intinti Gruhalakshmi: అడ్డం తిరిగిన లాస్య ప్లాన్.. తులసిని మాటలతోనే హింసించిన అభి!
intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈ రోజు జూన్ 7వ తేదీన ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే అంకిత (Ankitha) వాళ్ళమ్మతో నువ్వు లాస్య (Lasya) ఆంటీ మాయలో పడ్డావు, తను చెప్పినట్లు నడుచుకుంటున్నావు అని అంటుంది. గాయత్రి నువ్వే తులసి మాయలో పడ్డావు అని అంటుంది. ఇక అంకిత ఎందుకు ఆంటీ ను ఊరికే బ్లేమ్ చేస్తున్నావు అని అడుగుతుంది. ఇక గాయత్రి నీ ఆస్తి కోసం తులసీ తన కొడుకుని ఈ ఇంటికి పంపింది అని అంటుంది.
ఆ మాట కి అంకిత (Ankitha) స్టన్ అవుతుంది. ఇక ఆ తర్వాత అంకిత తులసి (Tulasi) గొప్పతనాన్ని వివరించి, లాస్య ఎవిల్ ప్లాన్ ను బయట పెడుతుంది. ఇక ఆస్తి నా పేరు మీదకు వచ్చిన వెంటనే.. తులసి ఆంటీ పేరు మీద రాస్తా అని అంటుంది. ఆ మాటకి గాయత్రి ఆశ్చర్యపోతుంది. ఇక నువ్వు తులసి ఆంటీ ని చేస్తున్న అవమానాలకు.. నేను వేస్తున్న పెనాల్టీ అని అంకిత అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
మరోవైపు తులసి (Tulasi) తన భర్త వల్ల నా బిడ్డకు ఏమైనా నష్టం జరిగితే అసలు సహించను అని పరందామయ్య (Parandamaiah) తో అంటుంది. ఇక పట్టుదలతో అభి నన్ను అర్థం చేసుకునేలా చేస్తాను అని అంటుంది. ఇక అభికి లాస్య గాయత్రి లు తన తల్లి గురించి అనేక మాటలు నూరిపోస్తున్నారు. ఇక అభి అమ్మ నాన్న గురించి నాతో చెడు చెడుగా చెప్పడం ఏమిటి? అది పద్ధతేనా అని వాళ్లకు చెప్పుకుంటాడు.
ఇక మా ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతూ బంధాన్ని తెంచాలని అనుకుంటుంది అని అభి (Abhi) తన తల్లిని అపార్థం చేసుకుంటాడు. ఇక అభి అపార్థానికి లాస్య గాయత్రి (Gayathri) లు మరింత ఆజ్యం పోస్తారు. మరోవైపు తులసి నా కొడుకు ప్రమాదంలో పడిపోతున్నాడు అని తెలిసికూడా చూస్తూ వదలలేను కదా అని వాళ్ల మామయ్య కు చెప్పుకుంటూ బాధపడుతుంది.
ఇక గాయత్రి (Gayathri) అంకిత తన ఆస్తిని తులసి (Tulasi) కి రాశి ఇవ్వడానికి చూస్తుంది అన్న సంగతి అభి వాళ్లకు చెబుతుంది. ఇక లాస్య ఆస్తి ని అంకిత పేరు మీద కాకుండా.. అభి పేరుమీద రాయించాలి అని అంటుంది. అంతేకాకుండా ఆస్తి అభి పేరు మీద ఉంటేనే అంకితకు నిజమైన మొగుడు గా ఉంటాడు.. ఇక ఆస్తి కూడా హ్యాండిల్ చేయగలుగుతాడు అని అంటుంది.
తర్వాత ఆస్తిని అల్లుడు పేరుమీద ట్రాన్స్ఫర్ చేయించకుండా కూతురు పేరు మీద ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అని గాయత్రి (Gayathri) వాళ్ళ భర్త ను అడుగుతుంది. ఇక ఈ సలహా ఎవరిచ్చారు అని అడగగా తులసి అని సమాధానం చెబుతాడు. ఇక అభి తులసి (Tulasi) దగ్గరికి వెళ్లి తన కొడుకు బాగుపడుతుంటే చూడలేక పోతుంది అని నిందలు వేస్తాడు.