- Home
- Entertainment
- పెళ్ళైన నటుడ్ని ప్రేమించా, 40 రోజులు అతడితో జర్నీ.. లవ్ ఎఫైర్ పై విష్ణుప్రియ ఓపెన్ కామెంట్స్
పెళ్ళైన నటుడ్ని ప్రేమించా, 40 రోజులు అతడితో జర్నీ.. లవ్ ఎఫైర్ పై విష్ణుప్రియ ఓపెన్ కామెంట్స్
టాలీవుడ్ హాటెస్ట్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది.

టాలీవుడ్ హాటెస్ట్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది.
సోషల్ మీడియాలో బోల్డ్ గా గ్లామర్ ఫోజులు ఇవ్వడంలో ఈ యంగ్ బ్యూటీ ఏమాత్రం వెనుకడుగు వేయదు. విష్ణుప్రియ తరచుగా చేసే ఫోటోషూట్స్ కుర్రకారుని నిద్రలేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం విష్ణు ప్రియా సిసినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
తాజాగా విష్ణుప్రియ తన లవ్ ఎఫైర్ పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న సిక్స్త్ సెన్స్ సీజన్ 5 ప్రస్తుతం కొనసాగుతోంది. ఉత్కంఠ రేకెత్తించే ఫన్ గేమ్ షోగా సిక్స్త్ సెన్స్ ఆడియన్స్ నిఆకట్టుకుంటోంది. ఇటీవల జరిగిన షోకి రవి, విష్ణుప్రియ హాజరయ్యారు.
Vishnupriya
ఈ షోలో ఓంకార్ విష్ణుప్రియని లవ్ ఎఫైర్ గురించి ప్రశ్నించాడు. నార్మల్ గా తమ ప్రేమ వ్యవహారాల్ని బయట పెట్టేందుకు నటీమణులు ఇష్టపడరు. ఒక వేళ అలాంటివి ఉన్నా లేదు సింగిల్ అనే చెబుతారు. కానీ విష్ణుప్రియ ఏకంగా తాను పెళ్ళైన హీరోని లవ్ చేసినట్లు బోల్డ్ కామెంట్స్ చేసింది.
ఆయన గురించి చెబితే వయసు తేడా కదా అని అంటారు. జెడి చక్రవర్తిగారిని నేను ఇష్టపడ్డాను.. ప్రేమించాను అంటూ విష్ణుప్రియ అందరిని షాక్ కి గురిచేసింది. ఓ వెబ్ సిరీస్ కోసం మంగుళూరులో ఆయనతో 40 రోజులు జర్నీ చేశా. పదవరోజే అయ్యాయి వ్యక్తిత్వానికి ఫ్లాట్ అయ్యా. గత ఏడాదే ఆయనకి ప్రపోజ్ చేశాను. చాలా విషయాల్లో నాకు జెడి చక్రవర్తి గారు నచ్చేసారు. పెళ్లి గురించి మాట్లాడుతూ నేనైతే ప్రపోజ్ చేశాను.. ఆయన నుంచి రెస్పాన్స్ రావాల్సి ఉంది.
ఆంటీ ఒప్పుకుంటే వాళ్ళ ఇంటికి కోడలిగా వెళతా అంటూ విష్ణుప్రియ బాంబు పేల్చింది. అయితే జెడి చక్రవర్తి 2016లోనే వివాహం చేసుకుని ఓ ఇంటివారయ్యారు. ఓంకార్ అడిగారు కాబట్టి అటెన్షన్ కోసం విష్ణు ప్రియా ఇలా వాగింది.. అందులో నిజం ఉండే అవకాశం లేదు అని కొందరు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.