MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Prema Entha Madhuram: మాన్సీకి చెమటలు పట్టించిన అంజలి.. భర్తను ఏడిపిస్తున్న అను?

Prema Entha Madhuram: మాన్సీకి చెమటలు పట్టించిన అంజలి.. భర్తను ఏడిపిస్తున్న అను?

Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. కారణం తెలియకుండా తనకి దూరమైన భార్యాపిల్లల కోసం తపన పడుతున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 1 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Author : Navya G
Published : Jun 01 2023, 07:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఎపిసోడ్ ప్రారంభంలో ముసుగు వేసుకొని శారదమ్మ వాళ్ళ దగ్గర ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతుంది అను. పక్కకు వెళ్లి ఏడుస్తుంది. అక్కడినుంచి వెళ్ళిపోదాం అనుకునే సమయానికి ఆర్య మాటలు వినిపించడంతో పక్కకి నక్కి దాక్కుంటుంది. ఆర్య వెళుతూ వెళుతూ కిందపడి ఉన్న కుంకాన్ని చూసుకోకుండా కాలితో మట్టేసి వెళ్ళిపోతాడు. అది చూసిన అను అపురూపంగా ఆ కుంకాన్ని చేతిలోకి తీసుకుంటుంది.
 

28

మరోవైపు అందరూ వెళ్లిపోయారు నేను కూడా కార్ తీసుకొస్తాను. నువ్వు వెళ్లి మాన్సీని పిలుచుకురా అని అంజలికి చెప్తాడు నీరజ్. అదే సమయంలో మాన్సీ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ అంజలి వల్ల ఈరోజు నా ప్లాన్ అప్సెట్ అయింది. తను నాకు అడుగడుగునా అడ్డు తగులుతుంది. సమయం చూసి తన అడ్డు తొలగించుకోవాలి అంటుంది మాన్సీ. ఇంతలో అంజలి రావడం గమనించి ఫోన్ పెట్టేస్తుంది.
 

38

మాన్సీ ఫోన్ మాట్లాడటం అంజలి చూస్తుంది.  నెక్స్ట్ ఏం ప్లాన్ వేయాలి.. ఆర్య సార్ ని ఎలా డిస్టర్బ్ చేయాలి అని మంతనాలు చేస్తున్నావా.. అది కుదరని పని  చూసావుగా నువ్వు చేయాలనుకున్న పూజని చిన్న పాపతో చేయించారు ఆర్య సార్  అంటుంది అంజలి. నా విషయంలో జోక్యం చేసుకోకు.. ఎక్కువగా మాట్లాడితే నువ్వు కూడా అనులాగా తట్ట బుట్ట సర్దుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటుంది మాన్సీ. సడన్ గా అంజలి అనుని పిలుస్తుంది.
 

48

కంగారుపడుతూ అను ఎక్కడుంది అని చుట్టూ చూస్తుంది మాన్సీ. అను ఇక్కడే ఉందన్న అనుమానానికి నీకు చెమటలు పట్టేస్తున్నాయి అలాంటిది నిజంగా వస్తే నీ పరిస్థితి ఏంటి. ఇది ఈరోజు నిజం కాకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు నిజం అవుతుంది. అను, ఆర్య సార్ లు ఎప్పుడూ కలిసే ఉంటారు అంటుంది అంజలి. చచ్చినా అలా జరగనివ్వను అంటూ ఛాలెంజ్ చేస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మాన్సీ.
 

58

మరోవైపు ఆర్య కాలి కింద పడిన కుంకుమని ఇంటికి తెచ్చుకొని బొట్టు పెట్టుకుంటుంది అను. మేము మీకు దూరం అవుతున్న కొద్దీ మీరు మాకు దగ్గరవుతున్నారు. అయినా మీరు నాకు దూరంగా ఉండటం ఏంటి సార్.. నుదుటిమీద ఈ బొట్టు రూపంలో గుండెల మీద ఈ తాళి రూపంలో నా దగ్గరే ఉన్నారు అనుకుంటూ పిల్లల దగ్గరికి వస్తుంది అను. తండ్రి ప్రేమ లేదని బాధపడకండి. తల్లిలోనే తండ్రి దాగి ఉన్నాడు అని పిల్లలకి చెప్తుంది అను.
 

68

పాపని ఎత్తుకొని నువ్వు ఎంత అదృష్టవంతురాలివి నీ తండ్రి నిన్ను ఎత్తుకొని ముద్దు చేశాడు. పరాయి పాప అయినప్పటికీ అంతా ఆప్యాయత చూపించారు. అదే కన్నబిడ్డ అని తెలిస్తే ఇంకెంత ఆప్యాయత చూపించేవారో. అలాంటి తండ్రి ప్రేమని దూరం చేసినందుకు నన్ను క్షమిస్తారు కదూ అంటూ పిల్లలిద్దరికీ క్షమాపణ చెప్తుంది అను. అదే సమయంలో ఆర్య కూడా భార్య, పిల్లల్ని తలుచుకొని బాధపడతాడు.
 

78

అసలు నన్ను వదిలి ఎందుకు వెళ్లిపోయావు. నిన్ను వదిలి నేను ఉండగలననే అనుకున్నావా అనుకుంటూ కుమిలిపోతాడు. ఇంతలో జెండే ఫోన్ చేసి కమిషనర్ తో మాట్లాడాను దర్యాప్తుని మరింత వేగవంతం చేస్తానన్నారు. తొందరలోనే అను మన దగ్గరికి వస్తుంది.. ధైర్యంగా ఉండు అని చెప్తాడు. అను పిల్లలు ఈ రోజు కాకపోతే రేపైనా నా దగ్గరికి వస్తారు. ఆ విషయం నాకు తెలుసు. కానీ ఎందుకు వెళ్లిపోయారో అర్థం కావడం లేదు.
 

88

తనకి ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పాలి కదా నాకు వాళ్లని చూడాలనిపిస్తుంది అంటూ కన్నీరు పెట్టుకుంటాడు ఆర్య. నీ బాధ నాకు అర్థమవుతుంది ఆర్య కానీ బలమైన కారణం లేకుండా అను ఇలా చేయదు. నీ ప్రేమ నీ భార్యాబిడ్డలకి శ్రీరామరక్ష. వాళ్లు ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటారు అంటాడు జెండే. వాళ్లు క్షేమంగానే ఉంటారు జెండే కానీ నాతో ఉండరు కదా అంటూ బాగా ఏడుస్తాడు ఆర్య. తరువాయి భాగంలో ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Recommended image2
Dhurandhar 2 Trailer: ఆ ఒక్క కారణంతో 'ధురంధర్ 2' ట్రైలర్ వాయిదా.. అసలు విషయం ఇదే!
Recommended image3
Ustaad Bhagat Singh: మొన్న పుష్ప 2, నేడు ఉస్తాద్.. పాపం దేవిశ్రీ ప్రసాద్ బీజీయం పంచాయతీ ఏంటి..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved