తన డ్రీమ్ రోల్ చెప్పి షాకిచ్చిన నరేష్.. పద్మ అవార్డు కోసం పోరాడతా అంటూ కామెంట్స్
సీనియర్ నటుడు నరేష్ జనవరి 20న తన 65వ జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో తన కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నరేష్ మీడియా ముందుకు వస్తే సంచలన వ్యాఖ్యలు తప్పనిసరిగా ఉంటాయి.

సీనియర్ నటుడు నరేష్ జనవరి 20న తన 65వ జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో తన కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నరేష్ మీడియా ముందుకు వస్తే సంచలన వ్యాఖ్యలు తప్పనిసరిగా ఉంటాయి. కొన్ని నెలల క్రితం నరేష్, పవిత్ర లోకేష్ వివాహం గురించి మీడియాలో ఎంతలా చర్చ జరిగిందో చూశాం.
నరేష్ తన మూడో భార్య రమ్య నుంచి విడిపోయి పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకున్నారు. నరేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 52 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటానని నరేష్ తెలిపారు. ఇప్పటి వరకు చాలా పాత్రలు చేశానని కానీ తనకి ఒక డ్రీమ్ రోల్ ఉందని నరేష్ అన్నారు. నరేష్ డ్రీం రోల్ ఏంటో తెలిస్తే షాక్ కావలసిందే.
తనకి నపుంసకుడి పాత్రలో నటించాలని ఉన్నట్లు పేర్కొన్నారు. నటుడిగా ఎలాంటి ఛాలెంజ్ అయినా తీసుకుంటాను. నపుంసకుడిగా పాత్ర వస్తే తప్పకుండా చేస్తా అని నరేష్ తెలిపారు. ఇక తన ఏజ్ గురించి నరేష్ సరదాగా మాట్లాడారు. నా వయసు గూగుల్ లో తప్పుగా చూపిస్తున్నారు. వాస్తవానికి అంత వయసు నాకు లేదు. నా మైండ్ లో నా ఏజ్ 23 సంవత్సరాలే అని నరేష్ తెలిపారు.
పద్మ అవార్డుల గురించి కూడా నరేష్ ఆసక్తికర వ్యాఖలు చేశారు. తన తల్లి విజయ నిర్మల గారు బతికున్నప్పుడు ఆమెకి పద్మ అవార్డు కోసం ఢిల్లీ వరకు వెళ్లి ప్రయత్నించా. కానీ కుదర్లేదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పద్మ అవార్డు కోసం విజయ నిర్మల గారి పేరు సిఫార్సు చేశారు. కానీ అప్పుడు పద్మ అవార్డు దక్కలేదు. నేను ఏ ప్రభుత్వాన్ని విమర్శించను. కనీసం మరణానంతరం అయినా అమ్మకి పద్మ అవార్డు దక్కేలా పోరాటం చేస్తా అని నరేష్ పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశానికి నరేష్, పవిత్ర జంటగా వచ్చారు.