- Home
- Entertainment
- అనిరుధ్‌కి ఇంకా ఎందుకు పెళ్లి కాలేదు, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యారేజ్ పై అతని మదర్ కామెంట్స్?
అనిరుధ్‌కి ఇంకా ఎందుకు పెళ్లి కాలేదు, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యారేజ్ పై అతని మదర్ కామెంట్స్?
సౌత్ స్టార్ మ్యుజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఇంకా ఎందుకు పెళ్ళి చేసుకోలేదు. పెళ్లి గురించి అనిరుధ్ తల్లి ఏమన్నారు.

అనిరుధ్ కోలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయనకింకా పెళ్లి కాలేదు. అనిరుధ్ పెళ్లి గురించి వాళ్ళ అమ్మ లక్ష్మి రవిచంద్రన్ మనసు విప్పి మాట్లాడారు. ఇంతకీ ఆమె ఏమననారంటే?
Also Read: 300 కోట్ల హీరోయిన్, ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు బ్యూటీ ఎవరో తెలుసా?
అనిరుధ్
3 సినిమాతో పరిచయమైన అనిరుధ్, ఇప్పుడు ఎన్టీఆర్, పవన్, విజయ్, రజిని, కమల్ లాంటి టాప్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్నాడు. తను టచ్ చేస్తే హిట్టే. అందుకే ఎక్కువ రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేస్తున్నాడట అనిరుధ్. ఇప్పుడు అనిరుధ్ చేతిలో విజయ్ 'జననాయకన్', రజినీకాంత్ 'కూలీ', కమల్ 'ఇండియన్ 3' ఉన్నాయి. ఇది కాకుండా తెలుగు, హిందీ సినిమాల్లో కూడా పనిచేస్తున్నాడు.
అనిరుధ్ రవిచందర్
ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కి 34 ఏళ్లు. ఇంత వయసొచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉంటున్నాడు. ఇది వరకే హీరోయిన్ ఆండ్రియాతో ప్రేమలో పడి, ఆ తర్వాత బ్రేకప్ అయింది.
ఆ తర్వాత ఏ రూమర్స్‌లోనూ లేడు. పెళ్లిని మాత్రం పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాడు. ఒక కార్యక్రమంలో అనిరుధ్ వాళ్ళ అమ్మ లక్ష్మి రవిచంద్రన్ తన కొడుకు పెళ్లి గురించి మాట్లాడారు.
Also Read: రామ్ చరణ్ దగ్గర అప్పు చేసిన పవన్ కళ్యాణ్, ఎంత తీసుకున్నాడంటే?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్
ఆమె ఏమన్నారంటే: “అనిరుధ్ పెళ్లి దేవుడి దయ వల్ల ఎంత తొందరగా జరిగితే అంత మంచిది. అతని మనసుని అర్థం చేసుకునే అమ్మాయి, అతని టైమింగ్‌ని అర్థం చేసుకునే అమ్మాయి కావాలి. క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉండేవాళ్లకి మనశ్శాంతి చాలా ముఖ్యం. చెప్పాలంటే నేను ఇప్పటికీ వాడిని చిన్నపిల్లాడిలా చూసుకుంటాను.
Also Read: అడుగు పెడితే 1000 కోట్లు, 500 కోట్లకు తగ్గేదే లేదు, హీరోలకు సెంటిమెంట్ గా మారిన లక్కీ హీరోయిన్ ఎవరు?
అనిరుధ్ మ్యారేజ్
వాడి మనసు బాధపడేలా ఏమీ చెప్పను. అనిరుధ్ స్టూడియోని నేనే చూసుకుంటాను. వాడి షెడ్యూల్‌ని చూసుకుంటాను. వాడితో పనిచేసినా ఒక లైన్ క్రాస్ చేయకూడదని అనుకుంటాను. వాడికి తొందరగా ఒక అమ్మాయి దొరకాలి” అని అనిరుధ్ వాళ్ళ అమ్మ ఆ కార్యక్రమంలో మాట్లాడారు. ఇది చూసిన నెటిజన్లు అనిరుధ్‌కి ఇంకా అమ్మాయి దొరకలేదా అని ఆశ్చర్యంగా అడుగుతున్నారు.
Also Read: ఆ పాట ఎందుకు పాడానో అని బాధపడుతున్నా, శ్రేయా ఘోషల్ సంచలన వ్యాఖ్యలు