MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Actress Hema: ఆ టైమ్‌లో చనిపోవాలనిపించింది, నటి హేమ సంచలన కామెంట్‌.. అందులో క్లీన్‌ చిట్‌

Actress Hema: ఆ టైమ్‌లో చనిపోవాలనిపించింది, నటి హేమ సంచలన కామెంట్‌.. అందులో క్లీన్‌ చిట్‌

నటి హేమ ఇటీవల సినిమాల్లో కంటే వివాదాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే తనకు మాదక ద్రవ్యాల కేసులో క్లీన్‌ చిట్‌ వచ్చిన నేపథ్యంలో తన ఆవేదన వ్యక్తం చేసింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 30 2026, 05:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వివాదాల్లో నటి హేమ
Image Credit : Asianet News

వివాదాల్లో నటి హేమ

నటి హేమ తెలుగులో అనేక సినిమాలు చేసి మెప్పించింది. తనదైన కామెడీతోనూ మెప్పించింది. ఎక్కువగా బ్రహ్మానందంతో జోడీగా చేసిన అలరించింది. నవ్వులు పూయించింది. ఈ క్రమంలో ఆ మధ్య నటి హేమ మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కుంది. రేవ్‌ పార్టీలో దొరికిపోయినట్టు వార్తలు వచ్చాయి. అప్పట్లో ఇది పెద్ద ఇష్యూ అయ్యింది. మీడియాలో చాలా రోజులు దీనిపై చర్చ నడిచింది. కానీ తాను ఆ రేవ్‌ పార్టీలో లేనని తెలిపింది. ఈ మేరకు వీడియో రిలీజ్‌ చేసింది. కానీ దాన్ని ఎవరూ నమ్మలేదు.

24
నటి హేమకి క్లీన్‌ చిట్‌
Image Credit : Asianet News

నటి హేమకి క్లీన్‌ చిట్‌

ఈ క్రమంలో హేమకి ఈ మాదక ద్రవ్యాల కేసులో ఉపశమనం లభించింది. ఆమెకి క్లీన్‌ చిట్‌ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఆమె మీడియా ముందుకు వచ్చింది. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్‌ సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో నటి హేమ పాల్గొంది. ఈ ఆరోపణల వల్ల తాను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది, దాని వల్ల తన కుటుంబం ఎలా సఫర్‌ అయ్యిందనే విషయాన్ని ఆమె వెల్లడించింది.

Related Articles

Related image1
Hero Change: పవన్‌ కళ్యాణ్‌, ప్రభాస్‌, బాలకృష్ణ, రామ్‌ చరణ్‌ ఇకపై హీరోలు కాదు.. సినిమాలకు అసలైన హీరో ఎవరో తేలిపోయింది
Related image2
Ramya Krishnan: కృష్ణవంశీకి రమ్యకృష్ణనే మొగుడా?.. భర్తకి శివగామి క్రేజీ కౌంటర్‌
34
నాపై నిరాధార ఆరోపణలు- నటి హేమ
Image Credit : Asianet News

నాపై నిరాధార ఆరోపణలు- నటి హేమ

నటి హేమ మాట్లాడుతూ, ఈ మాదక ద్రవ్యాల కేసులో తనపై వచ్చిన ఆరోపణలు మానసికంగా తీవ్రంగా కలచివేశాయని చెప్పారు. ఆ సమయంలో చచ్చిపోవాలనిపించిందని సంచలన కామెంట్‌ చేసింది. అంతగా మానసికంగా కుంగిపోయినట్టు ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే చివరకు నిర్దోషిగా బయటకు వచ్చానని స్పష్టం చేసింది. మాదక ద్రవ్యాల కేసు వ్యవహారంలో కొన్ని మీడియా సంస్థలు తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ బురదజల్లాయని ఆమె ఆరోపించింది. ఆ వార్తల కారణంగా తన వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా బాధపడ్డారని చెప్పింది. `నా కుటుంబం చాలా సఫర్ అయింది. మాకు ఇది చాలా కఠినమైన కాలం` అని ఆమె పేర్కొంది. అయితే మొత్తం మీడియాను ఒకే తాటిపై వేయలేమని, నిజాయితీగా వ్యవహరించే మీడియా సంస్థలు తనకు సపోర్ట్ గా నిలుస్తాయని తాను నమ్ముతున్నానని హేమ తెలిపింది.

44
మూడున్నర దశాబ్దాలుగా నటిగా రాణిస్తోన్న నటి హేమ
Image Credit : Asianet News

మూడున్నర దశాబ్దాలుగా నటిగా రాణిస్తోన్న నటి హేమ

దాదాపు 36ఏళ్లుగా సినిమాల్లో ఉన్న నటి హేమ ఇప్పటి వరకు 250-300కిపైగా చిత్రాలు చేసింది. `బాల గోపాలుడు`, `భలే దొంగ`, `జయమ్ము నిశ్చయమ్మురా`, `అగ్గిరాముడు`, `రౌడీగారి పెళ్లాం`, `క్షణం క్షణం`, `మనీ`, `వారసుడు`, `మెకానిక్‌ అల్లుడు`, `నువ్వు నాకు నచ్చావ్‌`, `మురారి`, `జయం మనదేరా`, `నీ స్నేహం`, `వసంతం`, `పల్లికిలో పెళ్లికూతురు`, `మల్లీశ్వరి`, `శ్రావణమాసం`, `అందరివాడు`, `సోగ్గాడు`, `అతడు`, `టాటా బీర్లా మధ్యలో లైలా` ఇలా అనేక చిత్రాలు చేసింది. ఇందులో `అతడు`లో ఆమె కామెడీ మాత్రం వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. అయితే ఇటీవల ఆమె సినిమాల్లో కనిపించడం తగ్గింది. కానీ వివాదాల్లోనే ఎక్కువగా నిలుస్తోంది. మరి ఇకపై సినిమాల్లో మెరుస్తుందేమో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hero Change: పవన్‌ కళ్యాణ్‌, ప్రభాస్‌, బాలకృష్ణ, రామ్‌ చరణ్‌ ఇకపై హీరోలు కాదు.. సినిమాలకు అసలైన హీరో ఎవరో తేలిపోయింది
Recommended image2
Chiranjeevi: చిరంజీవిని తిట్టినవాళ్ళెవరూ ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు.. వివి వినాయక్ సంచలన వ్యాఖ్యలు
Recommended image3
Dhurandhar 2 Box Office: ఆదివారం 'ధూరందర్ 2' రికార్డ్ మిస్.. 'బాహుబలి 2'ని దాటినా, ఆ సినిమా వెనకే
Related Stories
Recommended image1
Hero Change: పవన్‌ కళ్యాణ్‌, ప్రభాస్‌, బాలకృష్ణ, రామ్‌ చరణ్‌ ఇకపై హీరోలు కాదు.. సినిమాలకు అసలైన హీరో ఎవరో తేలిపోయింది
Recommended image2
Ramya Krishnan: కృష్ణవంశీకి రమ్యకృష్ణనే మొగుడా?.. భర్తకి శివగామి క్రేజీ కౌంటర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved