ఏఎన్నార్, రాఘవేంద్రరావు వల్ల క్రేజీ హీరోకి బిగ్ డిజాస్టర్.. ఇద్దరినీ ఎలా తిట్టాడో తెలుసా ?
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు అప్పట్లో ఏఎన్నార్, శోభన్ బాబు లాంటి హీరోలతో అనేక చిత్రాలు చేశారు. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో అనేక చిత్రాలు చేశారు. ఇప్పటి హీరోలు అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి హీరోలతో కూడా రాఘవేంద్ర రావు సినిమాలు చేశారు.
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు అప్పట్లో ఏఎన్నార్, శోభన్ బాబు లాంటి హీరోలతో అనేక చిత్రాలు చేశారు. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో అనేక చిత్రాలు చేశారు. ఇప్పటి హీరోలు అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి హీరోలతో కూడా రాఘవేంద్ర రావు సినిమాలు చేశారు. అందరితో సక్సెస్ ఫుల్ చిత్రాలు చేసిన చరిత్ర రాఘవేంద్ర రావుది.
అయితే రాఘవేంద్ర రావు ఒక బడా ఫ్యామిలీకి చెందిన హీరోకి మాత్రం హిట్ ఇవ్వలేక పోయారు. ఆ హీరో ఎవరో కాదు అక్కినేని నాగేశ్వర రావు మనవడు సుమంత్. సుమంత్, రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో పెళ్లి సంబంధం అనే చిత్రం వచ్చింది. సుమంత్ కి హీరోగా అది మూడవ చిత్రం. ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఏఎన్నార్ కి ఎంతో ఇష్టమైన మనవడు సుమంత్.. సుమంత్ ని పెంచి పెద్ద చేసింది ఆయనే. దీనితో సుమంత్ కెరీర్ పై కూడా ఏఎన్నార్ దృష్టిపెట్టారు.
సుమంత్ కెరీర్ ని ఎలాగైనా ట్రాక్ లో పెట్టాలని ఏఎన్నార్ రాఘవేంద్ర రావు తో ఒక ప్రాజెక్ట్ సెట్ చేశారు. ఆ చిత్రమే పెళ్లి సంబంధం. 2000 సంవత్సరంలో విడుదలైన ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ చిత్రంలో సాక్షి శివానంద్ హీరోయిన్ గా నటించింది. సుమంత్ అలీతో సరదాగా షోలో పాల్గొన్నప్పుడు ఈ చిత్రం గురించి చర్చ వచ్చింది.
సుమంత్ గురించి వైరల్ రూమర్ ని అలీ ప్రస్తావించాడు. పెళ్లి సంబంధం చిత్రం ఫ్లాప్ అయ్యాక ఏఎన్నార్, రాఘవేంద్ర రావు ఇద్దరినీ తిట్టావని, వాళ్ళిద్దరికీ స్టోరీ సెలెక్ట్ చేయడం రాదని అన్నావని ప్రచారం జరుగుతోంది నిజమేనా అని అలీ ప్రశ్నించారు. సుమంత్ బదులిస్తూ నేను అలా అనలేదు. కాకపోతే వాళ్లిద్దరూ ఆ చిత్రాన్ని ఇష్టం లేకుండా చేశారు అని మాత్రం చెప్పినట్లు సుమంత్ తెలిపారు. ఈ చిత్రంలో ఏఎన్నార్ కూడా నటించారు. అయితే కథ ఇద్దరికీ పూర్తిగా నచ్చలేదు.
కానీ ఈ కాంబినేషన్ సెట్ కావాలి అనే ఉద్దేశంతో హడావిడిగా చేశారు. అందువల్లే ఆ మూవీ నిరాశపరిచింది. తాత ఏఎన్నార్ గారికి కథ పూర్తిగా నచ్చలేదు.. రాఘవేంద్ర రావుకి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. కథలో బాగాలేని అంశాలని మార్చకుండానే ప్రాజెక్టు మొదలు పెట్టారు అని సుమంత్ తెలిపారు.