MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • సినిమా సెట్‌లో రమ్మంటూ శోభన్‌బాబు సైగలు.. అన్నపూర్ణమ్మకి సోగ్గాడు నేర్పిన జీవిత పాఠం

సినిమా సెట్‌లో రమ్మంటూ శోభన్‌బాబు సైగలు.. అన్నపూర్ణమ్మకి సోగ్గాడు నేర్పిన జీవిత పాఠం

అన్నపూర్ణమ్మని రామానాయుడు అవమానించిన విషయం, అలాగే శోభన్‌ బాబు తనని సెట్‌లో రమ్మని పిలిచిన విషయం గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేసింది. సోగ్గాడి మాట తన లైఫ్‌నే మార్చేసిందని తెలిపింది.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 14 2024, 07:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అన్నపూర్ణమ్మ మదర్‌ రోల్స్ కి కేరాఫ్‌ అడ్రెస్‌. దాదాపు అందరు స్టార్‌ హీరోలకు తల్లి పాత్రలు చేసి మెప్పించింది. హీరోలు, హీరోయిన్లకి అమ్మగా, అత్తగా చేసి అలరించింది. ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు అమ్మ పాత్రల నుంచి బామ్మ పాత్రలకు షిఫ్ట్ అయ్యింది. వయసు మీద పడిన నేపథ్యంలో ఆమె చాలా వరకు బామ్మ పాత్రలతోనే మెప్పిస్తుంది. అదే సమయంలో సినిమాలు కూడా తగ్గాయి. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇదిలా ఉంటే అన్నపూర్ణమ్మ లైఫ్‌ టర్న్ అవ్వడానికి, నటిగా సినిమా రంగంలో నిలబడటానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా శోభన్‌బాబు కారణం అని తెలిపింది. ఆయన చెప్పిన ఓ మాట తాను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని, అదే ఆమె లైఫ్‌ని మలుపు తిప్పిందని చెప్పింది. మరి ఇంతకి ఏం జరిగిందంటే, తనకు జరిగిన అవమానాలను బయటపెట్టింది అన్నపూర్ణమ్మ.

రామానాయుడు చేసిన అవమానం వెల్లడించింది. రామానాయుడు ఆ టైమ్‌లో `ముందడుగు` సినిమా చేస్తున్నారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ, సోగ్గాడు శోభన్‌బాబు హీరోలుగా నటించారు. అప్పట్లో ఇది పెద్ద మల్టీస్టారర్‌ మూవీ. ఇందులో తల్లి పాత్ర కోసం ఎవరిని అనేది పెద్ద చర్చ జరిగింది. 
 

35

చాలా మంది మదర్ క్యారెక్టర్‌ చేసే ఆర్టిస్ట్ లను చూశారు. అందులో అన్నపూర్ణమ్మని సజెస్ట్ చేశారు. అయితే ఈమె యంగ్‌గా ఉండేదట. పెద్ద స్టార్‌ హీరోలకు అమ్మ అంటే సెట్‌ కాదేమో అని రామానాయుడు నో అన్నాడట. కానీ బలవంతంగానే ఓకే చేశాడట. అయినా షూటింగ్‌లో ఎప్పుడూ తన వైపే చూస్తుండేవాడట.

అది తమకు చాలా ఇబ్బందిగా అనిపించేదని చెప్పింది అన్నపూర్ణమ్మ. మొత్తానికి షూటింగ్‌ అయిపోయిందని, కానీ డబ్బింగ్‌ చెప్పించలేదని తెలిపింది. అదేంటని అడిగితే నీ వాయిస్‌ బాగా లేదు అని చెప్పారట. దీంతో తాను కన్నీళ్లు పెట్టుకున్నట్టు తెలిపారు. అయితే ఆ సౌండ్‌ ఇంజనీర్‌ చూసి డబ్బింగ్‌ ప్రాక్టీస్‌ చేయించి చెప్పితే, వాయిస్‌ బాగుందని ఓకే చేశారట.  
 

45

అయితే ఈ సినిమా షూటింగ్‌ టైమ్‌లో ఓ వైపు తాను, తన అమ్మ కూర్చునే వాళ్లట. వాళ్లని గమనించిన శోభన్‌బాబు ఇటు రమ్మని సైగలు చేసేవాడట. చాలా సేపు ఆయన సైగలు చేయడంతో మొదట్లో ఇబ్బంది పడ్డారు. అంత పెద్ద హీరో అలా సైగలు చేస్తున్నాడేంటి? అని ఏవేవో అనుకున్నారట. ఆ తర్వాత తనే దగ్గరికి వెళ్లింది. ఆయన ఏ ఊరు అని అడిగితే బెజవాడ అని, వేషాలు వేయడానికి వచ్చామని చెప్పారట.

అయితే ఇక్కడ వేషాలు వేయాలంటే అలా ఓ మూలకు కూర్చోవద్దు, అలా కూర్చుంటే ఎవరూ పట్టించుకోరు, ఎప్పుడూ అక్కడే ఉండిపోతారు, కాస్త పది మంది ఉన్న చోట, ఎక్కువగా మాట్లాడుకునే చోట ఉండాలని, వాళ్ల మధ్యలో ఉండాలని, మాటలో మాట కలుపుతుండాలని తెలిపారట శోభన్‌బాబు. 
 

55
Annapurna

Annapurna

జనంలో, సినిమా యూనిట్ల మధ్యలో కనిపిస్తే గుర్తిస్తారని, మీరు ఆర్టిస్టులనేది వాళ్లకి ఓ ఐడియా ఉంటుందని, అప్పుడే వేషాలు వస్తాయని తెలిపారట. అలాగే అని అక్కడి నుంచి వెళ్లిపోయారట. అయితే ఆ రోజు ఆయన చెప్పిన మాట తన జీవితంలో ఎంతో ఉపయోగపడిందని, అదొక జీవిత పాఠంలా మారిందని, ఆ రోజు ఆయన ఆ మాట చెప్పి ఉండకపోతే తాను ఎలా ఉండేదాన్నో అని వెల్లడించింది అన్నపూర్ణమ్మ.

ఎందుకంటే అంతకు ముందు తాను కేవలం కనిపిస్తే సినిమాల్లో తప్ప, బయట ఎక్కడా కనిపించేదాన్ని కాదని తెలిపింది. ఆయన మాట వల్ల మారిపోయామని ఆ తర్వాత తన కెరీర్‌ మలుపు తిరిగిందని తెలిపింది. ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే టాక్‌ షోలో ఈ విషయాలను పంచుకుంది అన్నపూర్ణమ్మ. ఆమె ఇటీవల `మిస్టర్‌ బచ్చన్‌`, `మారుతీ నగర్‌ సుబ్రమణ్యం` సినిమాల్లో నటించి మెప్పించింది. 

డిప్రెషన్‌లోకి వెళ్లిన శ్రీకాంత్‌, ఆల్మోస్ట్ కెరీర్ క్లోజ్‌.. చిరంజీవి వల్లే మళ్లీ మామూలు మనిషి
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Recommended image2
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image3
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved