెరువులో నుంచి తీసుకువస్తారు. మురికి నీళ్ళల్లో తడిచేవారం. ఆ తర్వాత 15 రోజులు జలుబు ఉంటుంది అంటూ ఏఎన్నార్ నవ్వులు పూయించారు. 

77

పక్కనే ఉన్న చిరు పగలబడి నవ్వారు. చూసే వాళ్ళకి మాత్రం రైన్ సాంగ్స్ ఎంతో హాయిగా ఉంటాయి. మాకు మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలు ఇక అడగొద్దు నువ్వు అంటూ ఏఎన్నార్ సుమకి వార్నింగ్ ఇచ్చారు. అటు ఏఎన్నార్, ఇటు చిరంజీవి ఇద్దరూ తమ కెరీర్ లలో చేసిన రైన్ సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అయితే రైన్ సాంగ్స్ షూటింగ్ ఇంత దారుణంగా ఉంటుందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vaishnavi Sony: ఫోక్ సాంగ్స్ తో అదరగొడుతున్న తెలంగాణ పిల్ల, మరో నాగదుర్గ కానుందా?
Recommended image2
Mahesh Babu: నమ్రత చంపి సమాధి చేస్తుంది.. మహేష్ బాబుతో పెళ్లి పై హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
Recommended image3
Toxic Release Date: ఆడియెన్స్ కి టాక్సిక్‌ టీమ్‌ కండీషన్స్.. వీళ్లు సినిమా చూడకూడదు, వీడియో మైండ్ బ్లోయింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved