- Home
- Entertainment
- వచ్చే జన్మంటూ ఉంటే నీ కూతురుగానే పుడతా.. అమ్మని గుర్తు చేసుకుని షోలోనే యాంకర్ విష్ణు ప్రియ కన్నీరుమున్నీరు
వచ్చే జన్మంటూ ఉంటే నీ కూతురుగానే పుడతా.. అమ్మని గుర్తు చేసుకుని షోలోనే యాంకర్ విష్ణు ప్రియ కన్నీరుమున్నీరు
యాంకర్ విష్ణు ప్రియా ఈ ఏడాది ప్రారంభంలో తన తల్లిని కోల్పోయింది. తాజాగా అమ్మని గుర్తు చేసుకుని కన్నీరుమన్నీరయ్యింది. అందరి చేతి కన్నీళ్లు పెట్టించింది.

`పోరాపోవే`షోతో యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది విష్ణుప్రియా. ఆమె ఈ షోతో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత పలు షోస్‌లో పాల్గొని అలరించింది. యూట్యూబ్‌లో సాంగ్స్, రీల్స్ చేస్తూ మరింత ఫేమస్ అయ్యింది. దీనికితోపాడు డాన్సు వీడియోలతో అదరగొట్టింది. ఆధ్యాత్మిక చింతనలో ఉంటూ ఇన్‌స్పైర్ చేస్తున్న విష్ణుప్రియా ఇటీవల తన తల్లిని కోల్పోయింది. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెడుతూ, ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది.
చాలా రోజులు ఇంటికే పరిమితమైన విష్ణు ప్రియా.. చాలా రోజులుగా బిగ్ బాస్ ఫేమ్, హీరో మానస్‌తో కలిసి వీడియో సాంగ్‌లు చేస్తుంది. కవర్ సాంగ్‌లతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా జానపద పాటలతో కూడిన పాటలు చేస్తూ అలరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ టీవీ షోలో పాల్గొంది. మదర్స్ డే స్పెషల్‌గా ఈటీవీలో నిర్వహించిన `ప్రియమైన అమ్మకు` పేరుతో ఓ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఇందులో జబర్దస్త్ కమెడియన్లంతా పేరెంట్స్ తో వచ్చారు. విష్ణుప్రియపై హైపర్ ఆది వేసిన జోకులు నవ్వులు పూయించాయి.
ఈటీవీతో అనుబంధం ఉన్న ఆర్టిస్టులంతా ఇందులో పాల్గొన్నారు. కామెడీ స్కిట్లతో అలరించారు. అందులో భాగంగా చివర్లో నూకరాజు, రాకింగ్ రాకేష్ కలిసి చేసి అమ్మ స్కిట్ ఆద్యంతం ఆకట్టుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మని ఇద్దరు కొడుకులు నిర్లక్ష్యం చేయడంతో ఆమె కన్నుమూస్తుంది. చనిపోయిన తర్వాత అమ్మా అంటూ వాళ్లిద్దరు ఏడ్చిన తీరు అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. హృదయాలను కదిలించేదిగా ఈ స్కిట్ ఉండటం విశేషం.
ఇందులో పాల్గొన్న విష్ణుప్రియా ఈ స్కిట్ చూసి కన్నీరుమున్నీరయ్యింది. స్టేజ్‌మీదకు వచ్చి మరీ ఆమె భోరున విలపించింది. అమ్మని గుర్తు చేసుకుని అల్లాడిపోయింది. విష్ణుప్రియని చూసిన మిగిలిన వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో షో మొత్తం కన్నీళ్లతో నిండిపోయింది. బరువెక్కిపోయింది. ఈ సందర్భంగా విష్ణు ప్రియా అమ్మని తలుచుకుంటూ మళ్లీ జన్మంటూ ఉంటూ నీ కడుపులోనే పుడతా.. ఐ లవ్యూ, సారీ ఐ లవ్యూ అంటూ ఏడ్చిన తీరు అందరిని కలిచి వేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ షోలో అలనాటి అందాల తార రాశీ పాల్గొనడం విశేషం. ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఇక విష్ణు ప్రియా గ్లామర్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె హాట్ అందాలను ఆవిష్కరిస్తూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. వారికి మరింత దగ్గరవుతుంది. అయితే ఇటీవల గ్లామర్ ట్రీట్‌కి దూరంగా ఉంటుంది. అమ్మ లేని బాధలో ఉన్న ఆమె పూర్తిగా వర్క్ పైనే దృష్టిపెట్టినట్టు తెలుస్తుంది.