- Home
- Entertainment
- Prema Entha Madhuram: అంజలితో కన్నీరు పెట్టించిన మాన్సీ.. ఆ ఫోన్ రావడంతో టెన్షన్ పడుతున్న శారదమ్మ?
Prema Entha Madhuram: అంజలితో కన్నీరు పెట్టించిన మాన్సీ.. ఆ ఫోన్ రావడంతో టెన్షన్ పడుతున్న శారదమ్మ?
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని టాప్ సీరియల్ గా స్థానం సంపాదించుకుంది. ఇంట్లోంచి వెళ్లిపోయిన కోడలి గురించి ఆమె తల్లిదండ్రులకి ఏమని చెప్పాలో తెలియక సతమతమవుతున్న ఒక అత్తగారి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 2 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో అను పిల్లలు క్షేమంగానే ఉంటారు జెండే కానీ నాతో ఉండరు కదా అని ఏడుస్తూ ఫోన్ పెట్టేస్తాడు ఆర్య. ఆ మాటలకి జెండే కూడా బాగా ఎమోషనల్ అవుతాడు. మరోవైపు హాల్లో కూర్చున్న అంజలి దగ్గరికి వచ్చి డిన్నర్ ఏం ప్రిపేర్ చేయమంటారు అని అడుగుతాడు పనివాడు. చపాతి, కర్రీ చేయు ఆర్యసర్ కి మాత్రం సలాడ్ చేయు అని చెప్తుంది అంజలి.
సరే అంటూ వెళ్ళిపోబోతాడు పనివాడు. అంతలోనే ఇంటికి వచ్చిన మాన్సీ ఎవరిని ఏమడుగుతున్నావు. అయితే పెద్దమ్మ గారిని అడగాలి లేకపోతే నన్ను అడగాలి అంతేగాని ఇంటికి ఏ సంబంధం లేని తనని అడగడం ఏంటి అంటూ కోప్పడుతుంది. అంజలి మేడం కూడా నీరజ్ సర్ భార్యే కదా అంటాడు పనివాడు. వాడి చెంప పగలగొడుతుంది మాన్సీ. ఏం చేస్తున్నావ్ నీకేమైనా కోపం ఉంటే అది నా మీద చూపించు వాడి మీద ఎందుకు అంటూ గట్టిగా మాట్లాడుతుంది అంజలి.
ఆ గొడవకి శారదమ్మ, నీరజ్ బయటకు వస్తారు. కాస్త మర్యాదగా మాట్లాడు అంటుంది అంజలి. ఈ ఇంట్లో ఎవరు మర్యాదగా మాట్లాడుతున్నారు. సంసారాలు కూల్చేవాళ్ళు కూడా మర్యాదల గురించి మాట్లాడుతున్నారు అంటుంది మాన్సీ. ఆ మాటలకి కన్నీరు పెట్టుకుంటుంది అంజలి. అంతలోనే సడన్ గా వచ్చిన మదన్ నీకు ఈ ఇంట్లో చాలా గౌరవం ఇస్తున్నట్లుగా ఉన్నారు అంటూ వెటకారంగా మాట్లాడుతాడు. నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను నా కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడొద్దు వర్ధన్ ఇంటి కోడలిని కావడమే నాకు కోట్ల ఆస్తి అంటుంది అంజలి.
ఆ మాటలకి నీ కర్మ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మదన్. వర్ధన్ ఇంటి కోడలు అవడం అదృష్టం అవునో కాదో తెలియదు కానీ నువ్వు మా జీవితాల్లోకి రావడం మాత్రం మా అదృష్టం అంటారు నీరజ్, శారదమ్మ. మరోవైపు పిల్లల్ని ఆడిస్తున్న అను దగ్గరికి వచ్చి కూరగాయలు అమ్ముకొని వస్తాను నువ్వు పిల్లలు జాగ్రత్త అని చెప్తుంది బామ్మ. నువ్వు ఎందుకు బామ్మ నేను వెళ్లి వస్తాను. నేను లేనప్పుడు ఎలాగో కష్టపడ్డావు.
ఇప్పుడు నేను వచ్చాను కదా నిన్ను పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అంటుంది అను. నీకు ఎందుకమ్మా ఈ గొడ్డు చాకిరి అయినా ఏ సంబంధమూ లేని నాకోసం ఎంత ఆలోచిస్తున్నావు అంటూ ఆనందపడుతుంది బామ్మ. అదేంటి బామ్మా నేనెవరో తెలియకపోయినా నాకు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నావు నన్ను కూడా నీకు సాయం చేయనీ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళబోతుంది అను. అప్పటికీ నువ్వు వెళ్తే నీ కొడుకు ఉండడమ్మా అని బామ్మ చెప్తూనే ఉంటుంది.
ఆమె అన్నట్లుగానే అను ముందుకు వెళ్లేసరికి బాబు ఏడుస్తాడు. అను ఎత్తుకోగానే ఏడుపాపేస్తాడు. బామ్మ వీడు నాటకాల రాయుడు అని నవ్వుతుంది. కొడుకుని తీసుకొని కూరగాయలు అమ్మటానికి వెళ్తుంది అను. మరోవైపు సుబ్బు దంపతులు శారదమ్మకి ఫోన్ చేసి మేము యాత్రలన్నీ చేసి వచ్చేసరికి ఈ సమయం అయింది.బుజ్జమ్మ ఎలా ఉంది తనకి డెలివరీ అయిందా అంటూ వివరాలు కనుక్కుంటారు. తను బాగానే ఉంది కవల పిల్లలు పుట్టారు అని చెప్తుంది శారదమ్మ.
బుజ్జమ్మ కి ఫోన్ ఇవ్వండి అంటాడు సుబ్బు. తను హాస్పిటల్ లో ఉంది డిశ్చార్జ్ చేయి ఇంటికి వచ్చాక ఫోన్ మాట్లాడుస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. టెన్షన్ పడుతూ ఆర్య ని పిలిచి విషయం చెప్తుంది. కంగారు పడకమ్మా వాళ్ళు వచ్చేలోప ఎలాగైనా అను వాళ్ళని కనిపెడతాను అని తల్లికి ధైర్యం చెప్తాడు ఆర్య. మరోవైపు పటాన్చెరు పరిసర ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్ కి అన్నిటికీ అను ఫోటో ఇచ్చి తను వస్తే మనకి కాల్ చేయమని మన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి.
పిల్లలకి వాక్సినేషన్ వేయడం కోసం తను కచ్చితంగా హాస్పిటల్స్ కి వస్తుంది అని జెండేకి, నీరజ్ కి చెప్తాడు ఆర్య. నీరజ్, జెండే ఆర్య చెప్పినట్లే ప్రతి హాస్పిటల్ కి వెళ్లి అను ఫోటో చూపించి తను కనిపిస్తే ఇన్ఫార్మ్ చేయమని ఫోన్ నెంబర్ ఇచ్చి వస్తారు. ఆ తర్వాత ముగ్గురు కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడుకుంటూ అప్డేట్స్ ఇచ్చుకుంటారు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.