పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్‌లో మరో భారీ మల్టీస్టారర్?
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుందా? ఈ హిట్ కాంబినేషన్‌లో భారీ మల్టీస్టారర్ తెరకెక్కబోతుందా? అంటే అవుననే టాక్ ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి వినిపిస్తుంది.
పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి ఇప్పటికే మల్టీస్టారర్ `గోపాల గోపాల` చిత్రంలో నటించారు.
ఇది బాలీవుడ్‌లో రూపొందిన `ఓ మై గాడ్`కి రీమేక్. తెలుగులో `గోపాల గోపాల`గా రీమేక్ యావరేజ్‌గా నిలిచింది.
ఆ తర్వాత మరోసారి పవన్, వెంకీ కలిసి ఒకే తెరపై `అజ్ఞాతవాసి`లో మెరిశారు.
పవన్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో క్లైమాక్స్ ముందు వచ్చే సన్నివేశంలో వెంకటేష్ గెస్ట్ రోల్‌లో నటించారు. ఆయన మెరిసినా సినిమాని విజయ తీరానికి చేర్చలేకపోయారు.
మరోసారి వీరిద్దరు కలిసి నటించబోతున్నట్టు తెలుస్తుంది. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన `అయ్యప్పనుమ్ కోషియమ్` ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ దీని రీమేక్ హక్కులను దక్కించుకుంది.
ఈ మల్టీస్టారర్‌లో మొదట బాలకృష్ణ-రానా, రానా- రవితేజ, వెంకీ- రానా, బాలకృష్ణ- ఎన్టీఆర్ వంటి పేర్లు వినిపించాయి. కానీ తాజాగా వెంకీ, పవన్ హీరోలుగా తెరకెక్కించాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరితో ఈ రీమేక్‌కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. మరి వీరిద్దరు ఒప్పుకుంటారా? లేదా? అన్నది చూడాలి. మలయాళంలో బీజు మీనన్, పృథ్వీరాజ్ నటించారు.
ప్రస్తుతం వెంకీ `అసురన్` రీమేక్ `నారప్ప` చిత్రంలో నటిస్తున్నారు. పవన్ ప్రస్తుతం `వకీల్‌సాబ్`లో నటిస్తుండగా, క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే హరీష్ శంకర్ డైరెక్షన్‌లో మరో సినిమా చేయనున్నారు.