సుమ గర్భవతిగా ఉన్నప్పుడు రాజీవ్ కనకాల అలాంటి పనులు చేసేవాడా..పాతికేళ్ల తర్వాత క్షమాపణ
రాజీవ్ విషయంలో తాను బాధపడ్డ సందర్భాలు కూడా సుమ గుర్తు చేసుకుంది. ఎప్పుడు అడిగినా 5 నిమిషాలలో వచ్చేస్తా అని చెబుతాడు. కానీ ఎప్పుడూ రాడు. ఆ విధంగా చాలా సార్లు చేశాడు అని సుమ వాపోయింది.
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినా అక్కడ సుమ కనకాలనే కనిపిస్తుంటారు. గత ఏడాది సుమ తన కొడుకు రోషన్ కనకాలని హీరోగా లాంచ్ చేసింది. బబుల్ గమ్ చిత్రంతో సుమ, రాజీవ్ కనకాల ముద్దుల కొడుకు రోషన్ హీరో అయ్యాడు.
అయితే బబుల్ గమ్ మూవీ పర్వాలేదనిపించే విధంగా ఆడింది. రోషన్ పెర్ఫామెన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. తల్లిగా సుమ తన భాద్యతని నిర్వహించింది. ఇకపై రోషన్ కనకాల ఎలాంటి చిత్రాలు చేస్తాడనేది ఆసక్తిగా మారింది. అయితే సుమ పర్సనల్ లైఫ్ గురించి తరచుగా రూమర్స్ వస్తూనే ఉండడం చూస్తున్నాం. సుమ రాజీవ్ కనకాల మధ్య విభేదాలు ఉన్నాయని ఆ మధ్యన పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి.
అయితే ఆ రూమర్స్ గురించి రోషన్ కనకాల కూడా క్లారిటీ ఇచ్చాడు. అందరు భార్య భర్తల లాగే వీళ్ళు కూడా గొడవ పడతారు ఆ తర్వాత కలసి పోతారు అని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఏది ఏమైనా సుమ, రాజీవ్ కనకాల దాంపత్య జీవితానికి 25 ఏళ్ళు గడిచాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకుని పాతికేళ్ళు గడిచిన సందర్భంగా సుమ సోషల్ మీడియాలో ఒక వీడియో వదిలింది.
ఈ వీడియో చూస్తుంటే సుమ, కనకాల తమ మ్యారేజ్ డే ని చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చ్చేసుకున్నట్లు ఉన్నారు. వృద్ధాశ్రమంలో కూడా సుమ, రాజీవ్ గడిపారు. తమ పెళ్లి రోజు సందర్భంగా సుమ ఒక కార్యక్రమం నిర్వహించింది. తన యూట్యూబ్ ఛానల్ లో ఉన్న సబ్ స్క్రైబర్లు అడిగిన ప్రశ్నలకు సుమ, కనకాల ఇద్దరూ సమాధానాలు ఇచ్చే కార్యక్రమం.
ఈ కార్యక్రమంలో సుమ, రాజీవ్ ఇద్దరూ తమ వ్యక్తిగత విషయాలని పంచుకున్నారు. పెళ్ళైన కొత్తలో భార్య కోసం సమయం కేటాయించాలని రాజీవ్ కనకాల సూచించారు. అవును పార్ట్నర్ కి ఎక్కువ సమయం కేటాయించాలి.. అలాగే పిల్లలు పుట్టాక బాధ్యతలు పంచుకోవాలి అని తెలిపింది.
మీ భార్యకి తెలియకుండా ఆమె ఫోన్ ఎప్పుడైనా చెక్ చేశారా అని అడిగారు.. దీనికి రాజీవ్ లేదు అలా ఎప్పుడూ చేయలేదు అని తెలిపింది. ఇదే ప్రశ్న సుమని అడిగితే.. నేనైతే ఒకసారి చెక్ చేశాను అని నవ్వుతూ చెప్పింది. దీనితో రాజీవ్ కనకాల షాక్ అయ్యారు. కానీ అందులో ఏమీ దొరకలేదు అని సుమ తెలిపింది. దొరికేలాగా ఎందుకు పెడతాం అని రాజీవ్ సెటైర్ వేశాడు.
ఇక రాజీవ్ విషయంలో తాను బాధపడ్డ సందర్భాలు కూడా సుమ గుర్తు చేసుకుంది. ఎప్పుడు అడిగినా 5 నిమిషాలలో వచ్చేస్తా అని చెబుతాడు. కానీ ఎప్పుడూ రాడు. ఆ విధంగా చాలా సార్లు చేశాడు అని సుమ వాపోయింది. దీనితో రాజీవ్ కనకాల క్షమాపణ కోరాడు. భర్త క్షమించమని అడగడంతో సుమ సంబరపడిపోయింది. మరో విషయంలో రాజీవ్ కనకాల ఆమెని బాధపెట్టాడట. రాజీవ్ ఎక్కువగా దెయ్యాలు, హర్రర్ కంటెంట్ ఉన్న సినిమాలకే తీసుకువెళ్లేవాడట. తాను గర్భంతో ఉన్నప్పుడు కూడా అలాంటి సినిమాలే చూపించాడని సుమ బాధపడింది.