MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ఉదయభానును అవమానించిన సింగర్ సునీత, ఈవెంట్ కి పిలిచీ మరీ... ఇద్దరి మధ్య ఇంత పంచాయితీ జరిగిందా?

ఉదయభానును అవమానించిన సింగర్ సునీత, ఈవెంట్ కి పిలిచీ మరీ... ఇద్దరి మధ్య ఇంత పంచాయితీ జరిగిందా?

ఒకప్పుడు స్టార్ యాంకర్ గా వెలిగింది ఉదయభాను. ఆమె పలు ఈవెంట్స్ హోస్ట్ చేసింది. కాగా ఓ సందర్భంలో సింగర్ సునీత తనను అవమానించిందని ఉదయభాను అన్నారు. వారి మధ్య పెద్ద పంచాయితీనే జరిగిందని వాళ్ళ మాటలను బట్టి తెలుస్తుంది.   

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 27 2024, 12:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


ఉదయభాను ఒకప్పుడు బుల్లితెరను ఊపేసిన యాంకర్. సుమ కనకాలకు మించిన ఫేమ్ ఆమె సొంతం. తన మాటలతో ఈవెంట్ ఏదైనా జోష్ నింపేది ఉదయభాను. పదుల సంఖ్యలో టీవీ షోలు చేసింది ఉదయభాను. అనేక ఈవెంట్స్ కి హోస్ట్ గా వ్యవహరించింది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
udayabhanu

udayabhanu

కాగా ఉదయభాను-సింగర్ సునీత మధ్య కోల్డ్ వార్ నడిచిందనే వాదన ఉంది. సునీత ఏర్పాటు చేసిన ఓ ఈవెంటులో ఉదయభానుకు అవమానం జరిగిందట. ఈ మేరకు సునీతను ఉద్దేశిస్తూ ఉదయభాను పరోక్ష కామెంట్స్ చేసింది. అమెరికాలో నిర్వహించిన ఈవెంట్లో  సునీత అవమానించిందని ఉదయభాను అన్నారు. 

36
Singer Sunitha

Singer Sunitha

ఉదయభాను కామెంట్స్ పై ఓ ఇంటర్వ్యూలో సునీత స్పందించారు. ఉదయభానును నేను అవమానించానని ఆమె ఫీల్ అవుతున్న విషయం నాకు అసలు తెలియదు. నాతో సరిగా మాట్లాడేది కాదు. పలకరించినా పక్కకు వెళ్లిపోయేది. తర్వాత ఆమె ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా చేసిన కామెంట్స్ తో నాకు అర్థమైంది. నా గురించి ఆమె అలా అనుకుంటుందా అని. 
 

46

నిజానికి ఆ ఈవెంట్ కి నేను ఆమెను ఇన్వైట్ చేయలేదు. ఆర్గనైజర్స్ హోస్ట్ చేయడానికి పిలిచారు. ఆ ఈవెంట్లో ఉదయభాను వేదిక మీదకు వెళుతుంటూ నా ఆర్కెస్ట్రా నీరసంగా ఉండే ఓ ట్రాజిక్ మ్యూజిక్ కొట్టారట. దానికి ఆమె హర్ట్ అయ్యారట. అసలు ఉదయభానును నేను అవమానించడానికి, జెలస్ ఫీల్ కావడానికి కారణం ఏమి ఉంటుంది. 
 

56


ఉదయభాను తనకు తాను ఏదో ఊహించుకుని నేను అవమానించానని మాట్లాడటం మానేసింది. ఆమె ఇండైరెక్ట్ చేసిన కామెంట్స్ కి మీడియాలో నా పేరు వచ్చింది. అందుకే నేను రెస్పాండ్ కావాల్సి వచ్చిందని సునీత అన్నారు. మొత్తంగా ఉదయభాను-సునీత మధ్య మనస్పర్థలు తలెత్తాయని వారి కామెంట్స్ తో అర్థం అవుతుంది. 

 

66
Singer Sunitha And Anchor Udayabhanu

Singer Sunitha And Anchor Udayabhanu

ప్రస్తుతం ఉదయభాను ఫేమ్ తగ్గింది. గతంలో మాదిరి ఆమెకు ఆఫర్స్ రావడం లేదు. ఒక దశలో ఉదయభాను హీరోయిన్ గా కూడా చిత్రాలు చేయడం విశేషం. వ్యక్తిగత వివాదాలు ఆమె కెరీర్ ని దెబ్బ తీశాయి. ఇక సునీత హవా కూడా తగ్గింది. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved