MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అఖండ 3 కి రంగం సిద్ధం, బాలయ్య ,బోయపాటి కాంబినేషన్ లో ఐదో సినిమా ఎప్పుడో తెలుసా?

అఖండ 3 కి రంగం సిద్ధం, బాలయ్య ,బోయపాటి కాంబినేషన్ లో ఐదో సినిమా ఎప్పుడో తెలుసా?

Akhanda 3 Ready : బోయపాటితో బాలకృష్ణ సినిమా అంటే.. అభిమానులకు పండగే.. నందమూరి డైహార్ట్ ప్యాన్స్ అయితే పూనకాలతో ఊగిపోతుంటారు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో..నాలుగు సినిమాలు రిలీజ్ అవ్వగా.. ఐదో సినిమా కోసం రంగం సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 18 2025, 11:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబోకి డిమాండ్
Image Credit : Asianet News

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబోకి డిమాండ్

బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ అంటేనే అభిమానులతో పాటు సినిమా లవర్స్ కు పండగే. వీరిద్దరి కలయికలో హిట్ సినిమాలే కానీ.. ఒక్క ప్లాప్ కూడా లేదు. బోయపాటి తో సినిమా చేయాలంటే అది బాలయ్యకు మాత్రమే సాధ్యం, ఎన్టీఆర్, రామ్ చరణ్, రామ్ లాంటి హీరోలకు భారీ డిజాస్టరస్ ను ఇచ్చిన బోయపాటి... బాలయ్యకు మాత్రం బ్లాక్ బస్టర్స్ అందిస్తూ వస్తున్నాడు. వీకి కాంబో ఆ రేంజ్ లో వర్కౌట్ అవుతుంది. ఈక్రమంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నాలుగు సినిమాలు మంచి విజయాలు సాధించాయి. తాజాగా విడుదలైన అఖండ 2 కూడా ఈ కాంబినేషన్‌లో మరో హిట్‌గా నిలిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సినిమా?
Image Credit : Asianet News

భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సినిమా?

అఖండ 2 సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. కానీ అనుకున్న తేదీకి సినిమా రాకుండా పోస్ట్ పోన్ అవ్వడంతో.. భారీ ఓపెనింగ్స్ అవ్వాల్సింది.. తగ్గిపోయాయని అంటున్నారు. కానీ అభిమానులు ఈ సినిమాను ఆదరించడంత, కామన్ ఆడియన్స్ కు కూడా అఖండ2 నచ్చడంతో .. బాక్సాఫీస్ దగ్గర నిలబడింది బాలయ్య సినిమా. ఈ క్రమంలోనే ఈసినిమాకు మరో సీక్వెల్ ను తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారట టీమ్. ఈ క్రమంలో అఖండ 2 పై ఈసినిమా దర్శకుడు బోయపాటి కూడా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Related Articles

Related image1
వారణాసి లో మహేష్ బాబు తండ్రి పాత్రను మిస్సైన ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
Related image2
ప్రభాస్ అభిమానుల మధ్య నలిగిపోయిన నిధి అగర్వాల్, రాజాసాబ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం..
35
అఖండ 3పై అభిమానుల్లో ఆసక్తి
Image Credit : youtube/14 reels

అఖండ 3పై అభిమానుల్లో ఆసక్తి

ఇక అఖండ సిరీస్ లు ఇలానే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంపై గతంలోనే పక్కాగా క్లారిటీ ఇచ్చారు దర్శకుడు. అంతే కాదు అఖండ 2 ప్రమోషన్ల సమయంలో, అఖండను ఒక సిరీస్‌లా కొనసాగిస్తూ ఐదు లేదా ఆరు సినిమాలు చేసే అవకాశం ఉందని బాలకృష్ణ, బోయపాటి శ్రీను వెల్లడించారు. అంతేకాదు, అఖండ 2 సినిమా చివర్లో పార్ట్ 3కు సంబంధించిన లీడ్‌ను కూడా చూపించారు. దీంతో అఖండ 3పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.అఖండ 2 సక్సెస్ అనంతరం మీడియాతో మాట్లాడిన దర్శకుడు బోయపాటి శ్రీను, అఖండ 3 గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

45
బొయపాటి శ్రీను మాట్లాడుతూ...
Image Credit : 14 reels plus

బొయపాటి శ్రీను మాట్లాడుతూ...

ఆయన మాట్లాడుతూ, అఖండ సినిమాకు అవెంజర్స్ స్థాయి స్కోప్ ఉందని తెలిపారు. అవెంజర్స్ అనేవి రచయితలు సృష్టించిన సూపర్ హీరోలు కాగా, మన భారత పురాణాల్లో నిజంగానే ఎన్నో సూపర్ హీరోలు ఉన్నారని ఆయన చెప్పారు. మన చరిత్ర నుంచే ఎన్నో కథలను, ఎన్నో శక్తివంతమైన పాత్రలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చని బోయపాటి వివరించారు. అయితే ప్రేక్షకులు చూస్తున్నారు కదా అని వెంటవెంటనే సీక్వెల్స్ తీయడం సరైన పద్ధతి కాదని ఆయన స్పష్టం చేశారు. రెండు మూడు సినిమాల గ్యాప్ తీసుకుని మళ్లీ అఖండ సిరీస్‌ను కొనసాగించాలనే ఆలోచన ఉందన్నారు.

55
కాస్త గ్యాప్ తీసుకున్న తరువాతే?
Image Credit : Asianet News

కాస్త గ్యాప్ తీసుకున్న తరువాతే?

బోయపాటి మాట్లాడుతూ..  తాను మధ్యలో వేరే సినిమాలు పూర్తి చేయాల్సి ఉందని వాటిని కంప్లీట్చేసిన తరువాతే  అఖండ 3 గురించి ఆలోచిస్తానని చెప్పారు. అఖండ 2 క్లైమాక్స్‌లో శంబాలా తలుపులు తెరుచుకోవడాన్ని చూపించామని, అక్కడి నుంచే అఖండ 3 కథ మొదలవుతుందని బోయపాటి తెలిపారు. ఈ వ్యాఖ్యలతో అఖండ 3 సినిమా పక్కాగా ఉంటుందని, బోయపాటి మరో రెండు సినిమాలు చేసిన తర్వాత మళ్లీ బాలకృష్ణతో కలిసి ఈ మూడో భాగాన్ని తెరకెక్కిస్తారని స్పష్టత వచ్చింది. అఖండ సిరీస్‌పై బాలయ్య అభిమానుల్లో  మరింత ఉత్కంఠ పెరిగింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి బాలకృష్ణ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: హేటర్స్‌కు సమంత స్వీట్ కౌంటర్.. మా ఇంటి బంగారంలో సాయి పల్లవి, సీక్రెట్ చెప్పేసింది స్టార్‌ హీరోయిన్‌
Recommended image2
kichcha Sudeep: శివన్నను అడగరెందుకు? నెపోటిజం ప్రశ్నలపై కిచ్చా సుదీప్ ఫైర్
Recommended image3
Pavitra Lokesh: అది పెళ్లి కాదు నరకం.. పవిత్ర లోకేష్‌ మొదటి పెళ్లి గుట్టు విప్పిన తల్లి, తెరవెనుక ఇంత జరిగిందా?
Related Stories
Recommended image1
వారణాసి లో మహేష్ బాబు తండ్రి పాత్రను మిస్సైన ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
Recommended image2
ప్రభాస్ అభిమానుల మధ్య నలిగిపోయిన నిధి అగర్వాల్, రాజాసాబ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved