- Home
- Entertainment
- Prema Entha Madhuram: నడిరోడ్డు మీద ఆర్యని నిలదీసిన అంజలి.. అవార్డు కోసం చీటింగ్ చేస్తున్న మాన్సీ!
Prema Entha Madhuram: నడిరోడ్డు మీద ఆర్యని నిలదీసిన అంజలి.. అవార్డు కోసం చీటింగ్ చేస్తున్న మాన్సీ!
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ఎంతో ఇంట్రెస్టింగ్ తో మంచి ఎంటర్టైన్మెంట్ ని ఇస్తుంది. కుటుంబ గౌరవం కోసం, తమ్ముడి భవిష్యత్తు కోసం ఇల్లు వదిలి వచ్చేసిన ఒక అన్న కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 12 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో ఆర్యతో పాటు వాక్ చేస్తూ ఉంటుంది అంజలి. మీరు సిట్యుయేషన్ ని స్మూత్ గా ఎలాగ హ్యాండిల్ చేస్తారు అని ఆర్యని అడుగుతుంది. అవతలివారు ఏదో అన్నారని కాకుండా పరిస్థితులను బట్టి ప్రవర్తిస్తే ఎలాంటి కాంప్లికేషన్ అయినా స్మూత్ గా హ్యాండిల్ చేయొచ్చు అంటాడు ఆర్య. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ల ఎదురుగా మినిస్ట్రర్ క్యారవాన్ ఆగుతుంది. కారు ఆపిన మినిస్టర్ తన స్టాఫ్ ని పంపించి ఆర్యని తన దగ్గరికి పిలిపిస్తాడు. అంజలిని అక్కడే వదిలిపెట్టి ఆర్య వాళ్ళతో వెళ్తాడు.
మీరు ఇక్కడున్నారేంటి ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అబ్రాడ్ వెళ్లిపోయారని విన్నాను అంటాడు మినిస్టర్. ఇప్పుడు ఏమి అడగకండి సర్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను అంతే అంటాడు ఆర్య. సరే నేను మిమ్మల్ని ఏమీ అడగను కానీ మీకు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి అంటాడు మినిస్టర్. నేను డ్రాప్ చేస్తాను రండి అని మినిస్టర్ అంటే లేదు సార్ నేను ఆ మేడం దగ్గర వర్క్ చేస్తున్నాను ఆవిడ నా కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్తాడు ఆర్య. వేల మందికి జాబులు ఇచ్చే మీరు వేరొకరి దగ్గర జాబ్ చేస్తున్నారు అంటూ బాధపడతాడు మినిస్టర్.
వాళ్లు వెళ్లిపోయిన తర్వాత తిరిగి అంజలి దగ్గరికి వస్తాడు ఆర్య. నేను చూస్తున్నది నిజమేనా ఒక మినిస్టర్ వచ్చి నిన్ను పలకరించడమేంటి అంటుంది అంజలి. ఒక గవర్నమెంట్ ప్రాజెక్టులో వర్క్ చేశాను అప్పుడు ఆయన పరిచయం అంటాడు ఆర్య. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు నిజం చెప్పండి అంటుంది అంజలి. అలాంటిదేమీ లేదు మీరు వెళ్ళండి మేడం అని అంజలి ని పంపించేస్తాడు ఆర్య. మరోవైపు బిజినెస్ అవార్డు ఎలా అయినా తనకే రావాలి అని కమిటీ మెంబర్ తో 50 లక్షల కి బేరం కుదుర్చుకుంటుంది మాన్సీ. తర్వాత తనకి అంత చెక్ పవర్ లేదని గుర్తొచ్చి వేరే కంపెనీ దగ్గర అడ్వాన్స్ తీసుకోవడానికి డిసైడ్ అవుతుంది.
