- Home
- Entertainment
- ఇష్టంలేని వ్యక్తులతో ఆ పని చేశా, నరకం.. క్యారవాన్ లోకి వెళ్లి ఏడ్చా, అంజలికి చేదు అనుభవం
ఇష్టంలేని వ్యక్తులతో ఆ పని చేశా, నరకం.. క్యారవాన్ లోకి వెళ్లి ఏడ్చా, అంజలికి చేదు అనుభవం
తెలుగు బ్యూటీ అంజలి గురించి పరిచయం అవసరం లేదు. జర్నీ చిత్రంతో తెలుగు తమిళ భాషల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

తెలుగు బ్యూటీ అంజలి గురించి పరిచయం అవసరం లేదు. జర్నీ చిత్రంతో తెలుగు తమిళ భాషల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, బలుపు, మసాలా లాంటి చిత్రాలు అంజలి ఇమేజ్ పెంచాయి. గత ఏడాది పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో అంజలి కీలక పాత్రలో నటించింది. అంజలి చివరగా నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రంలో మెరిసింది. రారా రెడ్డి అంటూ ఐటెం సాంగ్ లో చిందేసింది.
అంజలి హీరోయిన్ గా రాణించింది. ఐటెం సాంగ్స్ కూడా చేసింది. కానీ ఎప్పుడూ లిమిట్స్ దాటి అందాలు ఆరబోయడం చేయలేదు. నటనకు ప్రాధ్యానత ఉన్న పత్రాలు చేస్తూనే గ్లామర్ రోల్స్ వస్తే చేస్తోంది. అయితే తాజాగా ఇంటర్వ్యూలో అంజలి సంచలన విషయం రివీల్ చేసింది.
తన కెరీర్ లో ఎంత కష్టమైన పాత్రలు చేయడానికైనా సిద్దమే అని తెలిపింది. కానీ ఇష్టం లేని వ్యక్తులతో ఇంటిమేట్ సన్నివేశాల్లో, ముద్దు సీన్స్ లోనటించాలంటే నరకం లాగా అనిపిస్తుంది అని అంజలి పేర్కొంది. అలాంటి సందర్భాలు ఎదురయ్యాయి. ఇష్టం లేని వ్యక్తులతో ముద్దు సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది.
శృంగార సన్నివేశాల్లో కూడా నటించా. ఆ తర్వాత క్యారవాన్ లోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చినట్లు అంజలి ఎమోషనల్ అయింది. సీన్ పండించాలంటే తప్పనిసరిగా ముద్దు పెట్టుకోవాల్సిందే. మనసుకి ఇష్టం లేకున్నా ఆ పని చేయాలంటే భరించలేని వేదన కలుగుతుంది అని అంజలి పేర్కొంది.
ఇదిలా ఉండగా అంజలి తన వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలిచింది. జర్నీ ఫేమ్ హీరో జైతో అంజలి కొంతకాలం ప్రేమాయణం సాగించింది. ఆ తర్వాత వీరిద్దరూ విభేదాలతో విడిపోయారు.
ప్రస్తుతం అంజలి శంకర్, రాంచరణ్ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రాంచరణ్ పాత్రకి అంజలి భార్యగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోసారి అంజలి తన నటనా ప్రతిభతో ఈ చిత్రంలో ఆకట్టుకోబోతోంది.