- Home
- Entertainment
- అనసూయ, రష్మి, శ్రీముఖి.. వెండితెరపై సక్సెస్ కాలేకపోతున్న బుల్లితెర భామలు.. మరి దివి ?
అనసూయ, రష్మి, శ్రీముఖి.. వెండితెరపై సక్సెస్ కాలేకపోతున్న బుల్లితెర భామలు.. మరి దివి ?
టీవీ షోస్‌లో విశేషమైన పాపులారిటీని సొంతం చేసుకున్నారు యాంకర్లు అనసూయ, రష్మి, శ్రీముఖి. వీరికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కానీ పెద్ద తెరపై ఆ రేంజ్‌లో సక్సెస్ కాలేకపోయారు.

Anasuya Bharadwaj
యాంకర్ అనసూయ `జబర్దస్త్` షోతో పాపులర్ అయ్యింది. ఇందులో ఈ అమ్మడి అందాలు, హోయలకు ఇంటర్నెట్‌లో లక్షలాది మంది ఫిదా అయ్యారు. ఆమె కోసం దేవదాసుల్లా ఎదురుచూస్తుంటారు. బుల్లితెరపై స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న అనసూయ సిల్వర్ స్క్రీన్‌పై మాత్రం హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోయింది.
`సోగ్గాడే చిన్ని నాయనా` చిత్రంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది అనసూయ. స్పెషల్ రోల్‌లో ఫిదా చేసింది. `క్షణం`,`గాయత్రి`, `రంగస్థలం`, `యాత్ర` చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన మెప్పించింది. కానీ మెయిన్ లీడ్ గా మాత్రం ఆదరణ పొందలేదు. ఆయన లీడ్‌గా చేసిన `కథనం` డిజాస్టర్ అయ్యింది. ఇటీవల చేసిన `థ్యాంక్యూ బ్రదర్` చిత్రం సైతం ఆశించిన రిజల్ట్ ని పొందలేకపోయింది.
అనసూయ మెయిన్ లీడ్‌గా సక్సెస్ కాలేకపోయినా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి ఆదరణ పొందుతుంది. `సోగ్గాడే చిన్ని నాయనా`, `రంగస్థలం`లో ఆమె పాత్రలు బాగా పాపులర్ కావడంతో అనసూయకి మంచి పాత్రలొస్తున్నాయి. మెయిన్ లీడ్‌గా రాణించలేని వెలితిని ఈ రూపంలో తీర్చుకుంటుంది అనసూయ.
అక్క అనసూయ బాటలోనే చెల్లి ఉంది. అనేక టీవీ షోస్‌కి హోస్ట్ గా చేసి అలరించింది. ఇప్పటికీ అలరిస్తుంది యాంకర్ రష్మి. `జబర్దస్త్`తో భారీ పాపులరిటీ సొంతం చేసుకుంది. `యువ`, `సూపర్ కుటుంబం`, `ఢీజోడి` వంటి షోస్ చేసినా రాని పేరు గుర్తింపు `జబర్దస్త్` తీసుకొచ్చింది. బుల్లితెర స్టార్‌గా ఎదిగింది.
కానీ రష్మి మెయిన్ లీడ్‌గా సినిమాల్లో మెప్పించలేకపోతుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పదికిపైగా చిత్రాల్లో నటించి ఆకట్టుకున్న రష్మి మెయిన్ లీడ్‌లో `గుంటూరు టాకీస్` చిత్రంలో నటించింది. ఈ సినిమా సక్సెస్ అయ్యింది. కానీ రష్మికి ఆ రేంజ్‌లో సినిమాలు రాలేదు. వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫల్టీకొట్టాయి. `అంతం`, `అంతకుమించి` చిత్రాలు పరాజయం చెందాయి. ప్రస్తుతం నటిస్తున్న `బొమ్మ బ్లాక్‌బస్టర్` సైతం విడుదలకు నోచుకోవడ లేదు. దీంతో టీవీ యాంకర్‌గా వచ్చిన పేరు నటిగా ఆమెకి రాలేకపోతుంది.
బొద్దుగుమ్మ, బుట్టబొమ్మ, రాములమ్మా ఇవన్నీ శ్రీముఖి నిక్‌నేమ్స్. యాంకర్‌గానే ఆమె టీవీలో బాగా గుర్తింపు తెచ్చుకుంది. బొద్దు అందాలను ఘాటుగా చూపిస్తూ కిక్కెస్తుంది.
శ్రీముఖి గ్లామర్ ఫోటోలు.
`జులాయి`, `లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్`, `ప్రేమ ఇష్క్ కాదల్`, `నేను శైలజ`, `సావిత్రి` చిత్రాల్లో నటించింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పర్వాలేదనిపించుకున్న శ్రీముఖి మెయిన్ లీడ్‌గా మాత్రం ప్రేక్షకాదరణ నోచుకోలేకపోయింది. ఆమె ఇటీవల నటించిన `క్రేజీఅంకుల్స్` చిత్రం మెప్పించలేకపోయింది. దీంతో బుల్లితెర భామలు పెద్ద తెరపై రాణించడం కష్టమనే కామెంట్స్ కి సంకేతాల్సిన్తుంది.
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ యాంకర్ గా ఉన్న సుమ కూడా కెరీర్ బిగినింగ్‌లో మెయిన్‌లీడ్ చేసింది. కానీ ఆ తర్వాత సినిమాల్లో ఆమె సక్సెస్ కాలేకపోయింది. దీంతో టీవీకే పరిమితమైంది.
ఇప్పుడు మరో బుల్లితెర భామ దివి హీరోయిన్ ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల `క్యాబ్ స్టోరీస్` వెబ్ మూవీ చేసింది. మరోవైపు చిరంజీవి మెహర్ రమేష్`భోళా శంకర్` చిత్రంలో కీలక పాత్ర కోసం ఎంపికైంది. మరోవైపు హీరోయినన్‌గానూ ఒకటి రెండు సినిమాలకు కమిట్ అయ్యిందట. ఆయా చిత్రాలకు సంబంధించి ప్రకటనలు రానున్నాయి. మరి బుల్లితెర భామలు వెండితెరపై సక్సెస్ కాలేరనే కామెంట్లకి బ్రేక్ ఇస్తుందా? లేదా? అనేది చూడాలి.