మరోవైపు అదే అవార్డు ఫంక్షన్ కి రెడీ అవుతుంది అంజలి. అనుని కూడా తనతో రమ్మంటుంది. అను వద్దు అని చెప్తే నా సక్సెస్ ని నువ్వు కూడా షేర్ చేసుకోవాలి అంటూ ఆమెని ఒప్పిస్తుంది. అంతలో ఆర్య వచ్చి నన్ను ఎందుకు మేడం రమ్మన్నారు అని అడుగుతాడు. బిజినెస్ అవార్డు ఫంక్షన్ కి నన్ను కూడా ఇన్వైట్ చేశారు అవార్డు వస్తుందో రాదో తెలియదు కానీ అక్కడ వరకు వెళ్ళటమే పెద్ద అచీవ్మెంట్ అందుకే నువ్వు కూడా రావాలి అంటుంది అంజలి. ముందు ఆర్య ఒప్పుకోడు కానీ ఏదో పనిమీద అంజలి బయటకు వెళ్తుంది అప్పుడు అను, ఆర్య ని ఫంక్షన్ కి వెళ్లడానికి ఒప్పిస్తుంది.
ఆర్య ఓకే చెప్పడం విన్న అంజలి మా అప్పులో ఏదో మ్యాజిక్ ఉంది ఎవరినైనా ఒప్పిస్తుంది అంటుంది. ఆర్య కోసం మంచి సూట్ వేసుకోమని ఇస్తుంది. ఇంతలో మదన్ ఫోన్ చేయడంతో నేను ఆవార్డ్ ఫంక్షన్ కి వెళ్తున్నాను నువ్వు కూడా రా అంటుంది. కుదరదు నాకు మీటింగ్ ఉంది అంటాడు మదన్. ఫోన్ పెట్టేసిన తర్వాత పక్కవాడు మనం అక్కడికే కదా వెళ్తున్నాము ఎందుకు అబద్ధం చెప్పావు అని అడుగుతాడు. నిజమే కానీ ముందే చెప్పేస్తే సర్ప్రైజ్ ఉండదు కదా అంటాడు మదన్. మరోవైపు జ్యూరీ మెంబర్ తో మాట్లాడి అవార్డు కన్ఫర్మ్ ఏ కదా అని అడుగుతుంది మాన్సీ. కచ్చితంగా మీదే మేడం అందులో ఏ డౌట్ లేదు అని చెప్తాడు కమిటీ మెంబర్.
మరోవైపు సూట్ వేసుకొని వచ్చిన ఆర్య ని సూపర్ గా ఉన్నారు అని మెచ్చుకుంటుంది అంజలి. నీరజ్ తల్లి దగ్గర ఆశీర్వచనం తీసుకోవడం చూసిన మాన్సీ ఎందుకు బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నావు అని అడుగుతుంది. బిజినెస్ అవార్డుకి నన్ను ఇన్వైట్ చేశారు అంటాడు నీరజ్. ఇన్వైట్ చేస్తేనే ఇంత ఆనంద పడిపోతున్నాడు ఆ అవార్డు నాకు వస్తుందని తెలిస్తే ఇంకెంత ఆనంద పడిపోతాడో అంటూ తను కూడా శారదమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. మీరెందుకు బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు అని జెండే అడిగితే నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది మీ చిన్న కోడలు చిన్న కొడుకు అచీవ్మెంట్ ని కళ్ళారా చూద్దురుగాని పదండి అంటుంది మాన్సీ.
శారదమ్మతో సహా అందరూ ఫంక్షన్ కి వెళ్తారు. మరోవైపు ఫంక్షన్ కి వచ్చిన ఆర్యతో మీలో రాయల్టీ లుక్ కనిపిస్తుంది మీరు ఖచ్చితంగా పూర్వ జన్మలో మహారాజు అయి ఉంటారు అంటుంది మా అంజలి. నిజమే మేడం మారువేషంలో ఉన్న మహారాజు అనుకుంటుంది అను.
తనని ఎవరు గుర్తుపట్టకూడదని మాస్క్ వేసుకుంటుంటే ఇంత అందమైన మొహాన్ని ఎందుకు మాస్క్ వేసుకొని కవర్ చేసుకుంటున్నారు అంటుంది అంజలి.మీకు తెలుసు కదా మేడం నేను మాస్క్ లేకుండా ఎక్కడికి రాను అని అంటాడు ఆర్య. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.