డైవర్స్ కోరుతున్న యాంకర్ వర్షిణి.. డేరింగ్ డెసీషన్.. ఈ సారి అదృష్టం వరించేనా?
వర్షిణి సౌందరాజన్.. యాంకర్‌గా ఎంతటి ఫేమస్సో తెలిసిందే. హాట్ యాంకర్‌గా బుల్లితెరపై సందడి చేసిన ఈ భామ సిల్వర్ స్క్రీన్‌పై కూడా తన అదృష్టాన్నిపరీక్షించుకునేందుకు రెడీ అవుతుంది. అందులో భాగంగా మరో ప్రయత్నం చేసింది.

యాంకర్ వర్షిణి సౌందర్‌రాజన్ సినిమాల ద్వారానే ఆడియెన్స్ కి పరిచయమైంది. అయితే యాంకర్‌గా చేస్తూనే ఓ వైపు వెబ్ సిరీస్‌లు, మరోవైపు సినిమాల, ఇంకో వైపు టీవీ షోస్ ఇలా మూడు రంగాల్లో రాణిస్తూ బిజీగా గడుపుతుంది. ఇటీవల సరైన షోలు లేక, సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న ఈ బ్యూటీ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.
ఇదిలా ఉంటే ఉన్నట్టుంది వర్షిణి విడాకులకు డిమాండ్ చేస్తుంది. ఇంకా పెళ్లి కూడా కాలేదు.. అప్పుడే డైవర్స్ ఏంటీ? అనుకుంటున్నారా? ప్రస్తుతం ఆమె సుమంత్‌తో కలిసి `మళ్లీ మైదలైంది` సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రం జీ5లో ఫిబ్రవరి 11న విడుదల కాబోతుంది.
దీనికి సంబంధించిన టీజర్ విడుదలైంది. ఇందులో సుమంత్‌తో తాను విడాకులకు డిమాండ్ చేస్తుంది వర్షిణి. ఆయనతో ఉండలేకపోతున్నానని, తనకు డైవర్స్ కావాలని, పెద్దలు అన్నపూర్ణమ్మ, సుహాసినితో అంటుంది. అందుకు అన్నపూర్ణమ్మ స్పందిస్తూ, పోయాడ్రా దరిద్రుడు అనుకున్నా. వీడి రూపంలో వచ్చాడు అంటూ ఆమె ఫైర్ అవుతుంది. ఇప్పుడెవరి గురించే అని సుమంత్ అనగా, మీ తాత గురించి. ఉన్నన్ని రోజులు ఏడిపించుకు తిన్నాడు. నేను కాబట్టి సరిపెట్టుకున్నా. ఈ కాలం పిల్లలెలా సరిపెట్టుకుంటారు అంటూ మండి పడుతుంది.
ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అయితే ఇందులో వర్షిణి.. సుమంత్‌తో కలిసి ఓ హీరోయిన్‌గా కనిపిస్తుండటం విశేషం. నైనా గంగూలీ, పావనీ రెడ్డిలతో కలిసి వర్షిణి కూడా ఓ హీరోయిన్‌గా నటిస్తుంది. వర్షిణిపై వచ్చే ఈ లేటెస్ట్ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
అయితే `చందమామ కథలు` చిత్రంలో కీలకపాత్రలో నటించి మెప్పించిన వర్షిణి సౌందరాజన్, ఆ తర్వాత `లవర్స్`, `కాయ్ రాజా కాయ్`, `బెస్ట్ యాకర్ట్స్`, `శ్రీ రామ రాక్ష`, `నన్ను దోచుకుందువటే`, `జోడి` చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలన్నీ పరాజయం చెందాయి. దీంతో వర్షిణికి పెద్దగా గుర్తింపు రాలేదు.
కానీ ఆమెకి `పెళ్లి గోల` అనే వెబ్ సిరీస్ విశేష గుర్తింపుని తీసుకొచ్చింది. వీటితోపాటు `ఢీ` షోతో మరింతగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇందులో యాంకర్‌గా మెప్పించింది కొన్ని రోజులైనా తన మార్క్ ని చాటుకుంది. హైపర్ ఆదితోపులిహోర కలుపుతూ రెచ్చిపోయింది. ఉన్నట్టుండి దాన్నుంచి బయటకు వచ్చిన వర్షిణి.. కొన్నాళ్లపాటు `కామెడీస్టార్స్` లో మెరిసింది. ఇప్పుడు అడపాదడపా టీవీ షోలో కనిపిస్తూ అలరిస్తుంది.
ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత మళ్లీ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. అయితే థియేటర్‌లో విడుదల కావాల్సిన `మళ్లీ మొదలైంది` సినిమా కారోనా కారణంగా ఓటీటీలో విడుదలవుతుంది. మరి ఈ చిత్రంతోనైనా వర్షిణికి గుర్తింపు పేరు వస్తుందేమో చూడాలి.