MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒక్క మూవీతో ఆస్తులన్నీ పోగొట్టుకున్న తెలుగు స్టార్ హీరోయిన్, కాపాడిన తమిళ హీరో ఎవరో తెలుసా?

ఒక్క మూవీతో ఆస్తులన్నీ పోగొట్టుకున్న తెలుగు స్టార్ హీరోయిన్, కాపాడిన తమిళ హీరో ఎవరో తెలుసా?

తెలుగు సినీమా చరిత్రలో తిరుగులేని తారగా వెలుగు వెలిగిన హీరోయిన్ అంజలీదేవి. తొలితరం హీరోయిన్ గా రికార్డ్ సాధించిన ఆ నటి.. ఒకే ఒక్క సినిమాతో ఆస్తులు ఎలా పొగొట్టుకుందో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 10 2025, 04:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Asianet News

తెలుగు సినిమా చరిత్రలో తొలి తరం హీరోయిన్ గా గుర్తింపు పొందిన వారిలో అంజలీదేవి ఒకరు. 1940లలో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె, అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. చిన్ననాటి నుంచే నాటక ప్రదర్శనలలో పాల్గొన్న అంజలీదేవి, ఆ అనుభవంతోనే మద్రాస్‌కు చేరుకుని సినిమా రంగంలో అడుగుపెట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : Asianet News

ఆమెకు తొలి గుర్తింపు తెచ్చిన చిత్రం ‘గొల్లభామ’. అనంతరం వచ్చిన ‘కీలుగుర్రం’ సినిమా కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అంజలీదేవి అప్పటి టాప్ హీరోలందరితో కలిసి నటించడంతో పాటు, తన అభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఆమె భర్త, ప్రసిద్ధ సంగీత దర్శకుడు పి. ఆదినారాయణరావుతో కలిసి కొన్ని సినిమాలు కూడా నిర్మించింది అంజలీదేవి. అయితే ఓ సినిమా వల్ల ఆమె ఆస్తులన్నీకోల్పోయిందని మీకు తెలుసా? ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ దర్శకుడు ఇంటర్వ్యూలో వెల్లడించారు.

35
Image Credit : Asianet News

రీసెంట్ గా ప్రముఖ దర్శకుడు నందం హరిశ్చంద్రరావు ‘ట్రీ మీడియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంజలీదేవి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని వెల్లడించారు. నందం హరిశ్చంద్రరావు మాట్లాడుతూ: ‘‘హిందీలో వారు నిర్మించిన సినిమా 'ఫూలోమ్ కి శేజ్' (Phoolon Ki Sej) అనుకోని విధంగా భారీ బడ్జెట్‌ను దాటి పోయింది. 

ఈ సినిమా విడుదలైన తర్వాత ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ఆర్థికంగా తీరని నష్టాలను ఎదుర్కొన్నారు. ఈ నష్టాలను భరించేందుకు వారు అప్పటి వరకు కూడబెట్టిన ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది’’ అని చెప్పారు.

అయితే ఈ పరిస్థితుల్లోనూ అంజలీదేవి కుంగిపోకుండా, తన భర్తతో కలిసి మరోసారి సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అందులో భాగంగా రూపొందించిన ‘సతీ సక్కుబాయి’, ‘భక్త తుకారాం’ చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. ప్రత్యేకించి ‘భక్త తుకారాం’ సినిమాలో తమిళ సినీ లెజెండ్ శివాజీ గణేశన్ ప్రధాన పాత్ర పోషించారు.

45
Image Credit : our own

అంజలీదేవి ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారని తెలుసుకున్న శివాజీ గణేశన్ ఈ సినిమాలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించారు. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. మంచి ఆలోచనతో శివాజీ గణేషన్ చేసిన త్యాగం అంజలీదేవి కుటుంబాన్ని మళ్లీ నిలదొక్కుకునే స్థాయికి తీసుకువచ్చింది’’ అని నందం తెలిపారు.

55
Image Credit : Asianet News

ఈ సంఘటనలు అంజలీదేవి జీవితంలో ఎంతటి ధైర్యం, పట్టుదల ఉన్నాయో తెలియజేస్తున్నాయి. ఆమె కథ సినీ రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఒక ప్రేరణగా నిలుస్తుంది. ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, పదేళ్లకు పైగా స్టార్ హీరోయిన్ గా నిలిచిన అంజలీదేవి నిజమైన లెజెండ్.

అంతే కాదు హీరోయిన్ గా కెరీర్ ముగిసిన తరువాత తాను జంటగా నటించిన హీరోలకు తల్లి పాత్రలు కూడా చేశారు అంజలీదేవి. ఆతరువాత తరం హీరోలకు బామ్మ పాత్రల్లో కూడా నటించారు సీనియర్ నటీమణి. తొలితరం హీరోయిన్ గా ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అంజలీదేవి ఎంతో మంది తారలకు మార్గదర్శకంగా నిలిచారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ ను మరోసారి టార్గెట్ చేసిన టీమ్, ఇచ్చిపడేసిన నాగార్జున, అసలేం జరుగుతోంది
Recommended image2
Charan Eliminate: బిగ్ బాస్‌ తెలుగు 10 ఐదో వారం డబుల్‌ ఎలిమినేషన్‌.. చరణ్‌ ఎలిమినేట్‌
Recommended image3
Vijay Deverakonda: పాన్‌ ఇండియా స్టార్స్ కి విజయ్‌ దేవరకొండ బిగ్‌ షాక్‌.. సంచలన స్టేట్‌మెంట్‌
Related Stories
Recommended image1
అరుదైన వ్యాధితో బాధపడుతున్న టాలీవుడ్ యంగ్ హీరో, ఎంత ఇబ్బంది పడుతున్నాడో తెలుసా?
Recommended image2
పూజా హెగ్డేకు పెద్ద షాక్ , కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ కు ఎదురుదెబ్బ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved