- Home
- Entertainment
- అనిల్ రావిపూడి కి హీరోగా ఆఫర్ వస్తే.. ఏమన్నాడో తెలుసా? స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
అనిల్ రావిపూడి కి హీరోగా ఆఫర్ వస్తే.. ఏమన్నాడో తెలుసా? స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
టాలీవుడ్ లో హీరో అయ్యే అంత ట్యాలెంట్ ఉండి.. దర్శకులుగా మారిన యంగ్ స్టార్స్ చాలామంది ఉన్నారు. వారిలో అనిల్ రావిపూడి కూడా ఒకరు. హీరోగా సినిమా చేయోచ్చు కదా.. అని అనిల్ రావిపూడితో ఎవరైనా అంటే.. ఆయన ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా?

హీరోల ఇమేజ్ తో డైరెక్టర్లు..
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికి ఎక్కడ సక్సెస్ రాసిపెట్టి ఉంటే అక్కడే అంది లభిస్తుంది. హీరోలు అవ్వాలనుకుని వచ్చిన దర్శకులు అయినవారు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. దర్శకులుగా పనిచేయాలని వచ్చి హీరోలుగా మారిన నానీ, రాజ్ తరుణ్ లాంటివారు కూడా లేకపోలేదు. ఇప్పుడున్న హీరోలలో చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసినవారే. ఇక దర్శకుడిగా సక్సెస్ సాధించిన తర్వాత హీరోగా మారాలనే ఆలోచన ఉన్నవారు కూడా లేకపోలేదు. టాలీవుడ్, కోలీవుడ్ లలో మెగా ఫోన్ వదిలి.. హీరోలుగా మారిన దర్శకులను చూస్తున్నాం. కానీ వారు ఆశించిన ఫలితాలు మాత్రం అందుకోలేకపోయారు. ఈక్రమంలో టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి హీరోగా ఛాన్స్ ఇస్తే.. ఆయన ఏమన్నారో తెలుసా?
హీరో లక్షణాలున్న దర్శకుడు..
స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. చాలాహ్యాండ్సమ్ గా ఉంటాడు. ఆయనకి మంచి కామెడీ టైమింగ్, మాస్ పల్స్ ఉన్నాయని పరిశ్రమలో పేరుంది. సినిమా ఈవెంట్లలో ఆయన వేసే పంచ్ లు.. డాన్స్ స్టెప్పులు చూసి.. ఈయన హీరో మెటీరియల్ అని కామెంట్ చేస్తుంటారు. దర్శకుడిగా ఉంటూనే.. హీరోగా ట్రై చేయొచ్చుకదా అని ఎంతో మంది అభిమానులు, సోషల్ మీడియాలో యూజర్లు అనిల్ రావిపూడిని అడుగుతూ ఉంటారు. అయితే దీనిపై అనిల్ రావిపూడి చాలా మెచ్యూర్డ్‌గా సమాధానం చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్..
హీరోగా సినిమా చేయోచ్చు కదా అని.. అనిల్ రావిపూడిని అడిగితే ఆయన స్పందించిన తీరు.. అందరికి ఆశ్చర్యం కలిగించింది. అనిల్ మాట్లాడుతూ.. '' మనం ఒక క్రాఫ్ట్‌లో టాప్‌లో ఉన్నప్పుడు పక్కదారి పట్టించడానికి ఇలాంటి ప్రలోభాలు వస్తాయి.. వాటికి లొంగితే ఇప్పటికే ఉన్న కెరీర్‌కే ప్రమాదం ఏర్పడుతుంది, అందుకే ఆ ‘ట్రాప్’లో నేను పడను, నాకు హీరోగా మారాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు, డైరెక్షన్‌పైనే పూర్తి దృష్టి కొనసాగిస్తాను'' అని తన సన్నిహితుల దగ్గర కూడా ఆయన స్పష్టంగా తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది.
రాజమౌళి తరువాత అనిల్ రావిపూడిదే రికార్డు..
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత ఫెయిల్యూర్ లేని దర్శకుడిగా అనిల్ రావిపూడికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఆ రికార్డ్‌ను కాపాడుకోవడమే తన ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. అందుకే ఎంత మంది అన్నా సరే.. నటన వైపు వెళ్లి ఫోకస్ తగ్గించుకోవడం తనకు ఇష్టం లేదని, డైరెక్షన్‌లోనే కొనసాగుతానని తెలిపారు.
ప్రస్తుతం అనిల్ రావిపూడి దృష్టంతా మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాపైనే ఉంది. 2026 సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. వెంకటేష్ గెస్ట్ రోల్ లో కనిపించారు. భారీగా నటీనటులు ఉన్న ఈసినిమాపై.. అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.
అనిల్ రావిపూడి సంక్రాంతి సెంటిమెంట్..
ప్రతీ సంక్రాంతికి భారీ హిట్లు కొడుతున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.. సరిలేరు నీకెవ్వరు.. సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలతో.. భారీ సక్సెస్ లను అందుకున్నాడు... ఇక ఈసారి కూడా మెగాస్టార్ చిరంజీవితో.. మన శంకర వర ప్రసాద్ గారు సినిమాతో, సంక్రాంతి సక్సెస్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు. ప్రతీ విషయాన్ని గ్రౌండ్ లెవెల్‌లో ఆలోచించే అలవాటు ఉన్న అనిల్ రావిపూడి.. ముందు ముందు ఇంకెన్ని అద్భుతాలు చేస్తాడో చూడాలి.

